పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవడం ఈ మధ్యకాలంలో చాలా కామన్ అయిపోయింది. పెళ్లికి ముందే.. వేలల్లో.. లక్షల్లో ఖర్చు పెట్టి మరీ.. ఈ ఫోటోలు, వీడియోలు చేయించుకోవడం ఒక ట్రెండ్ గా మారింది.
ప్రతి ఒక్కరూ.. వినూత్నంగా.. ఒకరిని మించి మరోకరు చేయించుకోవడానికి పోటీ పడుతున్నారు. ఇలానే ఓ జంట కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంది. అయితే... అది చూసినవారంతా మామూలుగా షాకవ్వలేదు.
ఇటీవల కేరళలో ఓ జంట.. అంతకముందు ఓ జంట... రొమాన్స్ ఘాటు ఎక్కువగా పెంచి మరీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకున్నారు. ఆ ఫోటోలు వైరల్ అయ్యి.. నెటిజన్ల చివాట్లు కూడా తిన్నారు. అయితే.. తాజాగా.. మరో జంట మరింత వినూత్నంగా ప్రీవెడ్డింగ్ షూట్ చేయించుకోవడం గమనార్హం.
కేవలం అరటి ఆకు అడ్డుపెట్టుకొని కాబోయే వధూవరులు ఫోటోలు దిగడం గమనార్హం.
కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా ఇదే విధంగా ఆకు అడ్డుపెట్టుకొని ఫోటో దిగగా.. అది కూడా విపరీతంగా వైరల్ అయ్యింది.
ఈ కాబోయే వధూవరులు సైతం ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు. దీంతో.. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
వీరి ఫోటోలను నెటిజన్ల కామెంట్స్ వింటే... పొట్ట పగిలిపోవాల్సిందే. గాలికి ఆకు ఎగిరిపోతే ఏం చేస్తారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మరో నెటిజన్.. అటుగా ఓ మేక వచ్చి ఆకు తినేస్తే ఏం చేస్తారు అంటూ కామెంట్ చేయడం గమనార్హం.
ఇంకొకరేమో.. అయ్యో.. వాళ్ల దుస్తులు ఎవరైనా ఎత్తుకెళ్లారా..? పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు కదా అని పేర్కొనడం విశేషం.
ఇది ప్రీ వెడ్డింగ్ షూటా.. హనీమూన్ ఆ అని కొందరు కామెంట్ చేశారు.
ఇక ట్రోల్ పేజెస్ కూడా వీళ్ల ఫోటోలతో ట్రోల్స్ మొదలుపెట్టడం గమనార్హం.
ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్..
ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్..
ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్..