చాలా మంది ప్రేమలో ఉంటారు. ప్రేమించడం.. ప్రేమలో ఉండటం చాలా గొప్ప విషయం. అయితే.. కొందరు నిజంగా ప్రేమలో ఉంటే.. కొందరు ప్రేమలో ఉన్నామనే భ్రమలో ఉంటారట. ఇద్దరి మధ్య బంధం ఎలా ఉందనే విషయం.. వారి రిలేషన్ పైనే డిపెండ్ అయ్యి ఉంటుంది.
రిలేషన్ షిప్స్ లోనూ... హెల్దీ, అన్ హెల్దీ అంటూ రకాలు ఉంటాయి. అసలు హెల్దీ రిలేషన్ ఎలా ఉంటుంది.. అన్ హెల్దీ రిలేషన్ షిప్ ఎలా ఉంటుందనే విషయంలో క్లారిటీ ఉంటే.. ఆ బంధం మరింత అందంగా ఉంటుందట.
హెల్దీ రిలేషన్ షిప్ లో ఉన్నవారు ఆ బంధంలో చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. తమ ఆలోచనలను ఎదుటి వారితో పంచుకోవడానికి సంకోచించరు. అయితే.. అన్ హెల్దీ రిలేషన్ లో ఉన్నవారు మాత్రం అలా కాదట. ఏ విషయం చెప్పాలన్నా.. ఎదుటివారు ఏమనుకుంటారో అని భయపడిపోతుంటారు.
హెల్దీ రిలేషన్ లో ఉన్నవారు.. తమ పార్ట్ నర్ తోపాటు సమానంగా చూస్తారు. తమతోపాటు.. అన్నీ సమాన హక్కులు ఉన్నాయని భావిస్తారు. అయితే.. అన్ హెల్దీ రిలేషన్ లో మాత్రం అలా ఉండరట. ఒకరిదే ఆధిపత్యం ఉంటుంది.
హెల్దీ రిలేషన్ లో ఉన్నవారు.. ఒకరికొకరు మర్యాద ఇస్తారు. ఒకరి ఆలోచనలకు మరొకరు విలువ ఇస్తారు. వాటిని ఆచరణలో పెట్టడానికి సహకరిస్తారు. ఇక అన్ హెల్దీ రిలేషన్ లో ఉన్నవారు తమ పార్ట్ నర్ ని ప్రతి నిమిషం క్రిటిసైజ్ చేయడం.. రూడ్ బిహేవ్ చేయడం లాంటివి చేస్తుంటారు.
హెల్దీ రిలేషన్ లో ఉన్నవారు తమ పార్ట్ నర్ పట్ల పూర్తిగా నమ్మకంతో ఉండాలి. ఎక్కువ పొసెసివ్ నెస్ ఉండటం కూడా రిలేషన్ కి అంత మంచిదేమీ కాదట. అలా ఉంది అంటే.. అది అన్ హెల్దీ రిలేషన్ కిందకే వస్తుంది.
హెల్దీ రిలేషన్ లో ఉన్నవారు తమ పార్ట్ నర్ తో ప్రతి విషయంలో నిజాయితీగా ఉంటారు. అబద్ధాలు చెప్పడం లాంటివి చేయరు. అబద్దాలు చెబుతున్నారంటే మాత్రం వారిది అన్ హెల్దీ రిలేషన్ కిందకే వస్తుంది.
హెల్దీ రిలేషన్ లో ఒకరినొకరు పూర్తిగా ఎలాంటి అనుమానం లేకుండా నమ్మకం పెట్టుకుంటారు. వారు చెప్పే విషయంలో అబద్దం ఉందేమో అనే సంకోచం కూడా రాదు. కానీ ఒకవేళ అనుమానం వచ్చింది అంటే.. మాత్రం వారి రిలేషన్ అన్ హెల్దీగా ఉందనే విషయం అర్థం చేసుకోవాలి.
హెల్దీ రిలేషన్ లో ఉన్నవారు ఇలానే ఉండూ.. అలానే ఉండూ అంటూ ఆంక్షలు పెట్టరు. అలా పెట్టే రిలేషన్ హెల్దీనే కాదు. అలా బౌండరీస్ పెట్టడం వల్ల కపుల్స్ మద్య విభేదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయట.
ఒకరొని మరొకరు భయపెట్టడం.. బెదిరించడం లాంటివి చేస్తున్నారు అంటే.. వారి రిలేషన్ అన్ హెల్దీగా ఉందని అర్థం.