శృంగారంలో ఎక్కువగా మొదటి అడుగు పురుషులదే అయి ఉంటుంది. మెల్లిగా స్త్రీని కవ్వించడం, రెచ్చగొట్టడం.. కామకేళికి ప్రేరేపించడం పురుషుల ఆట. అయితే కొన్నిసార్లు స్త్రీలు కూడా ఈ విషయాల్లో చాలా ముందుంటారు. అందీఅందకుండా ఊరిస్తూ.. అబ్బాయిల మనసులో కావాల్సినంత కోరిక పుట్టిస్తూ సరదాగా.. రతిక్రీడకు సిద్ధం చేస్తుంటారు.
అయితే కొన్ని చర్యలు మీరు చెప్పకుండానే మీరు కలయికకు సిద్ధం అనే భావనను కలిగిస్తాయి. చెప్పీ చెప్పకనే.. ఊరించి, ఉడికించి.. చివరికి స్వర్గపుటంచులు తాకేలా చేయడం అన్నమాట.. అలాంటి కవ్వింపు ఐడియాలు స్త్రీల కోసం కొన్ని...
చక్కగా ముస్తాబవ్వండి.. లేత నలుపు లేదా ఎరుపు రంగులో ఉండే లోదుస్తులతో కంఫర్టబుల్ గా, అదే సమయంలో అందంగా కనిపించే దుస్తులు వేసుకుని రెడీ అవ్వండి. రాత్రికి మీ భాగస్వామి ఇంటికి వచ్చేసరికి సెక్సీ దుస్తులతో కనిపిస్తే.. ప్రెషప్ కూడా కాకుండానే బెడ్ రూం దారి పట్టడం ఖాయం.
ఇక అతనికోసమే అంత ప్రత్యేకంగా తయారయానని, అతని కోసం మాత్రమే మీరు దుస్తులు ధరించారని అతనికి తెలియజేయండి. అప్పుడు మీ ఇద్దరి చుట్టూ ఆ మేజిక్ ఎలా పనిచేస్తుందో చూడండి.
మీరే కాదు మీ భాగస్వామి కూడా ఫుల్ హాట్ గా ఉండాలని అనుకుంటే.. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి ముందు.. కొన్ని ప్రేమపూర్వక మెసేజ్ లు పంపండి.. కాస్త చిలిపిగా ఉంటే ఇంకా మంచిది. కొన్ని మీ సెమీ న్యూడ్ ఫొటోలతో మీ భాగస్వామికి పిచ్చెక్కించొచ్చు.
అవి చూసిన అతను మీకు ఖచ్చితంగా సర్ ఫ్రైజ్ ఇవ్వడం గ్యారంటీ. శృంగారనికి ముందు ఇలాంటివి ఇద్దర్నీ హాట్ గా మార్చేస్తాయి.
ఇద్దరూ కలిసి సినిమాలు చూసేలా మీ భాగస్వామిని ప్రేరేపించండి. అయితే ఆ సినిమాల్లో హాట్ సీన్స్.. మిమ్మల్ని ఉద్రేకపరిచే సన్నివేశాలు ఉండేవి మాత్రమే ఎంచుకోండి.
అది మీరు శృంగారానికి సిద్ధంగా ఉన్నారని మీ హజ్బెండ్ కు చెప్పకనే చెబుతుంది. ఇక తరువాతి విషయాలు వాళ్లే చూసుకుంటారు.
మీ గత జ్ఞాపకాలను తవ్వి తీయండి.. ఇద్దరూ కలిసి తిరిగిన ప్రదేశాలు, చేసిన ప్రయాణాలు గుర్తు చేసుకోండి. ఆ ప్రత్యేకమైన సందర్బాల్లో మీ ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేసిన క్షణాలను గుర్తు చేసుకోండి.
ఇలా పాత జ్ఞాపకాలను.. అప్పటి విషయాలను సరదాగా గుర్తు చేయడం.. మీరిప్పుడు శృంగారానికి ఆసక్తిగా ఉన్నారని చెప్పే ఓ అందమైన మార్గం.
సరదాగా మాట్లాడుకునేప్పుడు సంభాషణలో శృంగారానికి సంబంధించిన పదాలు వచ్చేలా చూడండి. చాలామంది మధ్యలో ఉండి మీరు శృంగారం గురించి చెప్పాలనుకుంటే ఇది కరెక్ట్ మార్గం.
ఇలా అందరిలో కూడా మీరు మీ భాగస్వామి మీద ఆసక్తి చూపించడం వారికి మరింతగా నచ్చుతుంది. శృంగారంలో కోరికను పెంచి రతిక్రీడలో పీక్ కు వెళ్లేలా చేస్తుంది.