పెళ్లికి ముందు శృంగారానికి కాబోయే భర్త ఒత్తిడి.. ఒకే చెప్పడంతో...

First Published | Feb 18, 2021, 11:56 AM IST

పెళ్లి కి ముందు చాలా సార్లు శృంగారంలో పాల్గొని ఆ తర్వా త సదరు వరుడు తనకు ఈ పెళ్లి వద్దంటూ ఎగనామం పెట్టాడు. దీంతో.. వధువు పోలీసులను ఆశ్రయించింది. 

వారిద్దరికీ పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. త్వరలోనే పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు భావించారు. అందుకు తగినట్లు ముహూర్తాలు కూడా పెట్టారు.
అయితే.. వరుడు కొంచెం అడ్వాన్స్ గా ఆలోచించాడు. పెళ్లికి ముందే సెక్స్ చేద్దామంటూ వధువు వెంటపడ్డాడు. ఎలాగూ కాబోయే భర్తే కదా అని సదరు యువతి అంగీకారం తెలిపింది. చివరకు అదే ఆమె కొంప ముంచింది.

పెళ్లి కి ముందు చాలా సార్లు శృంగారంలో పాల్గొని ఆ తర్వా త సదరు వరుడు తనకు ఈ పెళ్లి వద్దంటూ ఎగనామం పెట్టాడు. దీంతో.. వధువు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాజస్థాన్ రాష్ట్రం జోధ్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి తనకు కాబోయే భర్త మీద అత్యాచారం కేసు పెట్టింది. ఆ కేసు చూసి పోలీసులు కూడా షాకయ్యారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు విని అందరూ షాకయ్యారు.
ఇంతకీ మ్యాటరేంటంటే.. గతేడాది నవంబర్ లో వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యింది. నిశ్చితార్థం తర్వాత శృంగారం కోసం వరుడు కాబోయే పెళ్లి కూతురిని బలవంత పెట్టడం మొదలుపెట్టాడు.
ఎలాగూ కాబోయే భార్యభర్తల మే కదా అని ఒత్తిడి చేయడంతో సదరు యువతి కూడా అంగీకరించింది. ఇక మరి కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. వరుడు తనకు ఈ పెళ్లి వద్దంటూ తేల్చిచెప్పడం గమనార్హం. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Videos

click me!