విరహవేదన ఎంత కష్టంగా ఉంటుందో ప్రేమికులకు అడిగితే తెలుస్తుంది.
కరోనా కష్టకాలంలో.. లాక్ డౌన్ లో కలుసుకోలేకపోవడం, ఒకరినొకరు చూసుకోకుండా.. చిరుముద్దులు పంచుకోకుండా ఉండడం హార్ట్ బ్రేకింగ్ విషయమే.
లాక్ డౌన్ పుణ్యమా అని ఇద్దరూ వేర్వేరు చోట్ల ఇరుక్కుపోయిన ప్రేమికులు తమ ప్రేమలో దూరం పెరగకుండా ఉండాలంటే.. విరహాన్ని జయించాలంటే.. లాక్ డౌన్ లో లాక్డ్ రూంలో నుంచే డేటింగ్ చేయాలంటే కొన్ని చిట్కాలు ఇవి...
ఆన్‌లైన్ మూవీ నైట్ : ఇప్పుడు ఆన్ లైన్ లో ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రెండు వేర్వురే చోట్ల ఉండే వ్యక్తులు కలిసి ఒకేసారి సినిమా చూసే అవకాశం కల్పించే యాప్ లు కూడా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి.

When she was asked about dating she stated that she had not dated anyone for the longest time, it's not her priority and she only wants to focus on her work.
సో.. ఆ యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఎంచక్కా నైట్ ఇద్దరూ కలిసి ఓ రొమాంటిక్ మూవీ చూడండి. మీ విరహవేదనను దీంతో కాసేపు దూరం చేసుకోండి. అయితే సినిమా చూసేప్పుడు స్నాక్స్ రెడీగా పెట్టుకోవడం మరిచిపోవద్దు.
క్యాండిల్ లైట్ డిన్నర్.. మీ లవర్ కు వీడియో కాల్ చేసి.. మీ రూం అంతా చక్కగా కనిపించేలా ఓ ప్లేస్ లో పెట్టండి. ఇప్పుడు రూంలో లైట్ ఆర్పేసి.. క్యాండిల్ వెలిగించి.. ఫోన్ లో అతను.. ఇక్కడ మీరు ఎంచక్కా స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ డిన్నర్ చేయండి.
అయితే ఈ ప్లాన్ కు ముందు ఇంటర్నెట్ లో ఇంటరప్షన్ రాకుండా చూసుకుంటే మీ ప్రేమ యాత్రలో ఆటంకం ఉండదు.
ఆన్ లైన్ డేటింగే తప్పనిసరి ఆప్షన్ అయినప్పుడు... వీడియో కాల్సే మిమ్మల్ని ఆదుకునే మంత్రాలు.. సో ఇద్దరూ కలిసి ఏదైనా వంట చేయండి.
కేక్ తయారు చేయడమో, డెజర్ట్ తయారు చేయడమో వీడియోకాల్ లో సలహాలు, సూచనలు, చిలిపి ముద్దులు, అలకలతో ముగించండి.
మీ ప్రేమికుడు కూడా చేయడానికి ఇష్టపడితే ఇద్దరూ సేమ్ టైంలో కేక్ బేక్ చేయడమో, డెజర్ట్ చేయడమో కలిసి చేయండి.. ఇద్దరిలో ఎవరిది బాగా వస్తుందో సరదా కాంపిటీషన్ పెట్టుకోండి.
కొన్నిసార్లు ఇద్దరే బోర్ కొడితే.. మీ ఫ్రెండ్ ను తన భాగస్వామితో కలిసి మీ వీడియో కాల్ లో యాడ్ చేసుకోండి. రెండు జంటలు, నలుగురు వ్యక్తులు.. వారి వారి ఇళ్లలో నుంచి మాట్లాడుకుంటూ, స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ... వైన్ సిప్ చేస్తుంటే.. మీరు మీ ఇంట్లోనే ఉన్నారన్న ఫీలింగ్ దూరమవుతుంది.
రాత్రిపూట డేటింగ్.. ఛాటింగ్ లతో పాటు ఉదయాన్నే మెడిటేషన్ కూడా కలిసి చేయండి. వీడియో కాల్ తో ఇలాంటి ప్రయోజనాలు మీ ఇద్దరి మధ్యనున్న దూరం దగ్గరవుతుంది. మీరేం చేస్తున్నారో.. మీ పార్ట్ నర్ ఏం చేస్తున్నాడో మీ ఇద్దరికీ ఓ అంచనా ఉంటుంది. ఇది అపోహలను రాకుండా చూస్తుంది.

కలిసి వర్కవుట్స్ చేయండి. జిమ్ దుస్తులు వేసుకుని రెడీ అవ్వండి. మీ పార్టనర్ ను కూడా అలాగే చేయమనండి.. వర్కవుట్స్ చేస్తూ ఇద్దరూ ఒకర్నొకరు ఉత్సాహపరుచుకోవడం బాగుంటుంది. హెల్తీ లైఫ్ కోరుకునేవారికి ఇది బాగా వర్కవుట్ అవుతుంది.