సెక్స్ లేదా పెళ్లితో బరువు పెరుగుతారా?

First Published | Aug 10, 2023, 9:51 AM IST

మీరు మీ రిలేషన్ షిప్ లో సంతృప్తి చెంది, భాగస్వామితో సంతోషంగా ఉంటే మీ శరీరం ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. దీనిని కంఫర్ట్ హార్మోన్ అని కూడా పిలుస్తాము. శరీరంలో ప్రోలాక్టిన్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరుగుతారు.
 

శృంగారంలో పాల్గొనడం వల్ల ఆడవారు బరువు పెరుగుతారని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అలాగే పెళ్లి తర్వాత స్త్రీలు, పురుషులిద్దరూ బరువు పెరగడం మనలో చాలా మంది చూసే ఉంటారు. ఇది నిజంగా నిజమేనా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? బరువు పెరగడానికి అసలు కారణమేంటి? నిపుణుల ప్రకారం.. ఆహారం, జీవనశైలి, వ్యాయామం వంటివి కూడా దీనికి కారణాలు కావొచ్చు. 
 

కొన్ని పరిశోధనల ప్రకారం..

రిలేషన్ షిప్ లో సంతోషంగా ఉంటే త్వరగా బరువు పెరిగే అవకాశం ఉందని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సెక్స్ లేదా ఆరోగ్యకరమైన సంబంధాలు కాదు మాత్రమే కాదు శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు కూడా బరువు పెరగడానికి కారణమవుతాయి. సెక్స్, ఒత్తిడి, ఆరోగ్యకరమైన సంబంధాలు, మీ శరీరంలో అనేక హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇవి బరువు పెరగడానికి కారణమవుతాయి. అదుకే బరువు పెరగడానికి కారణమయ్యే కొన్ని హార్మోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos


నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం.. కొత్తగా పెళ్లయిన జంటలు బరువు పెరగడం చూసే ఉంటారు. దీనికి కారణం వారి ఆనందకరమైన సంబంధం. వారి ఆరోగ్యకరమైన మానసిక స్థితి. ఒక అధ్యయనం ప్రకారం.. సంతోషంగా పెళ్లి చేసుకున్న జంటలు, సంతోషంగా లేని జంటలు, సింగిల్ వ్యక్తుల కంటే ఎక్కువ ఆకలితో ఉంటాయి. ఈ కారణంగా వారు కేలరీలను ఎక్కువగా తీసుకుంటారు. దీంతో వారు బరువు పెరుగుతారు.
 

అయితే ఇది కేవలం వివాహం పైనే ఆధారపడి ఉండదు. ఒక వ్యక్తి తన భాగస్వామితో లివింగ్ రిలేషన్ షిప్ ఉండి.. పెళ్లైన జంటలాగే జీవితాన్ని గడుపున్న వారు కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. ఇది సంతృప్తిగా, సంతోషంగా ఉన్నప్పుడు శరీరంలో విడుదలయ్యే హార్మోన్లపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది.
 

ఆరోగ్యకరమైన సంబంధం బరువు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో శరీరంలో అనేక రసాయన మార్పులు బరువు పెరగడానికి కారణమవుతాయి. మీరు మీ సంబంధంతో సంతృప్తి చెందితే, మీ భాగస్వామితో సంతోషంగా ఉంటే మీ శరీరం ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. దీనిని కంఫర్ట్ హార్మోన్ అని కూడా అంటారు. శరీరంలో ప్రోలాక్టిన్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. మరి ఏ హార్మోన్లు బరువును పెంచుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఈస్ట్రోజెన్

ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. అండాశయ కణాల ద్వారా ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం, ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. శరీరం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సరైన మొత్తంలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరిగినప్పుడు, ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి కణాలపై ఒత్తిడి పడుతుంది. ఇది శరీరాన్ని ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు నిల్వ అవుతుంది. ఇదికాస్త బరువు పెరగడానికి దారితీస్తుంది. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. దీని వల్ల శరీరం కొవ్వు కణాల సహాయంతో ఎక్కువ ఈస్ట్రోజెన్ ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. దీని వల్ల శరీరంలో ఉన్న శక్తి కొవ్వుగా మారి గ్లూకోజ్ స్థాయిని నార్మల్ గా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల బరువు పెరగొచ్చు.ఇలాంటి పరిస్థితిలో ఆల్కహాల్ తీసుకోవడాన్ని తగ్గించాలి. అలాగే రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. తాజా పండ్లు, కూరగాయలను తీసుకుంటే ఈస్ట్రోజెన్ స్థాయిలు నార్మల్ గా ఉంటాయి. 
 

థైరాయిడ్ హార్మోన్లు

మెడ అడుగు భాగంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది శరీర జీవక్రియను నిర్వహించే టి 3, టి 4, కాల్సిటోనిన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ల ఉత్పత్తి తక్కువగా ఉండే పరిస్థితిని హైపోథైరాయిడిజం అంటారు, ఇదే బరువు పెరగడానికి అతి పెద్ద కారణం. దీనిని నియంత్రించడానికి అయోడైజ్డ్ ఉప్పును తినాలి. అలాగే విటమిన్ డి, జింక్ తగినంత మొత్తంలో తీసుకోవాలి. అలాగే మిమ్మల్ని మీరు శారీరకంగా చురుగ్గా ఉంచుకోవాలి. 

ఇన్సులిన్

మన శరీరం ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీర కణాలకు గ్లూకోజ్ ను పంపిణీ చేయడానికి పనిచేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంతో పాటుగా శరీరం ఇన్సులిన్ ను శక్తిగా ఉపయోగిస్తుంది. లేదా శరీరంలో కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. అయితే ఇన్సులిన్ ఉత్పత్తి హెచ్చుతగ్గులకు గురైనప్పుడు శరీరం ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి మీరు సీజనల్ పండ్లు, కూరగాయలను తినండి. అలాగే అవిసె గింజలు, ఇతర గింజలు వంటి ఆరోగ్యకరమైన  ఆహారాలను తినండి. 

టెస్టోస్టెరాన్

టెస్టోస్టెరాన్ ను సాధారణంగా మగ హార్మోన్ అని పిలుస్తారు. కానీ ఈ హార్మోన్ మహిళల శరీరంలో కూడా ఉత్పత్తి అవుతుంది. టెస్టోస్టెరాన్ లిబిడోను నిర్వహించడానికి,కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అలాగే ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తుంది. వయస్సు, ఒత్తిడి వంటి వివిధ జీవనశైలి కారకాలు టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడానికి కారణమవుతాయి. దీనివల్ల మీరు ఊబకాయం బారిన పడొచ్చు.

click me!