శృంగారంపై కరోనా దెబ్బ... పురుషుల వీర్యంలో కరోనా వైరస్

First Published | May 9, 2020, 11:46 AM IST

తాజాగా శృంగారం ద్వారా కూడా కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది చైనాకు చెందిన ఓ అధ్యయన బృందం. 

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ వైరస్ అంటు వ్యాధి అని.. కేవలం ముట్టుకున్నా.. తుమ్మినా, దగ్గినా ఇతరులకు పాకేస్తుందన్న విషయం మనకు తెలిసిందే.
అయితే.. ఈ వైరస్ విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. శృంగారం వల్ల కూడా ఈ వైరస్ వ్యాపిస్తుందా అనే అనుమానం చాలా మందిలో ఉంది. దీనిపై చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతికేశారు కూడా.

కాగా.. తాజాగా ఈ విషయంపై చైనా, అమెరికా దేశాలు పరిశోధనలు ప్రారంభించాయి. శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి చెందకపోవచ్చని తమ పరిశోధనలో తేలినట్లు చైనా, అమెరికా దేశాలు ప్రకటించాయి.
ఈ దేశాల ప్రకటనతో చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు. అయితే... తాజాగా జరిపిన పరిశోధన అందరినీ విస్మయానికి గురిచేసింది.
తాజాగా శృంగారం ద్వారా కూడా కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది చైనాకు చెందిన ఓ అధ్యయన బృందం.
షాంగిక్యూ మున్సిపల్‌ ఆస్పత్రిలో కరోనా నుంచి కోలుకుంటున్న 38 మంది కరోనా బాధితులపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరిలో ఆరుగురి వీర్యంలో కరోనా వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు.
అయితే మహమ్మారి కరోనా వైరస్‌ వీర్యంలో ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేకపోయారు. ఈ ఆరుగురిలో ఇద్దరు కోలుకోగా.. నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. అయితే శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతుందా అనేదానిపై పరిశోధకులు ఏ నిర్ణయానికి రాలేకపోతున్నారు.
‘వీర్యంలో కరోనా ఉన్నంత మాత్రానా శృంగారం ద్వారా మరొకరికి వస్తుందని చెప్పలేం. ఒకవేళ అదే రుజువైతే శృంగారానికి దూరంగా ఉండటమో, కండోమ్‌ వాడటమో చేయాలి. కరోనా లక్షణాలు కనిపిస్తే శృంగారానికి దూరంగా ఉంటేనే మంచిది’ అని చైనా పరిశోధకులు పేర్కొంటున్నారు.
ఆ అంశంపై అధ్యయంన చేసి రూపొందించిన నివేదికను జామా నెట్‌వర్క్ వెల్లడించింది. ఇక ఎబోలా, జికా వంటి వైరస్‌లు శృంగారాం ద్వారా కూడా వ్యాపిస్తాయన్న విషయం తెలిసిందే.

Latest Videos

click me!