శృంగారం మానవ జీవితంలో చాలా ముఖ్యమైంది. మనిషి పుట్టుకకు కారణం అది. అలాంటిదాన్ని బూతులా చూడకూడదని నిపుణులు చెబుతుంటారు. దీని గురించి అన్ని విషయాలు తెలుసుకోవడంలో తప్పులేదు. ఈ సంగతి పక్కన పెడితే... మనం రోజూ తీసుకునే ఆహార ప్రభావం కూడా సెక్స్ పై ఉంటుంది.
ఈ విషయంపై అనేక పరిశోధనలు చేసిన పరిశోధకులు సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ఆహారపదార్థాలు ఉన్నట్లుగా గుర్తించారు. వీటితో పాటు.. కొన్ని రకాల ఫుడ్ తీసుకుంటే ఆ పనిలో కాస్తా నీరసించి పోతారని తెలియజేస్తున్నారు. ఆ ఫుడ్ ఐటెమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
డెయిరీ ప్రొడక్ట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, ఇవి అరగడానికి చాలా సమయం పడుతుంది. ఈ కారణంగా సెక్స్‌కి ముందు ఈ ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదని సెక్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే క్యాబేజీ సెక్స్ కోరికలను నశింపజేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో మీరు ఆ పనిని ఎంజాయ్ చేయలేరు. సెక్స్‌కి ముందు దీనిని తినకపోవడమే మంచిది.
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలిచ్చే బీన్స్.. సెక్స్ విషయంలో మాత్రం ప్రతికూల ఫలితాలను ఇస్తుందని తేలింది. ఎందుకుంటే ఇందులో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కారణంగా జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఈ సమయంలో గనుక సెక్స్ చేస్తే ఆ ఎఫెక్ట్ జీర్ణాశయంపై పడి పొట్టలో గ్యాస్ పేరుకుపోతుంది. దీని వల్ల అసౌకర్యంగా ఉంటుంది. అలానే జరిగితే అనేక సమస్యలు ఎదురవుతాయి. శృంగార సమయంలో చాలా అసౌకర్యంగా కూడా ఉంటుంది. కాబట్టి సెక్స్‌కి ముందు ఇది తినడం సరికాదని చెబుతున్నారు నిపుణులు.
ఉల్లిపాయలు శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. అయితే, సెక్స్ చేయడానికి ముందు మాత్రం వీటిని తినకూడదు. కారణం లేకపోలేదు. వీటిని తిన్న తర్వాత నోటి నుంచి అదో రకమైన వాసన వస్తుంది. ఇది మీ పార్టనర్‌కి నచ్చకపోవచ్చు. కాబట్టి.. సెక్స్ కి ముందు తినకపోవడమే మంచిది.
కేక్ చూడగానే అందరి నోళ్లు ఉవ్విళ్లూరుతాయి. హ్యాపీగా ఓ పీస్ లాగించేస్తాం. ఇవేనా.. మఫిన్స్, పాస్ట్రీలు ఇలాంటి స్వీట్ ఐటెమ్స్ కూడా సెక్స్ విషయంలో అసౌకర్యంగా కలిగిస్తాయని తేలింది. ఇది కేవలం దంపతుల్లో ఏ ఒక్కరి విషయంలోనే కాదు.. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ శృంగార సామర్థ్యాన్ని నశింపజేస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిది.
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం కూడా ఎంత తక్కువగా తింటే అంత మంచిది. అంతేకాదు శృంగారానికి ముందు కాఫీ కూడా తాగకూడదు.