శృంగారానికి ముందు ఫోర్ ప్లేలో పాల్గొన్నారంటే..!

First Published | Nov 30, 2023, 12:04 PM IST

సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనాలంటే ఫ్లోర్ ప్లేలో ఖచ్చితంగా పాల్గొనాలంటారు నిపుణులు. ఫోర్ ప్లేలో ముద్దు పెట్టుకోవడమే కాదు మరెన్నో ఉంటాయి. అసలు ఫోర్ ప్లే మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 

సెక్స్ ను ఎక్కువ సేపు ఆస్వాదించాలంటే ఫోర్ ప్లేను మిస్ కావొద్దంటారు నిపుణులు. ఫోర్ ప్లే మీ ఉత్తేజాన్ని పెంచడమే కాకుండా మీ సాన్నిహిత్యాన్ని కూడా పెంచుతుంది. అలాగే ఇది శారీరక, భావోద్వేగ సంబంధాన్ని కూడా ఏర్పరుస్తుంది.

Sex Life

ఫోర్ ప్లే అంటే ఏమిటి?

జస్ట్ ముద్దు పెట్టుకోవడమే కాదు ఫోర్ ప్లేలో ఎన్నో ఉంటాయి. "ఫోర్ ప్లే అనేది లైంగిక కలయికకు ముందు వార్మప్ లాంటిది. ఇది భాగస్వాముల మధ్య ఉత్సాహాన్ని, సాన్నిహిత్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. దీనిలో సరసాలు, నృత్యం, కొవ్వొత్తుల విందు, ముద్దు, స్పర్శ, ఇతర సన్నిహిత కార్యకలాపాలు ఉంటాయి. కలయికకు ముందు ఇవి మీకు సెక్స్ కోరికలను పెంచడానికి సహాయపడతాయి. అలాగే మీరు భావప్రాప్తిని పెందేందకు కూడా సహాయపడతాయి. 
 


ఫోర్ ప్లే ఎందుకు ముఖ్యం?

శృంగారంలో ఫోర్ ప్లే అత్యంత ఆహ్లాదకరమైన భాగంగా ఉండటమే కాకుండా ఇది మీకు ఎంతో సహాయపడుతుంది.  ముఖ్యంగా భాగస్వాములిద్దరికీ..  మీర ముఖ్యంగా మహిళలకు సంతృప్తికరమైన, సౌకర్యవంతమైన అనుభవాన్ని కలిగిస్తుంది. మరి ఫోర్ ప్లే ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 

ఉద్వేగం

ఆడవారికి ఫోర్ ప్లే చాలా అవసరం. ఎందుకంటే ఇది వారిలో ఉద్వేగాన్ని ప్రేరేపించడానికి సహాయపడుతుంది. ఇది యోని సహజ కందెన రిలీజ్ అయ్యేలా చేస్తుంది. సంభోగం సమయంలో సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణానికి ఈ కందెన చాలా అవసరం. 

Image: Getty

శారీరక, భావోద్వేగ సంబంధం

ఫోర్ ప్లే అంటే కేవలం శారీరక స్పర్శ మాత్రమే కాదు. ఇది భాగస్వాముల మధ్య కనెక్షన్, సాన్నిహిత్య భావనను కూడా పుట్టిస్తుంది. ఈ భావోద్వేగ బంధం లైంగిక సంతృప్తికి చాలా అవసరం. ఇది భాగస్వాములు ఒకరి అవసరాలకు ఒకరు అనుగుణంగా ఉండటానికి సహాయపడుతుంది.
 

సున్నితత్వం, ఆనందం

ఫోర్ ప్లే వల్ల రక్తం క్లిటోరిస్ కు  ప్రవహిస్తుంది. దీనివల్ల అది నిటారుగా మారుతుంది. అలాగే ఆనందానికి మరింత సున్నితంగా మారుతుంది. ఈ శారీరక ప్రతిస్పందన మహిళలకు మొత్తం లైంగిక అనుభవాన్ని పెంచుతుంది.

అంచనా, ఉత్సాహం

ఫోర్ ప్లే అంచనా, లైంగిక కోరికలను పుట్టిస్తుంది. కలయిక సమయంలో ఆనందం, అనుభూతిని పెంచుతుంది. ఉత్సాహాన్ని పెంపొందించడానికి,  మీ బంధం బలంగా ఉండేందుకు కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. 
 

అవగాహన, కమ్యూనికేషన్

ఫోర్ ప్లే భాగస్వాములు తమ కోరికలను అర్థం చేసుకోవడానికి, అలాగే వాటిని కమ్యూనికేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది మీరు ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే మీ ఇద్దరికీ సంతృప్తికరమైన లైంగిక ఆనందాన్ని కలిగించడానికి సహాయపడుతుంది. 

Image: Getty Images

ఉద్వేగానికి సమయం

మగవారైతే తొందరగా భావప్రాప్తిని పొందుతారు. కానీ ఆడవారికి అలా కాదు. ఆడవారు భావప్రాప్తికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇందుకు ఫోర్ ప్లే సహాయపడుతుంది. ఇది భాగస్వాముల మధ్య ఉద్వేగ అంతరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఆహ్లాదకరమైన లైంగిక అనుభవాన్ని అందిస్తుంది. 
 

Image: Getty Images

ఆనందాన్ని పెంచుతుంది

ఫోర్ ప్లే సెక్స్ కు ముందు మీ ఆనందాన్ని పెంచుతుంది. 

ఆందోళనను తగ్గిస్తుంది

ఫోర్ ప్లే రిలాక్స్డ్ వాతావరణాన్ని కలిగించడానికి సహాయపడుతుంది, లైంగిక చర్యలో పాల్గొనడానికి ముందు ఫోర్ ప్లే లో పాల్గొంటే మీ యాంగ్జైటీ లేదా ఉద్రిక్తతను తగ్గిస్తుంది. దీంతో మీరు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకారు. 

Latest Videos

click me!