శృంగారం అనేది ఓ మధురమైన అనుభూతి. ఈ కలయికలో.. చివరలో భావప్రాప్తి కలిగితేనే ఆనందం కలుగుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే... అందులో ఏమాత్రం నిజంలేదని నిపుణులు చెబుతున్నారు.
భావప్రాప్తి కలిగితే.. ఆనందం కలగవచ్చు. అయితే... దానికన్నా గొప్పది.. మీకు నచ్చినవారితో.. కలయికలో పాల్గొనడమేనని వారు చెబుతున్నారు. భావప్రాప్తి గురించి మాత్రమే ఆలోచిస్తే.. బంధం ఎక్కువ కాలం నిలపడదట. అలా కాకుండా.. మనిషికి విలువనిస్తూ.. కలయికను ఆస్వాదిస్తే.. ఆ తర్వాత భావప్రాప్తి అదే లభిస్తుందట.
కాగా.. సెక్స్ విషయంలో సెక్యువల్ రెస్పాన్స్ సైకిల్ అనేది కీలక పాత్ర పోషిస్తుందట. ఇంతకీ ఏంటీ ఈ సెక్సువల్ రెస్పాన్స్ సైకిల్. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.. సెక్సువల్ రెస్పాన్స్ సైకిల్( లైంగిక ప్రతి స్పందన చక్రం) ని నాలుగు దశల్లో వివరించవచ్చు.
1.కోరిక..ఈ దశలో మీరు మీ పార్ట్ నర్ ని ముట్టుకోక ముందే లైంగిక భావనలు కలుగుతాయి. వారితో ఉన్నట్లు ఊహించుకోవడం, ముట్టుుకోవడం, ముద్దు పెట్టుకోవడం లాంటివి చేసినట్లు ఊహించుకుంటారు. ఆ తర్వాత వారు మిమ్మల్ని నిజంగా సంప్రదించినప్పుడు ముద్దుతో మొదలుపెడతారు.
2.ఉత్సాహం లేదా ఉద్రేకం..ఈ భావన.. మీరు కోరుకున్న వ్యక్తి మీకు దగ్గరగా వచ్చినప్పుడు కలుగుతుంది. వారు మీతో ఉన్నప్పుడు ఆనందంగా, ఉత్సాహంగా ఉండటం జరుగుతుంది. మీ హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుంది. శరీరమంతా రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. మీ జననేంద్రియాలకు కూడా రక్త ప్రవాహం జరిగి.. లైంగిక కోరికలు కలుగుతాయి.
3.ఇక ఈ దశలో.. సెక్స్ ని ఆస్వాదిస్తారు. భాగస్వామితో మీరు చనువుగా ఉంటారు. వారు ఏది చేసినా మీకు నచ్చేస్తూ ఉంటుంది. తీవ్ర ఉద్వేగానికి గురౌతుంటారు. ఈ దశ అందరికీ నచ్చుతుంది. ఈ దశలో సెక్స్ అనుభవాన్ని రుచి చూస్తారు.
4.ఉద్వేగం.. ఈ దశలో కలయికను ఆస్వాదించడంతోపాటు.. భావప్రాప్తిని కూడా పొందుతారు. ఇది చివరి స్టేజ్. దీనికి కూడా చేరుకోవడంతో.. లైంగిక ప్రతిస్పందన చక్రాన్ని పూర్తి చేసినవారు అవుతారు.
ఈ నాలుగు దశలు పూర్తి కావడాన్ని లైంగిక ప్రతి స్పందన చక్రం అంటారు. అయితే.. ఈ ప్రతి దశలోనూ మనిషి లైంగిక ఆనందాన్ని పొందగలుగుతారట. నిజంగా సెక్స్ ని రుచి చూడకున్నా.. ఆ భావన వారికి ఆనందాన్ని కలిగిస్తుందట. అందుకే.. భావప్రాప్తి.. కలయిక విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.
నిజంగా.. కలయికలో పాల్గొన్న సమయంలో భావప్రాప్తి కలిగితే.. దానిని అదనపు ఆనందంగా భావించాలట. మనం కలయికలో పాల్గొన్న వ్యక్తి పట్ల ఇష్టం, ప్రేమ ఉంటే.. భావప్రాప్తి దానంతట అదే కలిగిస్తుందని చెబుతున్నారు.