మద్యం మత్తులో శృంగారం...చాలా ప్రమాదం

First Published | Dec 5, 2019, 1:32 PM IST

నిజానికి మద్యం సేవించిన సమయంలో శృంగార కోరికలు కలిగినా... చేసే సామర్థ్యం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు.

మద్యం పానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం అందరికీ తెలుసూ.. అయినా కూడా చాలా మంది మద్యం సేవించకుండా ఉండటం లేదు. హాని అని తెలిసినా కూడా మద్యం ఎందుకు తాగుతున్నారంటే... ఈ మధ్యకాలంలో కొందరు పురుషులు వింత సమాధానాలు చెబుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడయ్యింది.
శృంగారంలో పాల్గొనాలనే కోరిక మద్యం సేవించినప్పుడు ఎక్కువగా ఉంటుందని... దాని కోసమే తాగుతున్నామని కొందరు చెబుతుండటం గమనార్హం. అయితే... ఇందులో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.

నిజానికి మద్యం సేవించిన సమయంలో శృంగార కోరికలు కలిగినా... చేసే సామర్థ్యం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు.
తరచూ మద్యం సేవించే వారిలో శృంగారం చేసే సామర్థ్యం తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా నాడీ మండలం మీద ఆల్కహాల్ ప్రభావంతో శృంగారం మీద ఆసక్తి క్షీణిస్తుందని పేర్కొన్నారు.
బ్రిటన్ కు చెందిన పరిశోధకులు 280 మంది యువకుల మీద పరిశోధన చేయగా పలు ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి.
ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకున్నప్పటి కన్నా తీసుకోకుండా శృంగారం చేస్తేనే యువకులు ఎక్కువ సేపు ఆ పని చేసే సామర్థ్యం దక్కిందని పరిశోధనలో తేలింది.
అంతేకాదు మద్యం సేవించి నప్పుడు అసురక్షిత (కండోమ్ లేకుండా) విధానాల్లో శృంగారంలో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉందని, అపరిచిత వ్యక్తులతో అసురక్షిత శృంగారం చేస్తే వ్యాధులు రావడం ఖాయమని పరిశోధకులు చెబుతున్నారు.
అంతే కాదు కూల్ డ్రింక్స్ ఎక్కువ మొత్తంలో సేవించిన వారిలో కూడా శృంగార సామర్థ్యం తగ్గుతోందని, అమితంగా కూల్ డ్రింక్స్ తాగిన వారిలో శృంగారంలో వీక్ అవుతున్నారని పరిశోధకులు వెల్లడించారు.
ఇదిలాఉంటే, శృంగార జీవితంలో సంతృప్తిగా గడపాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లు తప్పని సరి అని, ముఖ్యంగా మద్యం, మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఉంటేనే శ్రేయస్కరమని పరిశోధకులు సెలవిస్తున్నారు. దీంతో పాటు కొవ్వు పదార్థం అధికంగా ఉండే ఆహారానికి సైతం దూరంగా ఉండాలని శాస్త్రవేత్తలు పేర్కొనడం గమనార్హం.

Latest Videos

click me!