Relations: సెక్స్ విషయంలో అబ్బాయిలు చేసే పొరపాట్లు ఇవే..!

First Published | Aug 10, 2022, 2:44 PM IST

ఇష్టపడి చేసుకున్న తర్వాత కూడా చాలా మంది మహిళలు సెక్స్ విషయంలో తృప్తి చెందడం లేదంట. ఎందుకంటే చాలా మంది పురుషులు సెక్స్ ని కేవలం శారీరకంగానే చూస్తున్నారట.

sex drive

రెండు చేతులు కలవకుండా చప్పట్లు ఎలా మోగవో... ఇద్దరు భాగస్వాముల ప్రమేయం లేకుండా.. సెక్స్ జీవితం సజావుగా సాగదు. కేవలం ఒక్కరే ప్రతిసారీ కలయిక విషయంలో తమదే పై చేయి గా ఉంటున్నారంటే.. అది మరొకరికి నిరాశగానే ఉంటుంది. ఈ విషయంలో ముఖ్యంగా.. ఎక్కువగా పురుషులదే తప్పు ఉంటుందట. తమ భాగస్వామి ఇష్టాన్ని తెలుసుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటారట. కలయిక విషయంలో పురుషులు కామన్ గా చేసే తప్పులేంటో ఓసారి చూద్దాం...

పెళ్లి ఎలా జరిగింది అనేది విషయం కాదు. ఎందుకంటే కొందరు ఇష్టపూర్వకంగా  చేసుకుంటారు... కొందరు అయిష్టంగా చేసుకుంటారు. కానీ ఇష్టపడి చేసుకున్న తర్వాత కూడా చాలా మంది మహిళలు సెక్స్ విషయంలో తృప్తి చెందడం లేదంట. ఎందుకంటే చాలా మంది పురుషులు సెక్స్ ని కేవలం శారీరకంగానే చూస్తున్నారట. మానసిక సాన్నిహిత్యంగా భావించడం లేదట. కానీ నిజం చెప్పాలంటే మానసిక సాన్నిహిత్యం లేకపోవడమే స్త్రీలను దూరం చేస్తుంది. చాలా మంది పురుషులు చేసే మొదటి తప్పు ఇదేనట.



సెక్స్ అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినది. అందులో వారు సమానంగా పాల్గొనాలి.  అంతేకాదు.. కలయిక విషయంలో ప్రతి ఒక్కరూ వేర్వేరు అవసరాలను కలిగి ఉంటారు. వారికి వివిధ అంచనాలు కూడా ఉంటాయి.  ఫ్రీక్వెన్సీ స్థాయిలు, లైంగిక కోరిక స్థాయి కూడా భిన్నంగా ఉండవచ్చు. ఇద్దరూ ఈ విషయాలను చర్చించుకోవాలి. కానీ చాలా మంది అలా చేయడం లేదట. దీంతో.. స్త్రీలు అసంతృప్తితో మిగిలిపోతున్నారట.

SEX


సెక్స్ విషయంలో రొటీన్‌ను ఎవరూ ఇష్టపడరు. సెక్స్ నిజానికి ఒక కళ కాబట్టి, విభిన్న స్థానాలు, పద్ధతులను ప్రయత్నించడం చాలా ముఖ్యం. మీ సెక్స్ జీవితాలను మెరుగుపరచండి. రిఫ్రెష్ చేయండి. లేదంటే.. మీ భాగస్వామి మీ పట్ల శారీరకంగా, ఎమోషనల్ గా కూడా కనెక్షన్ కోల్పోయే అవకాశం ఉంది.

పురుషులు, సగటున, సెక్స్ ప్రారంభించిన 5-6 నిమిషాల తర్వాత స్కలనం చేస్తారు. మహిళలు ఎక్కువ సమయం తీసుకుంటారు. వారు సులభంగా 15 నిమిషాలు తీసుకునే అవకాశం ఉంది. మహిళలు కంగారుగా.. తొందరగా కలయికను ముగించాలి అని అనుకోరట. వారు ఈ విషయంలో ఎక్కువ సమయం తీసుకుటారు. కాబట్టి.. నెమ్మదిగా చేయడాన్ని ఇష్టపడతారు. ఈ విషయాన్ని చాలా మంది పురుషులు అర్థం చేసుకోవడం లేదట. 

sex

చాలా మంది పురుషులు తమకు భావప్రాప్తి కలిగిన వెంటనే తమ పని అయిపోయిందని అనుకుంటూ ఉంటారు. అయితే.. మీ భాగస్వామి ఇంకా కోరుకుంటోందనే విషయాన్ని పురుషులు గ్రహించడం లేదట. కనీసం గుర్తిస్తే.. వారికి సెక్స్ టాయ్స్ కానీ, స్టిమ్యులేషన్ లాంటి మార్గాలను పరిచయం చేసే ప్రయత్నం చేయాలి. దీని వల్ల మీ భాగస్వామి నిరాశ నుంచి బయటకు పడే అవకాశం ఉంది. 

sex

ఇక చివరగా.. చాలా మంది పురుషులు చేసే మరో తప్పు.. ఫోర్ ప్లే పై దృష్టి పెట్టకపోవడం. స్త్రీలు ఎక్కువగా ఫోర్ ప్లేని ఇష్టపడతారట. దాని  వల్ల కూడా... వారిని ఎక్కువగా సంతృప్త పరచవచ్చు. ఈ విషయం తెలుసుకోక చాలా మంది తప్పులు చేస్తున్నారట. కాబట్టి.. వారు కచ్చితంగా ఫోర్ ప్లే పై దృష్టి పెట్టాలి.

Latest Videos

click me!