కొత్తగా పెళ్లైన దంపతులను ఎవరినైనా చూడగానే.. చాలా మంది వీళ్లు సెక్స్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటూ ఉంటారు. కొత్త జంట కదా.. ఒకరొకరు వదిలిపెట్టి ఉండలేరు.. ఎక్కువ సేపు పడక గదిలోనే సమయం కేటాయిస్తారు.. ఇలా చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు.
అయితే.. నిజానికి వాటిలో చాలా మంది విషయంలో నిజాలు ఉండటవట. అందరూ అనుకుంటున్నట్లుగా.. పెళ్లైన కొత్తలో సెక్స్ లైఫ్ ని పెద్దగా ఎంజాయ్ చేయలేరట. సెక్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడతారట. పెళ్లై తర్వాత కొంతకాలం కలిసి ఉన్నవారు మాత్రమే శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారట. అసలు.. పెళ్లైన కొత్తలో ఎదురయ్యే కామన్ సమస్యలేంటో ఓసారి చూద్దాం..
కొత్తగా పెళ్లైన వారికి శృంగారంలో మునిగి తేలాలని కోరుకుంటారు. గతంలో సినిమాల్లో చూసినవో.. స్నేహితులు చెప్పినవి వినో.. వారకంటూ కొన్ని ఊహలు, కోరికలు ఉంటాయి. ఈ క్రమంలోనే కొన్ని అనుమానాలు కూడా తెచ్చుకుంటారు. అసలు రోజుకి ఎన్నిసార్లు సెక్స్ చేయాలి..?
ఇక పార్ట్ నర్స్ లోనూ ఒకరికి ఎక్కువ సార్లు చేయాలనే ఉత్సాహం ఉండొచ్చు.. ఇంకొకరికి ఉండకపోవచ్చు. కొత్త జంట కాబట్టి.. ఆ విషయంలో పెద్దగా అవగాహన కూడా ఉండకపోవచ్చు. దాని వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందట.
ఇక చాలా మంది అబ్బాయిలకు ముఖ్యంగా తొలిసారి సెక్స్ లో పాల్గొనేవారికైతే కనీసం కండోమ్ ఎలా వేసుకోవాలో కూడా అవగాహన ఉండదు. ఈ క్రమంలో అంగస్థంభనకు గురైపోతుంటారు. అలాంటి పరిస్థితిలో ఎలా స్పందించాలో.. అమ్మాయిలకు కూడా పెద్దగా అర్థం కాదు.
అబ్బాయిలో శ్రీఘ్రస్కలనం జరగడం.. ఇక అమ్మాయిల్లో భావప్రాప్తి కలగకపోవడం లాంటి సందర్భాలు వరసగా రెండు, మూడుసార్లు జరిగితే.. ఇక తాము జీవితంలో శృంగారాన్ని ఆస్వాదించలేము అనే భావన కొందరిలో పెరిగిపోతుంది.
దీని వల్ల సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపించరు. దాని వల్ల అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. అలాకాకుండా.. భావప్రాప్తి తో సంబంధం లేకుండా సెక్స్ లో పాల్గొంటే.. కొంత కాలం తర్వాత అసలు అనుభూతిని పొందే అవకాశం ఉంది. కొందరిలో కొన్ని వెంటనే జరగకపోవచ్చనే విషయాన్ని గుర్తించుకోవాలి.
ఒక తొలిరేయి రోజు అమ్మయిలకు రక్తస్రావం జరగితే.. వాళ్లు వర్జిన్ అని.. అలా కాకుంటే వర్జిన్ కాదని భ్రమపడుతుంటారు. వాటిని నిజమని నమ్మి కాపురాలు కూల్చుకుంటున్నవారు ఇప్పటికీ ఉండటం గమనార్హం.
ఇక చాలా మంది నూతన దంపతులకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది. ఒకరితో మరొకరు సిగ్గు, భయం తదితర కారణాల వల్ల మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేరు. దీంతో.. వారు సెక్స్ లైఫ్ ని పూర్తిగా ఆస్వాదించలేరు.