సెక్స్ తో ఆరోగ్యానికి ఎంతో మేలు.. కానీ ఈ పరిశుభ్రతా చిట్కాలను పాటించలేదో మీ పని అంతే..!

First Published | Oct 12, 2023, 4:27 PM IST

సెక్స్ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నా.. భాగస్వాములిద్దరూ లైంగిక పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. దీనిలో ఏ ఒక్కరూ దీన్ని మిస్ చేసినా ఎన్నో అనారోగ్య సమస్యలను ఇద్దరూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
 

సెక్స్ సమయంలో, ఆ తర్వాత సరైన పరిశుభ్రత పాటించడం చాలా చాలా అవసరం. ఒక వేళ పరిశుభ్రతను పాటించకపోతే మీకు సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు ఎన్నో ప్రమాకరమైన రోగాలు కూడా వస్తాయి. అందుకే లైంగిక పరిశుభ్రతను ఇద్దరూ పాటించాలి.  పరిశుభ్రత లేకపోతే భావప్రాప్తి, ఆనందానికి కూడా అంతరాయం కలుగుతుంది. ఆరోగ్యకరమైన సెక్స్, మంచి లైంగిక ఆనందాన్ని ఆస్వాదించాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా సన్నిహిత పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి.  లైంగిక జీవితం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పరిశుభ్రత చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

స్నానం చేయడం

సెక్స్ లో పాల్గొనడానికి ముందు మీరు ఖచ్చితంగా స్నానం చేయాలి. ఫ్రెష్ నెస్ భావన మిమ్మల్ని మరింత ఉత్తేజపరుస్తుంది. అలాగే మీరు సెక్స్ లో చురుగ్గా కూడా ఉంటారు. ఒకవేళ మీరు స్నానం చేయకపోతే చెమట, ధూళి శరీరానికే కాదు ప్రైవేట్ భాగాల్లో కూడా ఉంటాయి. దీంతో మీ భాగస్వామికి ఇబ్బందిగా ఉంటుంది. సెక్స్ లో పాల్గొనడానికి ఆసక్తి కూడా ఉండదు. 
 


Sleep after sex


ఓరల్ సెక్స్ కు ముందు.. 

చాలా మంది భాగస్వాములు సెక్స్ కు ముందు ఫోర్ ప్లేలో పాల్గొంటుంటారు. దీనిలో భాగంగా ఓరల్ సెక్స్ లో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. అయితే మీరు లైంగిక అవయవాలను సరిగ్గా శుభ్రం చేసుకోకుండా ఓరల్ సెక్స్ లో పాల్గొంటే మాత్రం మీ భాగస్వామి ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇబ్బంది పడాల్సి కూడా వస్తుంది. అయితే సన్నిహిత ప్రాంతం దాని స్వంత సహజ వాసనను కలిగి ఉంటుంది.అయితే దీన్ని శుభ్రం చేసిన కొద్దిసేపటిలోనే చెమట కారణంగా మళ్లీ వాసన రావడం ప్రారంభమవుతుంది. దీని వల్ల మీ భాగస్వామికి ఓరల్ సెక్స్ సమయంలో అసౌకర్యంగా అనిపించొచ్చు. అంతేకాదు వారు దీన్ని ఆస్వాధించలేరు కూడా. అలాగే వ్యక్తిగత ఆరోగ్యం కోసం సెక్స్ చేయడానికి ముందు, ఆ తర్వాత మీ లైంగిక అవయవాలను సరిగ్గా కడగాలి. లైంగిక అవయవాల పిహెచ్ స్థాయిని నిర్వహించడానికి మీరు తేమతో కూడిన పరిశుభ్రత వాష్ ను కూడా ఉపయోగించొచ్చు. 

Couples after sex

ప్రైవేట్ పార్ట్స్ జుట్టును.. 

లైంగిక చర్య సమయంలో.. భాగస్వాములు ఒకరినొకరు తాకాలని కోరుకుంటారు. అలాగూ ఫోర్ ప్లే సమయంలో ఓరల్ సెక్స్ లో పాల్గొంటే ప్రైవేట్ పార్ట్ జుట్టు ఎక్కువగా ఉంటే భాగస్వామికి ఇబ్బందిగా ఉంటుంది. దీంతో ఎప్పుడూ షేవ్ చేసేవారున్నారు. కానీ ఆరోగ్యకరమైన సెక్స్, మంచి ఆనందం కోసం దీనిని మొత్తమే తీసేయకూడదు. దీన్ని ఎప్పుడూ కట్ చేయండి. కానీ సాధారణ పరిమాణంలో ఉంచండి. ఇది మీ సన్నిహిత ప్రాంతంలో అధిక చెమట, దురదకు కారణం కాదు.
 

తాజా శ్వాస 

సెక్స్ లో పాల్గొన్నప్పుడు ముద్దు అత్యంత సాధారణమైన, మొదటి ప్రక్రియ. ముద్దుతోనే సెక్స్ ముందుకు సాగుతుంది. అయితే నోటి దుర్వాసన ఇద్దరిలో ఏ ఒక్కరికీ ఉన్నా భాగస్వామికి దానిపై ఇంట్రెస్ట్ పోతుంది. అందుకే నోటి పరిశుభ్రతను పాటించండి. నోటి పరిశుభ్రత పాటించకపోవడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు ఒకరినుంచి ఒకరికి బదిలీ అవుతాయి. లైంగిక కార్యకలాపాలను ప్రారంభించే ముందు మీ నోటి పరిశుభ్రత విషయంలో శ్రద్ధ వహించండి. ఇందుకోసం మీరు ప్రతిసారి బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మౌత్ వాష్ లేదా పుదీనా ఆకులు వంటి సహజ మూలికలను ఉపయోగించొచ్చు. 
 

సెక్స్ కు ముందు, తర్వాత 

నిపుణుల ప్రకారం.. సెక్స్ కు ముందు, ఆ తర్వాత కడుపును ఖాళీ చేయాలి. అంటే ఖచ్చితంగా మూత్రవిసర్జన చేయాలన్న మాట. ఇది హానికరమైన బ్యాక్టీరియాను బయటకు పంపడానికి, యుటిఐల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే సెక్స్  మధ్యలో నీళ్లను కూడా తాగుతూ ఉండండి. 

Latest Videos

click me!