శృంగారాన్ని ఆస్వాదించాలంటే స్త్రీ, పురుషుల సహకారం ఇద్దరిదీ అవసరమే. అయితే.. ఆ కలయికను ఆస్వాదించగలుగుతున్నారా లేదా అన్న విషయంలో మాత్రం సందేహాలు అలానే ఉంటున్నాయి.
ఓ పరిశోధనలో తేలిన విషయం ఏమింటే.. చాలా మంది మహిళలు శృంగారంలో పాల్గొంటున్నప్పటికీ.. దానిని ఆస్వాదించలేకపోతున్నారట. అలా వారు కలయికను ఆస్వాదించలేకపోవడానికి అదే.. పడక గదిలో సుఖపడకపోవడానికి అసలైన కారణాలు ఉన్నాయట. అవేంటో చూద్దాం..
శృంగారం విషయంలో.. పురుషులతో పోలిస్తే.. అమ్మాయిల ఆలోచనా విధానం చాలా విభిన్నంగా ఉంటుందట. ఆ కారణం వల్ల కూడా వారు కలయికను ఆస్వాదించేలేకపోయే అవకాశం ఉంటుందట.
ఈ రోజుల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా సంపాదిస్తున్నారు. ఒకవైపు వర్క్ లైఫ్.. మరో వైపు పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేక డిప్రెషన్ కి గురయ్యే వాళ్లు పెరిగిపోయారట. అలాంటి వారు పడకగదిలో సుఖపడలేరు. అలాంటి వారికి భర్త నుంచి పూర్తి మద్దతు, ప్రేమ లభిస్తే.. దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
కొందరు మహిళలకు కలయిక సమయంలో నొప్పి కలుగుతుంది. దీంతో.. దీని కారణంగా కూడా వారు సెక్స్ ఎంజాయ్ చేయలేరు. అలాంటి వారు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
సెక్స్ ఆసక్తిని చంపడంలో ఒత్తిడి కూడా ప్రధాన కారణం. అది పోవాలంటే.. పార్ట్ నర్ తో రొమాంటిక్ గా గడపాలి. అప్పుడు ఒత్తిడి పోయి.. కలయికలో పాల్గొనాలనే కోరిక కలుగుతుంది.
బద్దకం... ప్రస్తుతం అందరూ ఇంటి దగ్గర నుంచే పనులు చేస్తున్నారు కదా.. ఆటో మెటిక్ గా బద్దకం ఆవహిస్తుంది. ఇక చలికాలంలోనూ చాలా మంది బద్దకంగా ఉంటారు. కాబట్టి దానిని వదిలించుకుంటే.. కలయికను ఆస్వాదించలేరు. కాబట్టి... ముందు దానిని వదిలించుకోవాలి.
ఇక చివరగా.. కలయికను ఆస్వదించాలి అంటే.. మూడ్ బాగుండాలి. పార్ట్ నర్ పై ప్రేమగా ఉండాలి. అలాలేని సమయంలో కలయికను ఆస్వాదించలేరు. సుఖపడలేరు. ఈ కారణాలను సరిచేసుకుంటే.. స్త్రీలు కూడా పడక గదిలో సుఖపడొచ్చు.