కన్న కూతురిలా చూడాల్సిన కోడలిపైనే ఓ మామ కన్నేశాడు. కన్న కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు. కోడలిని తనవైపు ఆకర్షించుకునేలా చేసి.. కొడుకులేని సమయంలో ఆమెతో తన శారీరక కోరిక తీర్చుకున్నాడు. తీరా విషయం కొడుకుకి తెలిసేసరికి.. అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. ఈ దారుణ ఘటన బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ లో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. చిట్టగాంగ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి భార్య, కుమారుడు ఉన్నారు. కాగా... ఇటీవల అతని భార్య అనారోగ్యంతో కన్నుమూసింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు.
భార్య మరణానంతరం కొడుకు ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే... కొడుకు, కోడలు ఆనందంగా ఉంటే చూడాల్సిందిపోయి.. తనకు దగ్గని శారీరక సుఖం తన కొడుకుకి మాత్రం దక్కుతోందని తెగ బాధపడేవాడు.
ఈ క్రమంలోనే అందంగా ఉన్న కోడలిపై అతను మనసు పారేసుకున్నాడు. ఎలాగైనా తాను దక్కించుకోవాలని అనుకున్నాడు. కొడుకు వ్యాపారం నిమిత్తం బయటికి వెలుతుండడంతో ఇంట్లో మామ, కోడలు మాత్రమే ఉండేవారు. దీంతో అతడి కన్ను కోడలిపై పడింది.
ఇంట్లో ఉండే కోడలిని లొంగదీసుకుంటే గుట్టుగా అక్రమ సంబంధం కొనసాగించవచ్చని, ఎవరికీ అనుమానం కూడా రాదని అనుకున్నాడు. దీంతో కొడుకు లేని సమయంలో కోడలితో సన్నిహితంగా మెలిగేవాడు. మాటల సందర్భంలో తన కోరికను తెలియజేశాడు.
మామయ్య తన పై ఆశ పడుతున్నాడని తెలుసుకున్న కోడలు తొలుత షాకైంది. అప్పటి నుంచి అతనికి దూరంగా ఉండసాగింది. అయితే అతను మాత్రం వదిలిపెట్టలేదు. తన మాటలతో మెల్లిగా తన ముగ్గులోకి దింపాడు.
ఇక కొడుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లడమే ఆలస్యం.. వెంటనే తలుపులు వేసుకుని మామకోడలు ఇద్దరూ గదిలోకి దూరి కామక్రీడల్లో మునిగితేలేవారు. ఇలా కొన్నాళ్ల వారి బాగోతం గుట్టుగా సాగింది. ఓ రోజు తన తండ్రితో కోడలు సన్నిహితంగా ఉంటుందని తెలుసుకున్న కొడుకు పద్ధతి మార్చుకోవాలని తన తండ్రికి, భార్యకి ఎన్నోసార్లు చెప్పి చూశాడు.
అయినా వారు తమ పద్దతిని మార్చుకోలేదు. దీంతో వారికి చెప్పి విసిగిపోయిన కొడుకు.. తాను వేరు కాపురం పెడతానని హెచ్చరించాడు. దీంతో మామ ఆందోళన చెందాడు.
కొడుకు వేరు కాపురం పెడితే.. కోడలితో తన కోరికలు తీర్చుకోవడం కుదరదని భావించాడు. కొడలికి తనకి మధ్య తన కొడుకు అడ్డుగా ఉన్నాడని.. అతడిని అడ్డుతొలగించుకుంటే.. కోడలితో రాసలీలలకు ఎలాంటి అడ్డు ఉండదని భావించాడు.
కొడుకును చంపేందుకు కూడా ప్లాన్ వేశాడు. కాగా.. తండ్రి ప్లాన్ ని ముందుగానే పసిగట్టిన ఆ కొడుకు తెలివిగా తప్పించుకొని.. తండ్రిని పోలీసులకు అప్పగించాడు.