ఆ శృంగార మందుతో.. కరోనాకి చెక్!

First Published | Aug 7, 2020, 7:25 AM IST

ఈ మందు పేటెంట్లు కలిగిన స్విట్జర్లాండ్‌ కంపెనీ రిలీఫ్‌ థెరపాటిక్స్‌, ఇజ్రాయెలీ-అమెరికన్‌ సంస్థ న్యూరోఆర్‌ఎక్స్‌తో కలిసి సెప్టెంబరు 1 నుంచి ప్రయోగ పరీక్షలను ప్రారంభించనుంది. 

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీనిని అరికట్టేందుకు పలు దేశాలు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నాయి. కరోనా కి మందు, వ్యాక్సిన్ కనుగొనడంలో అన్ని దేశాలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఓ మందు ఆశలు రేకెత్తిస్తోంది.
శృంగార సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించే మందుతో.. కరోనా వైరస్ కి చెక్ పెట్టొచ్చట. మీరు చదివింది నిజమే. అంగస్తంభన సమస్యల నివారణకు వాడే ‘ఆర్‌ఎల్‌ఎఫ్‌-100’ ఔషధం ఇప్పుడు కరోనా వైరస్ ని నాశనం చేస్తోందని తేలింది. కరోనా సోకిన వారికి ఈ మందు అందజేస్తే.. వారు త్వరగా కోలుకుంటున్నట్లు నిపుణులు చేసిన పరిశోధనలో తేలింది.

ముక్కు ద్వారా పీల్చే ఈ మం దుకు ‘అవిప్టడిల్‌’ అనే పేరు కూడా ఉంది. దీనితో తీవ్ర, మోస్తరు ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రోగులపై ప్రయోగ పరీక్షలు జరిపేందుకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) గురువారం పచ్చజెండా ఊపింది.
ఈ మందు పేటెంట్లు కలిగిన స్విట్జర్లాండ్‌ కంపెనీ రిలీఫ్‌ థెరపాటిక్స్‌, ఇజ్రాయెలీ-అమెరికన్‌ సంస్థ న్యూరోఆర్‌ఎక్స్‌తో కలిసి సెప్టెంబరు 1 నుంచి ప్రయోగ పరీక్షలను ప్రారంభించనుంది.
వాస్తవానికి ఈ మందును అత్యవసర ప్రాతిపదికన కరోనా రోగులకు అందించేందుకు జూన్‌లోనే అనుమతులొ చ్చాయి. అమెరికాలోని హ్యూస్టన్‌ మెథడిస్ట్‌ ఆస్పత్రి నిర్వాహకుల కథనం ప్రకారం.. దీన్ని తీవ్ర ఇన్ఫెక్షన్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఓ 54 ఏళ్ల వ్యక్తికి అందించారు.
ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స విఫలమవడంతో ఆస్పత్రిలో చేరిన సందర్భంగా అతడికి వైరస్‌ సోకింది. ఈ క్రమంలో తీవ్ర శ్వాసకోశ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆ రోగి నాలుగు రోజుల్లోనే వెంటిలేటర్‌పై నుంచి బయటికి వచ్చేలా ‘ఆర్‌ఎల్‌ఎఫ్‌-100’ చేయగలిగింది.
ఆయనలా మరెందరో వేగంగా కోలుకునేందుకు ‘అవిప్టడిల్‌’ కారణమైంది. కరోనా రోగులకు ప్రాణగండానికి కారణ‘భూతం’ అవుతున్న సైటోకైన్‌ స్టార్మ్‌ను నిలువరించడంలో.. ఊపిరితిత్తుల కణాలు, ఏక కేంద్ర తెల్ల రక్తకణాల్లో (మోనోసైట్స్‌) వైరస్‌ సంఖ్య పెరగకుండా ఆర్‌ఎల్‌ఎఫ్‌-100 నిరోధిస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Latest Videos

click me!