ఒక్కసారి శృంగారంలో పాల్గొంటే భార్యభర్తలు ఇద్దరూ తృప్తిగా ఫీలౌతారనే గ్యారెంటీ ఏమీ లేదంటున్నారు నిపుణులు. పురుషులకు తమ అంగం నుంచి వీర్యం బయటకు వస్తే చాలు తృప్తి చెందుతారు. అయితే స్త్రీల విషయంలో మాత్రం అంది కుదరదు.
నిజంగా వాళ్లు తృప్తి చెందారో లేదో కూడా చాలా మంది పురుషులు పట్టించుకోరు. అయితే.. జీస్పాట్ ద్వారా స్త్రీలు త్వరగా తృప్తి చెందుతారనే నమ్మకం చాలా మంది ఉంది.
జీస్పాట్ అంటే స్త్రీ శరరీంలోని ఓ చిన్ని ప్రాంతం. శరీరంలో లోతుగా ఉంటుందట. స్త్రీ అంగం నుంచి వేలితో లోపలికి పెట్టి... సున్నితంగా స్పృశిస్తే... స్త్రీలు తీవ్ర ఉద్వేగానికి గురౌతారని చాలా మంది భావిస్తుంటారు. అయితే.. ఇది ఎంత వరకు నిజమే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.
కాగా... ఈ విషయంపై నిపుణులు స్పందించారు. జీ స్పాట్ ను ప్రేరేపిస్తే స్త్రీలకు భావప్రాప్తి కలిగే అవకాశం కచ్చితంగా ఉందని చెప్పలేం అంటున్నారు. నిజానికి చాలా మందికి అసలు అది ఎక్కడ ఉంటుందనే విషయం కూడా చాలా మందికి తెలీదంటున్నారు నిపుణులు.
యోని లోపల ముందువైపు గోడ పైభాగంలో నాడీ చివళ్లన్నీ ఒకేచోట కేంద్రీకృతమైన ప్రాంతం ఒకటి ఉంటుంది. దీన్ని మొదటగా గ్రిఫెన్ బర్గ్ అనే శాస్త్రవేత్త గుర్తించారు.ఆయన పేరుతోనే దీనిని జీ స్పాట్ గా పిలవడం మొదలుపెట్టారు.
నాడీ చివర్లు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతం ప్రేరేమితమైతే ఎంతో గాఢమైన తృప్తి కలుగుతుందని కొందరు వాదిస్తుంటారు. నిజానికి దీనికి అంతటి ప్రభావం ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు.
అయితే.. యోని పైభాగాన ఓ బుడిపెలాంటిది ఉంటుంది. దానిని తాకితే మాత్రం భావప్రాప్తి కలగడం మాత్రం కచ్చితంగా జరుగుతుందని చెబుతున్నారు.