లాక్ డౌన్ ఎత్తేయండి సర్.. మా ఆయన సెక్స్ పిచ్చి తట్టుకోలేకపోతున్నా..

First Published | Apr 17, 2020, 3:01 PM IST
మొన్నటికి మొన్న లాక్ డౌన్ సమయంలో శానిటైజర్లు, మాస్క్ లకు ఎంత డిమాండ్ ఉందో.. కండోమ్, సెక్స్ టాయ్స్ కి కూడా అంతకు మించి డిమాండ్ పెరిగిందని ఓ సర్వేలో తేలింది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లక్షన్నర జనాభా ప్రాణాలు కోల్పోయింది. మరి కొన్ని లక్షల మంది వైరస్ సోకి ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రుల్లో చావుతో పోరాడుతున్నారు.
ఈ నేపథ్యంలో.. చాలా దేశాల్లో ఈ వైరస్ ని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించారు. అయితే.. ఈ లాక్ డౌన్ వేళ కరోనా ని మించి.. చిత్ర విచిత్ర వార్తలు బయటకు వస్తున్నాయి.

మొన్నటికి మొన్న లాక్ డౌన్ సమయంలో శానిటైజర్లు, మాస్క్ లకు ఎంత డిమాండ్ ఉందో.. కండోమ్, సెక్స్ టాయ్స్ కి కూడా అంతకు మించి డిమాండ్ పెరిగిందని ఓ సర్వేలో తేలింది.
మునుపెన్నడూ లేని విధంగా 25 నుంచి 50 శాతం అమ్మకాలు పెరిగాయని ఆర్డర్లు పెంచుతున్నారట షాప్ రిటైలర్లు. 'సాధారణంగా ఒక్కో ప్యాక్‌లో 3 ఉండే దానిని కొనుగోలు చేసే వాళ్లంతా ఒకేసారి 10 నుంచి 20ప్యాకెట్లు తీసుకెళ్లిపోతున్నారు' అంటున్నారు రిటైలర్లు.
మాల్స్ షట్ డౌన్ అవడం మొదలైనప్పటి నుంచి కండోమ్ ల అమ్మకాలు పెరుగుతన్నాయి. వీటితో పాటు సెక్స్ టాయ్స్ కు కూడా ఆర్డర్లు వస్తున్నప్పంటికీ డెలివరీ ఏజెంట్లు కరువై అమ్మకాలు వాయిదా పడుతున్నాయని ఆ సర్వేలో తేలింది.
నిన్నేమో.. పోర్న్ హబ్ ఓ సర్వే ప్రకటించింది. అందులో భారతీయులు ఎక్కువగా పోర్న్ చూస్తున్నారని.. లాక్ డౌన్ లో పోర్న్ వీడియోలతో టైంపాస్ చేస్తున్నారని తేలింది.
తాజాగా.. మరో విషయం బయటకు వచ్చింది. లాక్ డౌన్ కారణంగా కరోనా సంగతేమే కానీ.. మేము మాత్రం అవస్థలు పడుతున్నామంటూ కొందరు మహిళలు ముందుకు వచ్చారు.
లాక్ డౌన్ తో పనీపాటా లేకుండా ఇళ్లలో ఉంటున్న పురుషులు తమ శృంగార పిచ్చితో భార్యలను విపరీతంగా వేధిస్తున్నారట. మా ఆయన సెక్స్ పిచ్చి తట్టకోలేకపోతున్నామంటూ కొందరు మహిళలు వాపోతున్నారు.
అయితే.. ఓ మహిళ మాత్రం ఏకంగా దేశాధ్యక్షుడికి లాక్ డౌన్ ఎత్తేయండి సార్ అంటూ వేడుకుంది. ఈ సంఘటన ఘనా దేశంలో చోటుచేసుకుంది.
సదరు ఆఫ్రికా మహిళ ఏకంగా దేశాధ్యక్షుడికి చేసిన విన్పపం ఇప్పుడు వైరల్ అయ్యింది. పురుషుల సెక్స్ కోర్కెలు తీర్చలేక తీవ్ర వేధింపులకు గురవుతున్నామని.. దయచేసి లాక్ డౌన్ ఎత్తివేయడమో లేదా పురుషులను పనులకు అనుమతించడమో చేయాలని కోరింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె వీడియోను పోస్టు చేయగా.. అది వైరల్‌గా మారింది.
కరోనాతో లాక్ డౌన్ అయిన దేశాల్లో ఘనా కూడా ఒకటి. ఇది ఆఫ్రికన్ దేశం. కాగా.. లాక్ డౌన్ పరిశ్రమలు, సంస్థలు, కంపెనీలు అన్నీ మూతపడ్డాయి.
దీంతో పురుషులకు పనీ పాట లేకుండా పోయింది. అంత ఖాళీ సమయం దొరికేసరికి వేరే పనేమీ లేక.. అదేపనిగా శృంగారం కోసం పరితపిస్తున్నారట.
అయితే.. వీరి కోరికలు తీర్చడం మాత్రం మా వాళ్ల కావడం లేదని సదరు మహిళ పేర్కొంది. ఇది కేవలం తన సమస్య మాత్రమే కాదని.. తనలాగే చాలా మంది ఇబ్బంది పడుతున్నారని.. వారిందరి తరపున తాను ఈ సమస్యను వివరిస్తున్నట్లు ఆమె చెప్పారు.
ఏప్రిల్ 11న ఘనాలోని MMA అనే వెబ్ సైట్ మొదట ఆమె కథనాన్ని ప్రచురించింది. ఆ వీడియోలో స్థానిక భాషలో ఆమె వెల్లడించిన విషయాలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది.
ఆ కథనం ప్రకారం.. లాక్ డౌన్ పీరియడ్‌లో ఆమె భర్త నిత్యం విపరీతమైన శృంగారం కోసం ఆమెను వేధిస్తున్నాడు. పొద్దస్తమానం శృంగారం కోసం వెంపర్లాడే అతని కోర్కెలను తీర్చలేక.. ఆమె లాక్ డౌన్ ఆదేశాలను సైతం ధిక్కరించి తన ఇంటి నుంచి పారిపోయి వర్క్ ప్లేస్‌కి చేరుకుంది. అక్కడే ఓ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పెట్టింది.
'నిద్ర లేచీ లేవగానే సెక్స్ కోసం కాచుకుని ఉన్న భర్తను చూడాలి. వంట తర్వాత,తిన్న తర్వాత,కాసేపు టీవీ చూశాక,ఇలా ఏమాత్రం గ్యాప్ దొరికినా సెక్స్ కావాలంటాడు. లాక్ డౌన్ అనేది సెక్స్ కోసం పెట్టలేదు, వైరస్‌ నుంచి రక్షించడానికి పెట్టింది.
కానీ ఇక్కడ మా భర్తలు మమ్మల్ని విపరీత శృంగారం కోసం డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి దేశ అధ్యక్షులు దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని లాక్‌డౌన్ ఎత్తివేయాలి లేదా పురుషులను పనికి అనుమతించాలి' అని ఆమె కోరింది.
ఈ వీడియో వైరల్ కావడంతో నెట్టింట మీమ్స్ కూడా తయారయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో విపరతీమైన జోక్స్ పుట్టుకురావడం విశేషం.

Latest Videos

click me!