సెక్స్ తో కూడా బరువు తగ్గుతారా?

First Published | Feb 24, 2024, 3:08 PM IST

భార్యాభర్తల మధ్య సెక్స్ లైఫ్ బాగుంటే మిగతా జీవితం మొత్తం సాఫీగా సాగుతుంది. నిజానికి సెక్స్ ఇద్దరినీ ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతుంది. అంతేకాదు ఇది కేలరీలను కూడా తగ్గిస్తుంది తెలుసా?


సెక్స్ భార్యాభర్తలిద్దరికీ శారీరక ఆనందాన్ని కలిగించడమే కాదు.. ఎన్నో సమస్యలకు దూరంగా కూడా ఉంచుతుంది. దీనిలో వెయిట్ లాస్ కూడా ఉంది. అవును.. నిపుణుల ప్రకారం.. సెక్స్ కూడా మీరు బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది.  సెక్స్ వల్ల శరీరం ఎన్నో విధాలుగా కదులుతుంది. దీంతో మీ గుండెకొట్టుకునే వేగం పెరుగుతుంది. అలాగే కేలరీలు కూడా బర్న్ అవుతాయి. అందుకే సెక్స్ ను కూడా "కార్డియో" రకం వ్యాయామంగా భావిస్తారు. 2013 అధ్యయనం ప్రకారం.. 24 నిమిషాల సెక్స్ సెషన్ లో మగవారు 101 కేలరీలు అంటే నిమిషానికి 4.2 కేలరీలను బర్న్ చేస్తారు. ఆడవారు 69 కేలరీలు అంటే నిమిషానికి 3.1 కేలరీలను బర్న్ చేస్తారు. అయితే ఎన్ని కేలరీలు బర్న్ అవుతాయనే విషయం సెక్స్ వేగం, తీవ్రత, వేగం, పొజీషన్ వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే సెక్స్ లో పాల్గొన్న వారు దాదాపుగా 80 నుంచి 300 కేలరీలను బర్న్ చేస్తారని నిపుణులు అంటున్నారు. 
 

మన శరీర బరువులో 1 కిలో గ్రాము సుమారుగా 7,700 కేలరీలకు సమానం అంటే శారీరక శ్రమతో మీరు 300 కేలరీలు బర్న్ చేస్తే.. 0.034 కిలో గ్రాముల బరువును మీరు తగ్గుతారు. అయితే అధిక తీవ్రతతో గంటకు పైగా మీరు సెక్స్ లో పాల్గొంటే మాత్రం మీరు సులువుగా 300 కేలరీలు బర్న్ చేస్తారు. కాగా మీరు 10 నిమిషాలు రన్నింగ్ చేయడం వల్ల 114 కేలరీలను బర్న్ చేస్తారు. 
 


సెక్స్ లో పాల్గొనడం వల్ల డోపామైన్ విడుదలవుతుంది. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. సెక్స్ మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు దీనితో బరువును కూడా తగ్గొచ్చు. ఇది పరోక్షంగా మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఏదేమైనా ఇది మీరు ఎక్కువ బరువు తగ్గడానికి మాత్రం ఉపయోగపడదని నిపుణులు అంటున్నారు.  మీరు సెక్స్ సమయంలో  ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


వ్యవధిని పెంచండి

సెక్స్ లో ఎక్కువగా పాల్గొనడం వల్ల కూడా మీరు కేలరీలను ఎక్కువగా బర్న్ చేయొచ్చు. ఒకవేళ మీరు సెక్స్ తో కేలరీలను ఎక్కువగా కరిగించాలనుకుంటే మాత్రం సెక్స్ టైమింగ్ ను పెంచండి. ఆ సమయాన్ని ఆస్వాధించండి.

 పొజీషన్స్ 

కొన్ని సెక్స్ పొజీషన్స్ కూడా మీరు ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడతాయి. నిలబడటం వంటి శారీరక శ్రమ అవసరమయ్యే సెక్స్ పొజీషన్స్ ను ఎంచుకోండి. ఇవి ఎక్కువ కండరాలను నిమగ్నం చేస్తాయి. అలాగే కేలరీలు బర్న్ ను కూడా పెంచుతాయి. 
 

కదలికలు 

గుండెకొట్టుకునే వేగాన్ని పెంచడానికి, కేలరీల ఖర్చును పెంచడానికి కొన్ని కదలికలు మీకు బాగా సహాయపడతాయి. 

ఫోర్ ప్లే

ఫోర్ ప్లే మీ ఇద్దరికీ లైంగిక కోరికలను కలిగిస్తుంది. అలాగే మంచి లైంగిక ఆనందాన్ని కూడా పెంచుతుంది. అంతేకాదు ఇది కేలరీల బర్న్ ను కూడా పెంచుతుంది. ముద్దు, టచింగ్స్, మసాజ్ వంటి కార్యకలాపాలు కేలరీలు ఎక్కువగా బర్న్ అయ్యేందుకు సహాయపడతాయి. 

హైడ్రేట్ గా ఉండండి

ఏదైనా శారీరక శ్రమ మాదిరిగానే.. సరైన పనితీరు, కేలరీల బర్నింగ్ కోసం మీరిద్దరూ హైడ్రేటెడ్ గా ఉండాలి.  అలాగే కొత్తది ఏదైనా ప్రయత్నించినప్పుడు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగుండాలి. 

Latest Videos

click me!