పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని పెద్దలు చెబుతుంటారు. అయితే.. వాటిని అందంగా తీర్చిదిద్దుకునే బాధ్యత మాత్రం మనమీదే ఆధారపడి ఉంటుంది. చాలా మంది దంపతుల మధ్య ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే.. కొందరు వాటినే పట్టించుకొని దూరం పెంచుకుంటూ ఉంటారు. ఇంకొందరు ధైర్యం చేసి విడాకులు తీసుకుంటారు.
విడాకులు తీసుకోనంత మాత్రాన దంపతులు కలిసి జీవిస్తున్నట్లు కాదని నిపుణులు అంటున్నారు. కలిసి ఉండటానికి.. కలిసి జీవించడానికి చాలా తేడా ఉందని నిపుణులు చెబుతున్నారు..
భార్యభర్తల మధ్య తేడాలు వస్తున్నాయి.. వారు ఆనందంగా లేరు అనడానికి ఫస్ట్ ఉదాహరణ. వారి శృంగార జీవితం. మీరు లైంగిక జీవితం ఆనందంగా ఉన్నదీ లేనిదీ గమనిస్తే.. మీ బంధం ఎలా ఉందనే విషయం బయటపడుతుంది.
ఇద్దరి మధ్య బేధాభిప్రాయలు ఉంటే.. వారు కలిసే ఉండొచ్చు కానీ.. శృంగారానికి మాత్రం దూరమైపోతారు. దీని వల్ల మీ బంధం ముక్కలైపోతుందని అర్థం చేసుకోవాలి.
శృంగార జీవితం ఆనందంగా ఉంటేనే.. వారి మిగితా జీవితం ఆనందంగా సాగుతుంది. ఒకవేళ మీరు కూడా శృంగార జీవితానికి దూరమైతే.. ఆ దంపతుల మధ్య జరిగే అనర్థాలేంటో ఓసారి చూద్దాం...
సెక్స్ లైఫ్ ని పూర్తిగా దూరం పెట్టడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మిస్ అండర్ స్టాండింగ్స్ వచ్చేస్తాయి. ప్రతి చిన్న విషయానికి అప్ సెట్ అయిపోతూ ఉంటారు. అంతేకాదు ఎక్కువగా ఫ్రస్టేట్ అవుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకే దంపతులు పెద్దగా గొడవలు పడుతుంటారు.
దానికి బతులు గొడవ జరుగుతుందనే అనుమానం రాగానే..పది సెకండ్ల పాటు ఊపిరి పీల్చుకొని ఆ తర్వాత ఈ విషయంపై స్పందిస్తే బాగుంటుంది.
శృంగారానికి దూరమైతే.. మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అమ్మాయిలకైతే అందం కూడా తగ్గుతుందట. మీరు చదివింది నిజమే.. శృంగారం ప్రతిరోజూ ఆస్వాదించేవారు యవ్వనంగా కనిపిస్తారు.
ఒకరిపై మరొకరికి నమ్మకం పూర్తి తగ్గిపోతుంది. ప్రతి చిన్న విషయాలను గొడవపడుతుంటారు. దీని వల్ల మధ్యలో పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు. ఇవి మాత్రమే కాకుండా.. ఆరోగ్యపరమైన సమస్యలుకూడా వస్తుంటాయి.