ప్రాణాలు తీస్తున్న అతి.. ఎన్నిసార్లు చేస్తే శృంగారం సుఖం..?

First Published Feb 9, 2021, 2:53 PM IST

శృంగారం అనేది ప్ర‌కృతి ధ‌ర్మం. స‌మాజంలోని మ‌నుషులే కాదు, ఇత‌ర జీవులు కూడా ఆ ధ‌ర్మాన్ని పాటిస్తాయి.

శృంగారం అనేది ఓ తీయని అనుభూతి. ఈ భూమి మీద జీవి పుట్టుకకు కారణం అది. చాలా మంది ప్రస్తుతం దీని అర్థం మార్చేస్తున్నారు. కానీ.. ఇది జీవి పుట్టుకకు కారణమైన పవిత్ర ఘట్టమనే చెప్పుకోవచ్చు.
undefined
శృంగారం అనేది ప్ర‌కృతి ధ‌ర్మం. స‌మాజంలోని మ‌నుషులే కాదు, ఇత‌ర జీవులు కూడా ఆ ధ‌ర్మాన్ని పాటిస్తాయి. అయితే మ‌నిషి విచ‌క్ష‌ణా జ్ఞానం ఉన్న‌వాడు. త‌ప్పు ఒప్పుల గురించి తెలిసిన వాడు. క‌నుక ఇత‌ర విష‌యాల ప‌ట్లే కాదు.. శృంగారంలో పాల్గొనే విష‌యంలోనూ ప‌రిమితి పాటించాలి.
undefined
కామ వాంఛ‌తో ర‌గిలిపోతూ విచ‌క్షణా జ్ఞానం లేకుండా పిచ్చెక్కిన వారిలా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌దు. అన్ని విష‌యాల్లోనూ అతి ప‌నికిరాద‌న్న‌ట్లే శృంగారం విష‌యంలోనూ అతి చేయ‌రాదు. అయితే మ‌రి దంప‌తులు వారంలో ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొంటే మంచిది ? ఎన్ని సార్లు పాల్గొనాలి ? అనే విషయంపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..
undefined
కిన్సే ఇనిస్టిట్యూట్ చేప‌ట్టిన స‌ర్వే ప్ర‌కారం 18 నుంచి 29 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న‌వారు ఏడాదికి 112 సార్లు శృంగారంలో పాల్గొంటార‌ని వెల్ల‌డైంది. అదే 30 నుంచి 39 ఏళ్ల వారు అయితే 86 సార్లు, 40 నుంచి 49 ఏళ్ల మ‌ధ్య వారు అయితే ఏడాదికి 69 సార్లు శృంగారంలో పాల్గొంటార‌ని తేలింది.
undefined
అయితే వారంలో శృంగారంలో ఎన్నిసార్లు పాల్గొనాలి ? అనే విష‌యంపై ఇప్ప‌టికే సైంటిస్టులు గానీ, వైద్యులు కానీ క‌చ్చిత‌మైన లెక్క చెప్ప‌లేదు.
undefined
కానీ వారానికి క‌నీసం 2 సార్లు అయినా శృంగారంలో పాల్గొంటే బాగుంటుంద‌ని, దంప‌తుల మ‌ధ్య సంబంధాలు బాగుంటాయ‌ని, వైవాహిక జీవితంలో స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌కుండా ఉంటాని తెలిపారు.
undefined
click me!