ఇలాంటి కండోమ్స్ వాడితే సమస్యలొస్తయ్ జాగ్రత్త

First Published | Oct 30, 2023, 11:43 AM IST

కొంతమందికి కండోమ్స్ వాడినా కూడా యోనిలో ఇన్ఫెక్షన్ సమస్య వస్తుంటుంది. అయితే దీనికి కారణం మీ భాగస్వామి ఫ్లేవర్డ్ కండోమ్ వాడకమేనంటున్నారు నిపుణులు.  ఫ్లేవర్డ్ కండోమ్స్ వాడకం వల్ల యోని ఇన్ ఫెక్షన్ల వచ్చే అవకాశం చాలా రెట్లు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

కండోమ్ వాడకం చాలా సురక్షితమని, ఇది ఎన్నో లైంగిక రోగాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుందనేది నిజం. కానీ కొంతమంది ఫ్లేవర్డ్ కండోమ్లను కూడా ఉపయోగిస్తుంటారు. కానీ వీటిని ఉపయోగించి సెక్స్ లో పాల్గొనడం వల్ల సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఫ్లేవర్డ్ కండోమ్లను అస్సలు ఉపయోగించడకూడదు. ఎందుకంటే ఇవి అంటువ్యాధులకు కారణమవుతాయి.
 

Condom

కండోమ్ ఎందుకు ఉపయోగిస్తారు. 

సురక్షితమైన సెక్స్ కోసం కండోమ్స్ ను ఉపయోగిస్తారు. ఇవి లైంగిక సంక్రమణ వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడతాయి. అలాగే అవాంఛిత గర్భాలను నివారించడానికి కూడా సహాయపడుతాయి. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ రకాల కండోమ్లను అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే అవి చిరిగిపోయే ప్రమాదం ఉంది. 
 


Condom Usage

ఫ్లేవర్డ్ కండోమ్ అంటే ?

నిపుణుల ప్రకారం.. ఓరల్ సెక్స్ కోసమే ప్రత్యేకంగా ఫ్లేవర్డ్ కండోమ్లను తయారు చేశారు. ఇతర రకాల సెక్స్ కోసం ఫ్లేవర్డ్ కండోమ్లను ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఫ్లేవర్డ్ కండోమ్ లో ఉపయోగించే పదార్థాలు చికాకు, సంక్రమణకు కారణమవుతాయి. 

ఫ్లేవర్డ్ కండోమ్ లను శృంగారం కోసం ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. ఫ్లేవర్డ్ కండోమ్లను ఓరల్ సెక్స్ కోసం మాత్రమే ఉపయోగిస్తారు. నిజానికి ఫ్లేవర్డ్ కండోమ్లలో కృత్రిమ చక్కెర ఉంటుంది. ఇది యోని పీహెచ్ ను ప్రభావితం చేస్తుంది. ఇది ఫంగల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
 

నిజానికి ఫ్లేవర్డ్ కండోమ్ లు కూడా సాధారణ కండోమ్ల మాదిరిగానే ఉంటాయి. కానీ రకరకాల రుచులు లూబ్రికెంట్ కు జోడించబడతాయి. ఇదే వాటికి, వీటికి ఉన్న తేడా. అయితే అదనపు రుచి కండోమ్ పనితీరును కొద్దిగా మారుస్తుంది. అందుకే శృంగారం సమయంలో రెగ్యులర్ కండోమ్స్ ను మాత్రమే వాడాలి.
 

Did the condom break- Worry not and follow easy steps to avoid pregnancy


ఫ్లేవర్డ్ కండోమ్ల వల్ల  వచ్చే ప్రమాదాలు 

నిపుణుల ప్రకారం.. ఫ్లేవర్డ్ కండోమ్ లను సరిగ్గా ఉపయోగించకపోతే.. సాధారణ కండోమ్ల కంటే ఎక్కువ ప్రమాదాలను కలిగిస్తుంది. ఆనల్ లేదా యోని సెక్స్ సమయంలో చిరిగిపోవడం, పగిలిపోవడం, జారిపోవడం భయం కూడా ఉంటుంది. అంతేకాదు ఇది సంక్రమణ లేదా అవాంఛిత గర్భధారణకు కూడా దారితీస్తుంది. ఫ్లేవర్డ్ కండోమ్స్ ఓరల్ సెక్స్ కోసం మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి వీటిని సెక్స్ కోసం ఉపయోగిస్తే ఇవి చిరిగిపోయే మీ భాగస్వామికి ఎస్టీఐ వచ్చే ప్రమాదం ఉంది. ఎస్టీఐలు హెర్పెస్, గోనేరియా, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ , హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్,  అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్) వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.

Latest Videos

click me!