పిల్లలు పుట్టాక శృంగారం.. ఇలా చేస్తే మళ్లీ దారిలోకి...

First Published Jun 7, 2021, 1:19 PM IST

దంపతుల మధ్య పిల్లలు పుట్టిన తరువాత కొంత గ్యాప్ వస్తుంది. ఇదివరకులా ఎప్పుడంటే అప్పుడు ఒకరికోసం ఒకరు టైం కేటాయించుకోలేరు. మనసులో కోరికలు చెలరేగుతున్నా.. తనువుల దాహం తీర్చలేరు. దీంతో ఆ గ్యాప్ కాస్త పక్కదారి పట్టే ప్రమాదాలూ ఉంటాయి.

దంపతుల మధ్య పిల్లలు పుట్టిన తరువాత కొంత గ్యాప్ వస్తుంది. ఇదివరకులా ఎప్పుడంటే అప్పుడు ఒకరికోసం ఒకరు టైం కేటాయించుకోలేరు. మనసులో కోరికలు చెలరేగుతున్నా.. తనువుల దాహం తీర్చలేరు. దీంతో ఆ గ్యాప్ కాస్త పక్కదారి పట్టే ప్రమాదాలూ ఉంటాయి.
undefined
వివాహేతర సంబంధాల్లో ఎక్కువగా భార్య గర్భిణిగా ఉన్న సమయంలో లేదా డెలివరీ అయిన సమయాల్లోనే ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ గ్యాప్ ను దూరం చేసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది.. అదెలాగో చూడండి...
undefined
మీరు, మీ భర్త డేట్ నైట్స్ కు వెళ్లేలా టైం సెట్ చేసుకోండి. కనీసం ఇద్దరూ కలిసి ఓ రొమాంటిక్ మూవీ చూడండి. పాప పడుకున్నప్పుడో.. లేదా నాన్నమ్మ దగ్గరో, అమ్మమ్మ దగ్గరో ఉన్నప్పుడో వేరే విషయాలకు కాకుండా ఇద్దరూ ఒకరితో ఒకరు గడపడానికి టైం కేటాయించుకోండి.
undefined
ఇద్దరి మధ్య రోజూ తలెత్తుతున్న వాదనలు, గొడవలు, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివాటిగురించి చర్చించుకోవడానికి వారంలో ఓ రోజును కేటాయించుకోండి. అన్నీ ఆ రోజే తేల్చేసుకోండి.. దీనివల్ల రోజూ గొడవలు తగ్గుతాయి, అలకలు, కోపాలు దూరాన్ని పెంచే అవకాశం లేకుండా పోతుంది.
undefined
పిల్లలు పుట్టిన తరువాత భార్యభర్త ల మధ్య ఎక్కువగా వచ్చే గొడవలు పిల్లల డైపర్స్ మార్చడం, వారికి పాలు పట్టడం, వారి ఆలనా, పాలనా విషయాల్లోనే అయి ఉంటుంది. ఎవరెంత ఎక్కువ చూసుకున్నారు అని లెక్కలు వేసుకునేకంటే.. ఇద్దరూ కలిసి అది తమ బాధ్యతగా తీసుకుని, ఒకరికొకరు సాయం చేసుకునేలా మాట్లాడుకుంటే గొడవలే ఉండవు.
undefined
పిల్లల పనితో అలిసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకుందామనుకున్నప్పుడు... మీ భర్త నుంచి మీకు ఎలాంటి సాయం కావాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి. అప్పుడే వాళ్లు మీకు కోఆపరేట్ చేయగలుగుతారు. అలాకాకుండా ఏమీ హెల్ప్ చేయడం లేదంటూ విసుక్కోవడం, నిందలు వేయడం వల్ల ప్రయోజనం ఉండదు.
undefined
బేబీని చూసుకోవడం, ఇంటిపనులకు షిప్ట్ లు వేసుకోండి. ఒకరు ఒకపని చేస్తే మరొకరు మరకటి చేయండి. పనుల్ని విభజించుకోండి. పంచుకోండి. ఇద్దరూ కలిసికట్టుగా చేసుకోవడం వల్ల పనులు ఈజీగా అవ్వడమే కాకుండా ఇద్దరి మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది.
undefined
ఏ బంధంలోనైనా మెప్పుకోలు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక భార్యభర్తలు తమ అనుబంధాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంత చిన్నవైనా సరే ఒకరినొకరు మెచ్చుకోండి. రోజువారీ పనులు, పిల్లల పెంపకంలో ఎంతగా విసిగిపోయినా సరే ఇది మాత్రం మరిచిపోవద్దు.
undefined
పిల్లలు పుట్టాక మీ జీవితాలు పూర్తిగా మారిపోతాయి. మీ అభిరుచులకు తగిన సమయం దొరకదు. అలాంటప్పుడు ఇద్దరూ విడివిడిగా కాకుండా ఇద్దరికీ కలిసి ఉండే జాయింట్ హాబీల మీద దృష్టి పెట్టండి.
undefined
మొక్కలకు నీళ్లు పోయడమో, సాయంత్రాలు ఎదురెదురుగా కూర్చుని కాఫీ తాగడమో.. ఇలాంటి చిన్నచిన్నవైనా సరే మీ ఇద్దరూ స్వాంతన పొందడానికి వీలవుతుంది.
undefined
మీరు ప్రేమలో పడ్డ మొదటి రోజుల్లో లేదా పెళ్లైన కొత్తలో ఎలా ఉండేవారు.. ఎలాంటి చిలిపి పనులు చేసేవారు లాంటి విషయాలు గుర్తు చేసుకోండి. జ్ఞాపకాలు మిమ్మల్ని బాగా రిఫ్రెష్ చేసి మళ్లీ ప్రేమలో పడేలా చేస్తాయి.
undefined
ఇక చివరగా దంపతుల మధ్య అతి ముఖ్యమైన అంశం శృంగారం కోసం ప్లాన్ చేసుకోండి. దీనివల్ల మీ శృంగారజీవితం మళ్లీ పట్టాలెక్కుతుంది.
undefined
click me!