కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ వైరస్ అంటు వ్యాధి అని.. కేవలం ముట్టుకున్నా.. తుమ్మినా, దగ్గినా ఇతరులకు పాకేస్తుందన్న విషయం మనకు తెలిసిందే.
అయితే.. ఈ వైరస్ విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. శృంగారం వల్ల కూడా ఈ వైరస్ వ్యాపిస్తుందా అనే అనుమానం చాలా మందిలో ఉంది. దీనిపై పలు సంస్థలు పలు పరిశోధనలు కూడా చేశాయి.
అయితే.. వారి పరిశోధనల్లో కొందరు శృంగారం వల్ల కరోనా రాదని తేల్చినా.. మరి కొందరు మాత్రం పురుషుల వీర్యంలో కరోనా వైరస్ ని కనుగొన్నామని చెబుతున్నారు.
అయితే... ఇప్పటి వరకు కరోనా రానివాళ్లే.., దీని గురించి తెగ వెతికారు. మరి కరోనా సోకిన వారి పరిస్థితి ఏంటి...? ఒక వ్యక్తి కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. మళ్లీ కలయికలో పాల్గొనాలంటే ఎంతకాలం వేచి ఉండాలి..?
ఈ విషయంపై కూడా ఓ సంస్థ పరిశోధనలు చేసింది. వారి పరిశోధన ప్రకారం.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కనీసం 30 రోజలు వరకు శృంగారంలో పాల్గొనవద్దని నిపుణులు చెబుతున్నారు
అప్పటి వరకు శరీరంలో కరోనా వైరస్ కి సంబంధించిన ఆనవాళ్లు ఉండే అవకాశం ఉందని.. తద్వారా తమ భాగస్వామికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
థాయిలాండ్ లో దాదాపు 38మంది కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల వీర్యంపై ఈ మేరకు పరిశోధనలు చేశారు. వారిలో 16శాతం మంది వీర్యంలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు.
కోలుకొని దాదాపు నెల రోజులు గడిచిన వారిలో మాత్రం వైరస్ అవశేషాలు కూడా కనపడలేదని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి.. కనీసం ఒక నెల దూరంగా ఉంటేనే మంచిదని చెబుతున్నారు.
నెల రోజులు ఆగిన తర్వాత కూడా కండోమ్ వాడకం మంచిదని చెబుతున్నారు. ఒక భాగస్వామికి కరోనా లక్షణాలు కనపడితే.. మీరు కూడా ముందస్తు జాగ్రత్తలో ఉండటం మంచిది.
కరోనా శృంగారం వల్ల రాదన్న విషయం మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి. ఒక వేళ మీ భాగస్వామికి కరోనా లక్షణాలు ఉంటే.. వారితో సన్నిహితంగా మెలగడం, ముద్దులు పెట్టుకోవడం వల్ల మీకు కూడా కరోనా వచ్చే అకవాశం ఉంది.
కరోనా లక్షణాలు ఉంటే మాత్రం శృంగారానికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముద్దులకైతే ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.