తొలి ముద్దు, తొలి కౌగిలింత, తొలి డేట్... ఇలా ప్రేమ విషయంలో తొలి సారి చేసేది ఏదైనా చాలా స్పెషల్ గా ఉంటుంది. దానిని మరింత స్పెషల్ గా చేసుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. మరీ ముఖ్యంగా తొలిసారి మీరు మీ లవర్ తో డేట్ వెళ్తున్నట్లయితే... మీ రాశి ప్రకారం కొన్ని రకాల టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఏ రాశివారికి ఎలాంటి ప్లేస్ లో డేటింగ్ కి వెళితే బాగుంటుందో కూడా తెలుసకోవచ్చట. అవేంటో మనమూ ఓసారి చూసేద్దామా..
మేష రాశి... ఈ రాశివారు తమ లవర్ తో డేట్ కి వెళ్లాలి అనుకుంటే.. గేమింగ్ లాంజ్ వద్దకు వెళ్లొచ్చు. అక్కడ మీలో ఉన్న స్పోర్ట్స్ కళను మీ ప్రేయసి ముందు బయట పెట్టొచ్చు. సరదాగా గేమ్స్ ఆడుకోవడానికి, మాట్లాడుకోవడానికి బాగుంటుంది.
వృషభ రాశి.. ఈ రాశివారు కొంచెం భోజన ప్రియులు. కాబట్టి మంచి, రుచి అందించగల భోజనం అందించే స్థలాన్ని ఎంచుకొని అక్కడికి డేట్ కి వెళ్లొచ్చు.
మిథునరాశి..ఈ రాశివారు చాలా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే ఈ రాశివారు మంచి పార్క్, ఏదైనా మంచి కేఫ్ లాంటి ప్లేస్ ని ఎంచుకుంటే మాట్లాడుకోవడానికి బాగుంటుంది.
కర్కాటక రాశి..ఈ రాశివారికి కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ. కాబట్టి ఈ రాశివారు పొయెట్రీ రిడింగ్ వంటి ప్లేస్ లకి వెళ్లాలి. అక్కడ మీ మనసులోని అన్ని మాటలను మీ లవర్ తో షేర్ చేసుకోవచ్చు.
సింహరాశి..ఈ రాశివారు ఏదైనా థియరిటికల్ ఈవెంట్ లో డేట్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మీ జీవితంలోని ముఖ్యమైన విషయాలను, మనసులోని మాటలను షేర్ చేసుకోవడానికి ఈ ప్లేస్ కరెక్ట్ గా సెట్ అవుతోంది.
కన్యరాశి..ఈ రాశివారు తమ ఫస్ట్ డేట్ ని ఆనందంగా గడుపుకోవడానికి ఓ చిన్న పని ట్రైచేయవచ్చు. ఏదైనా రెస్టారెంట్ కి వెళ్లే బదులు.. కలిసి వంట చేసుకోవడం బెస్ట్ థింగ్. అలా వంట చేసుకుంటే.. ఒకరి గురించి మరొకరు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు.
తుల రాశి..ఈ రాశివారు రొమాంటిక్ డిన్నర్ డేట్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. మంచి రెస్టారెంట్ లో రాత్రి వేళ డిన్నర్ డేట్ వీరికి బాగా సెట్ అవుతుంది. అది కూడా వీఐపీ సెక్షన్ లో అయితే ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు.
వృశ్చిక రాశి..ఈ రాశివారు తమ పార్ట్ నర్ ని సాల్సా క్లబ్ కి డేట్ కి తీసుకువెళ్లొచ్చు. అక్కడ ఇద్దరూ కలిసి రొమాంటిక్ గా డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపితే బాగుంటుంది.
ధనస్సు రాశి..ఈ రాశివారు కొంచెం ఎడ్వెంచర్ గా ఉండాలని అనుకుంటారు. కాబట్టి ఈ రాశివారు ఏదైనా అడ్వెంచర్ పార్క్ కి, రోలర్ కోస్టర్ లాంటివి ఉన్న ప్లేస్ లో డేట్ ప్లాన్ చేసుకోవచ్చు.
మకర రాశి..ఈ రాశివారు కొంచెం బడ్జెట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కాబట్టి వీరు ఏదైనా తక్కువ బడ్జెట్ లో అయిపోయేలా సింగ్ లాగా చూసుకోవాలి. కొంచెం ప్రశాంతంగా ఉండే జ్యూస్ పాయింట్ లాంటివి ఎంచుకోవడం బెటర్.
కుంభరాశి..ఈ రాశివారు స్నేహితులతో కలిసి ఏదైనా పార్టీ లాగా హోస్ట్ చేయించి.. అక్కడకు లవర్ ని డేట్ కి తీసుకువెళితే బాగుంటుంది. అలాంటి ప్లేస్ లో కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. స్నేహితులతో కూడా సరదాగా గడిపే అవకాశం ఉంటుంది.
మీనరాశి..ఈ రాశివారు మ్యూజియం లాంటి ఏదైనా ప్లేస్ లో డేట్ కి వెళితే బాగుంటుంది.