లైంగిక సమస్యలు.. ప్రతి నలుగురిలో ఒకరికి..!

First Published | Mar 31, 2021, 3:13 PM IST

ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం కోసమే డాక్టర్లను ఆన్‌లైన్‌లో సంప్రదించారు.

ప్రస్తుత కాలంలో యువతలో లైంగిక సమస్యలు పెరిగిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గతేడాది కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో.. చాలా మంది డాక్టర్లను ఆన్ లైన్ ద్వారా సంప్రదించారు. వారిలో ఎక్కువ మంది లైంగిక సమస్యలతోనే బాధపడుతున్నట్లు తెలియడం గమనార్హం.
వైద్యులను ఆన్ లైన్ లో సంప్రదించడానికి ఉపయోగించే ప్రాక్టో యాప్ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గతేడాదితో పోలిస్తే.. ఆన్ లైన్ లో వైద్యులను సంప్రదించేవారు 15శాతం పెరిగారని నిపుణులు చెబుతున్నారరు.

ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం కోసమే డాక్టర్లను ఆన్‌లైన్‌లో సంప్రదించారు. మహిళల్లో అధికశాతం మంది మరీ ముఖ్యంగా యుక్త వయసు మహిళలు అత్యంత అరుదైన సెక్స్‌సోమ్నియా, అనోగాస్మియా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని కూడా అధ్యయనం వెల్లడించింది.
ఒత్తిడి, నిద్రలేమి, ఇతర జీవనశైలి మార్పులు వంటివి దీనికి కారణాలుగా డాక్టర్లు చెబుతున్నారు. ఇదే విషయమై మెడిసెక్స్‌ వద్ద సైకో సెక్స్యువల్‌-రిలేషన్‌షిప్‌ థెరపిస్ట్‌ డాక్టర్‌ వినోద్‌ చెబ్బీ మాట్లాడుతూ.. లైంగిక ఆరోగ్య అవసరాలను గురించి గతంలో చర్చించడానికి భయం లేదంటే సిగ్గు పడటం ఎక్కువగా కనిపించేది. టెలీకన్సల్టేషన్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత ధైర్యంగా వారు తమ సమస్యలను చెప్పగలుగుతున్నారన్నారు.
మెట్రోయేతర నగరాల నుంచి ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ల సంఖ్య 60% పెరిగింది. ముఖ్యంగా టియర్‌ 2 నగరాల నుంచి లైంగిక సమస్యల కోసం కన్సల్టేషన్స్‌ పెరిగాయి.
మొత్తం లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య కన్సల్టేషన్‌లలో 21-30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తులు 62%, 31-40 సంవత్సరాల వ్యక్తులు 22%, 41-50 సంవత్సరాల వ్యక్తులు 2% మంది ఉన్నారు.
21-30 సంవత్సరాల మహిళలు గర్భధారణ, క్రమరహితమైన ఋతుచక్రం, పీసీఓడీ, సెక్స్‌సోమ్నియా, అబార్షన్‌ గురించి ఎక్కువగా అడిగారు.
31-40 సంవత్సరాల మహిళలు సంతానలేమి, శీఘ్ర స్కలనం, ఆలస్యంగా గర్భం దాల్చడం వంటి సమస్యలను గురించి చర్చిస్తే, 40ఏళ్లు దాటిన మహిళలు విపరీతమైన లైంగిక వాంఛలు, లైంగిక వాంఛలు తీర్చుకోవడంవల్ల కలిగే అంటువ్యాధులు, మెనోపాజ్‌ తదితర సమస్యలను గురించి మాట్లాడారు.
అత్యధిక శాతం మహిళలు డాక్టర్లను ఈ సమస్యలను గురించి సంప్రదించిన నగరాల్లో ఢిల్లీ, బెంగళూరు,హైదరాబాద్‌ వరుస స్ధానాల్లో ఉన్నాయి.

Latest Videos

click me!