గర్భం రాదుకదా అని కండోమ్ పక్కన పెట్టేస్తే..!

First Published | Mar 3, 2020, 2:18 PM IST

తొలి కలయిక కాకపోయినా.. తరచూ శృంగారంలో పాల్గొంటున్నా కూడా చాలమందికి యోనిలో నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఆ నొప్పి కారణంగా వారు కలయికను ఆస్వాదించలేరు. అలాంటివారు కారణం ఏమైఉంటుందో కచ్చితంగా తెలుసుకోవాలి.
 

మెనోపాజ్... మహిళల్లో కీలక దశ ఇది. స్త్రీలకు యవ్వన దశ ఎంత ముఖ్యమో... ఈ మెనోపాజ్ కూడా అంతే ముఖ్యం. ఆ దశకు చేరుకోగానే ఇక జీవితం అయిపోయింది అనుకొని ఫీలయ్యే మహిళలు చాలా మంది ఉన్నారు.
ఒక్కసారి పీరియడ్స్ రావడం ఆగిపోయిందంటే చాలు.. ఇక శృంగారానికి తాము పనికి రామని ఫీలైపోతుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే.. ఆ దశలోనూ శృంగారాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు.

ఆ దశకు చేరుకున్నాము అనే సంకేతం ఇచ్చేలా చాలా మంది కొన్ని సూచలనలు ముందుగా గుర్తించొచ్చు.
తొలి కలయిక కాకపోయినా.. తరచూ శృంగారంలో పాల్గొంటున్నా కూడా చాలమందికి యోనిలో నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఆ నొప్పి కారణంగా వారు కలయికను ఆస్వాదించలేరు. అలాంటివారు కారణం ఏమైఉంటుందో కచ్చితంగా తెలుసుకోవాలి.
కొందరిలో జననాంగాలు పొడిబారతాయి. మోనోపాజ్ దశలోనూ ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల కాకపోవడం వల్ల ఈ సమస్య ఎదురౌతుంది.
మోనోపాజ్ తర్వాత యోనిమార్గంలోని పొర పల్చగా మారుతుంది. ఆ భాగం పొడిబారడం వల్ల నొప్పి వేధిస్తుంది. అలాంటప్పుడు వైద్యులను సంప్రదిస్తే పరిష్కారం ఇట్టే లభిస్తుంది.
ఇన్ ఫెక్షన్లు, గర్భాశయ ముఖద్వారానికి సంబందించిన సమస్యలు ఉన్నా కూడా ఇలా కావొచ్చు. ముఖ్యంగా గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఈ నొప్పి కి కారణం కావొచ్చు.
అండాశయాల్లో సిస్టులు ఉన్నా.. ఎండోమెట్రియం పొర గర్భాశయంలో కాకుండా బయట పెరిగి ఇలా నొప్పి, మంట వేధిస్తూ ఉంటుంది. సమస్యను బట్టి చికిత్స ఉంటుంది.
కొందరికి  ప్రసవ సమయంలో యోని భాగంలో గాయాలౌతుంటాయి. దాని వల్ల కూడా నొప్పి బాధించొచ్చు. లేదా లైంగికంగా సక్రమించే వ్యాధులు ఉండొచ్చు.
వాటివల్ల దంపతులు ఇద్దరూ ఇబ్బందిపడాల్సి ఉంటుంది. కాబట్టి కండోమ్ వాడటం ఉత్తమం. ఇవన్నీ కాకుండా కూడా ఈ సమస్యను మిమ్మల్ని వేధిస్తుంటే.. సెక్స్ థెరపీతో సమస్యను అధిగమించవచ్చు.
మహిళలకు పీరియడ్స్ వచ్చినప్పుడే గర్భం దాల్చగలరు. ఎప్పుడైతే మెనోపాజ్ దశకు చేరుకుంటారో అప్పుడు ఆటోమెటిక్ గా పీరియడ్స్ ఆగిపోతాయి. అయితే.. చాలా మంది ఇక పీరియడ్స్ ఆగిపోయాయి కాబట్టి గర్భం దాల్చే అవకాశం లేదు కదా అని కండోమ్ ని పక్కన పెట్టేస్తారు.
అయితే... కండోమ్ వాడకాన్ని ఆపవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మెనోపాజ్ దశలో గర్భం రాకపోయినా లైంగికంగా సంక్రమించే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి.. కండోమ్ వాడటమే మంచిదని సూచిస్తున్నారు.
ఇంకొందరు.. భర్తలు ఆసక్తి చూపినా.. ఈ వయసులో సరసాలు ఏంటి..? అని అనుకుంటారు. అయితే.. నిజానికి కాస్త ఆసక్తి తగ్గినా.. దానిని పెంచుకునే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు.
భర్తకు దగ్గరగా ఉండటం,ఒకరి చేతిని మరొకరు పట్టుకోవడం.. తరచూ కబుర్లు చెప్పుకోవడం లాంటివి చేయాలి. అలా చేస్తే మళ్లీ శృంగారంపై ఆసక్తి పెరుగుతుంది.

Latest Videos

click me!