శృంగారంలో స్త్రీలు క్లైమాక్స్ కు చేరలేకపోవడానికి కారణాలివే..

First Published | Jun 17, 2021, 3:41 PM IST

స్త్రీ, పురుషులిద్దరికీ రతిక్రీడ ఎంతో ముఖ్యమైనది. కోరికలతో చెలరేగే తనువుల దాహం తీరాలంటే శృంగారంలో క్లైమాక్స్ కు చేరుకోవడం ముఖ్యం. అయితే కోరికలు ఎంతగా అల్లరి పెడుతున్నా.. తనువు ఎంతగా ఉద్వేగానికి, ఉద్రేకానికి లోనవుతున్న ఆ క్లైమాక్స్ కు చేరుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా స్త్రీల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. 

స్త్రీ, పురుషులిద్దరికీ రతిక్రీడ ఎంతో ముఖ్యమైనది. కోరికలతో చెలరేగే తనువుల దాహం తీరాలంటే శృంగారంలో క్లైమాక్స్ కు చేరుకోవడం ముఖ్యం. అయితే కోరికలు ఎంతగా అల్లరి పెడుతున్నా.. తనువు ఎంతగా ఉద్వేగానికి, ఉద్రేకానికి లోనవుతున్న ఆ క్లైమాక్స్ కు చేరుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా స్త్రీల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
కలయికలో ఎంతో ఆనందాన్ని పొందినప్పటికీ ఆ స్వర్గాన్ని రుచి చూడలేరు. ఆనందానికి అరసెకను దూరంలో ఆగిపోతారు. దీనికి అనేక కారణాలున్నాయి.

పురుషుల్లో కోరిక తీరడానికి సెక్స్ చేస్తే సరిపోతుంది. కానీ స్త్రీల విషయానికి వచ్చేసరికి అలా కాదు. శరీరాన్ని మెల్లగా సవరించాలి, వీణమీటినట్టుగా ఒక్కో తంత్రినీ మీటాలి అప్పుడే వారి శరీరం శృంగారానికి సిద్ధమవుతుంది.
అలాంటప్పుడే వారూ ఆ కలయికతో పురుషుడితో పాటు సమానమైన ఆనందాన్ని పొందగలుగుతారు. అందుకే శృంగారానికి ముందు ఫోర్ ప్లే ఎక్కువగా చేయాలి.
యోనిలో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు. మహిళల జననాంగాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో నొప్పి, కురుపులు లేదా మంట కూడా మీరు క్లైమాక్స్ కు చేరుకోకుండా అడ్డుపడతాయి.
దీంతో పాటు బలవంతంగా చొప్పించడం వల్ల కలిగే బాధతో యోని కండరాలను బిగుతు చేస్తారు. దీంతో శృంగారం బాధాకరంగా మారి ఆనందాన్ని ఇవ్వదు. ఇలా జరగకుండా ఉండాలంటే డాక్టర్ల సలహా అవసరం.
కొంతమంది స్త్రీలలో క్లిటోరస్ బాగా సున్నితంగా ఉంటుంది. అందుకే అక్కడ ఏ చిన్న స్పర్శ అయినా బాధను కలిగిస్తుంది. అందుకే ఆమెను ఫోర్ ఫ్లేకు సిద్ధం చేయడానికి క్లిటోరస్ కాకుండా వేరే అంగాలను ఎంచుకోవడం మంచిది.
ఈ అతి సున్నితత్వం వల్ల కలయికలో నొప్పి ఎక్కువై అంతిమంగా శృంగారం అంటేనే బాధపడేలా చేస్తుంది. ఇది మరీ ఎక్కువగా ఉండే డాక్టర్లను సంప్రదించి, వారి గైడెన్స్ ప్రకారం నడుచుకోవాలి.
ఇంకొంతమందిలో కలయిక సమయంలో యోనిలో ఎక్కువ తడి ఏర్పడుతుంది. దీంతో పురుషాంగం కదలికలు పెద్దగా శరీరానికి తగలవు. దీనివల్ల వారు ఎక్కువగా తృప్తిని పొందలేకపోతారు. అయితే సెక్స్ సమయంలో యోనిని ఒక టవల్ తో తరచుగా తుడుచుకుంటూ ఉండడం వల్ల ఉపయోగం ఉంటుంది. అలాగని మొత్తం ల్యూబ్రికేషన్ ను తుడిచేస్తే మొదటికే ప్రమాదం.
ఒత్తిడి, లైంగిక కోరిక లేకపోవడం, ఆందోళన లాంటివి కూడా స్త్రీలు సెక్స్ తృప్తి పొందడానికి అడ్డుపడే మానసిక కారణాలు. భాగస్వాముల్లో ఏ ఒక్కరికి ఈ పరిస్తితి ఉన్నా సెక్స్ ను ఎంజాయ్ చేయలేరు. అందుకే మీరు ఆరోగ్యకరమైన, తృప్తికరమైన కలయికను ఎంజాయ్ చేయాలంటే వీటినుంచి బయటపడడానికి ప్రయత్నించాలి.

Latest Videos

click me!