మనిషి జీవితంలో ఏదీ పర్ఫెక్ట్ అనేది ఉండదు... తెలిసో తెలియకో.. మనమంతా ఏవేవో తప్పులు చేస్తూ ఉంటాం. అయితే.. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక శృంగారంలోనూ చాలా మంది కామన్ కొన్ని తప్పులు చేస్తుంటారు. అవేంటో తెలుసుకొని.. ఆ తప్పులకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూసేద్దాం..
undefined
మీ అందరికీ సినిమాలు చూసే అలవాటు ఉందా..? అందులో ఇలాంటి సీన్ ఏదైనా ఉంది అంటే.. దానికి ముందు రొమాన్స్ కి ఎక్కువ స్కోప్ ఇస్తారు. అవంటే సినిమా కదా అని తీసిపారేయకండి. ఎందుకంటే.. సెక్స్ లైఫ్ లో రొమాన్స్ కి మాత్రమే ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలట. ముందుగానే పని మొదలుపెట్టకూడదట. ఫోర్ ఫ్లే చేసి ఆ తర్వాత సెక్స్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని సూచిస్తూన్నారు.
undefined
ఇక ఓరల్ సెక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే.. ఇంపార్టెంట్ అన్నారు కదా.. అని ఇష్టం లేకుండా ఓరల్ సెక్స్ చేయడం మాత్రం కరెక్ట్ కాదట. బలవంతంగా చేయడం వల్ల దానిని ఎంజాయ్ చేయలేరని.. ఆ తప్పు చేయవద్దని సూచిస్తున్నారు.
undefined
ఇక చాలా మంది దంపతులు కేవలం పిల్లలు వద్దు అనుకుంటే మాత్రమే కండోమ్ వాడాలి అనే భ్రమలో ఉండిపోతారు. అయితే.. అందులో ఎలాంటి నిజం లేదట. కండోమ్ వాడటం వల్ల లైంగిక పరమైన వ్యాధులు రాకుండా ఉంటాయి. కాబట్టి.. ప్రొటెక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కండోమ్ వాడటం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
undefined
ఇక పీరియడ్స్ సెక్స్... పీరియడ్స్ సమయంలో సెక్స్ చాలా కొత్తగా.. ఎక్సైటింగ్ ఉండొచ్చు. కానీ.. అలా చేయాలని రూల్ ఏమీ లేదు. పీరియడ్స్ సమయంలో రెస్ట్ తీసుకునే హక్కు మహిళలకు ఉంది. ఆ సమయంలో బలవంతంగా సెక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇబ్బంది పడాల్సిన అవసరం అంతకన్నా లేదు.
undefined
సెక్స్ కి కూడా కొందరు చెక్ లిస్ట్ పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు చేయాలి..? ఏం చేయాలి..? ఎలా చేయాలి అని.. అలా లిస్ట్ పెట్టుకోవడం వల్ల పార్ట్ నర్ ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.
undefined