సెక్స్ సమయంలో ఆడవాళ్లు చేసే తప్పులు ఇవి..!

First Published | Feb 17, 2024, 2:53 PM IST

లైంగిక కార్యకలాపాలు భర్యాభర్తలిద్దరికీ మంచి మేలు చేస్తాయి. ఇవి ఇద్దరినీ ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. అలాగే మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి. అయితే పడకగదిలో ఆడవాళ్లు కొన్ని తప్పులను ఎక్కువగా చేస్తుంటారు. వీటివల్లే వారు దాన్ని ఆస్వాదించలేకపోతుంటారు. 
 

భార్యాభర్తల మధ్య  సెక్స్ లైఫ్ మెరుగ్గా ఉన్నప్పుడే మిగతా జీవితం సాఫీగా సాగుతుంది. సెక్స్ ఇద్దరి మధ్యన మంచి బాండింగ్ ఏర్పరుస్తుంది. నమ్మకాన్ని పెంచుతుంది. అయితే సెక్స్ సమయంలో ఆడవాళ్లు కొన్ని తప్పులను ఎక్కువగా చేస్తుంటారు. ఇది వారి మూడ్ ను మారుస్తుంది. అలాగే సెక్స్ ను కూడా ఆస్వాదించలేరు. ఇంతకీ పడకగదిలో ఆడవాళ్లు చేసే తప్పులేంటంటే? 
 

భావప్రాప్తి పొందడం

భావప్రాప్తిని పొందడం కొత్త విషయమేమీ కాదు. కానీ మగవారంతా తొందరగా ఆడవాళ్లు దీన్ని పొందలేరు. కానీ చాలా మంది ఆడవారు భావప్రాప్తి పొందకున్నా పొందినట్టు నడిస్టారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే తమ భాగస్వామిని సంతోషపెట్టడానికి. కానీ ఇది తప్పు. నిజానికి ఇది మహిళలు చేసే అత్యంత సాధారణ తప్పు. సెక్స్ ఆహ్లాదకరంగా ఉండాలి. అలాగే ఆనందంతో నిండి ఉండాలి. కానీ మీరు దానిని ఫేక్ చేస్తే మీరు అనుభూతి చెందరని నిపుణులు చెబుతున్నారు. 


శారీరక రూపం గురించి ఆందోళన

నేను ఎలా కనిపిస్తున్నాను? శరీరం నుంచి ఏదైనా వాసన వస్తుందా? అంటూ చాలా మంది ఆడవారు సెక్స్ సమయంలో ఆలోచిస్తారట. లుక్స్ గురించి ఆందోళన చెందడం సాధారణమే అయినప్పటికీ.. దీనివల్ల మీరు లైంగిక ఆనందాన్ని పొందలేరు. అందుకే ఇలాంటి విషయాలను ఆలోచించడానికి బదులుగా ఆ సమయాన్ని ఆస్వాదించండి. 
 

మీ భాగస్వామి చెప్పే ప్రతిదానితో కలిసి వెళ్లడం

శారీరక సాన్నిహిత్యం అనేది ఆనందం, ప్రయోగాలకు సంబంధించినది, కానీ ఇది ఇద్దరి అంగీకారంతో జరగాలి. మీకు ఇష్టం లేని పని చేస్తే ఏదో ఒక సమయంలో చిరాకు పడతారు. ఒకవేళ మీకు ఏదైనా చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోతే వద్దు అని చెప్పేయండి.  బలవంతంగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనకండి. 
 

మౌనంగా ఉండటం

మీకు నచ్చిందో? లేదో? మీ భాగస్వామికి ఖచ్చితంగా చెప్పండి. సెక్స్ ను ఆస్వాదిస్తున్నట్టైతే చిన్న మూలుగు మీ భాగస్వామికి కూడా మంచి అనుభూతిని కలిగిస్తుంది. అలాగే మీ ఇద్దరికీ మంచి లైంగిక ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే మీకు ఏది ఇష్టమో మీకు తెలియకపోతే మీ ఇద్దరికీ ఇది బోర్ కొట్టిస్తుంది. 
 

ల్యూబ్ ఉపయోగించకపోవడం

ల్యూబ్ అనేది సెక్స్ సమయంలో ఉపయోగించే జెల్ లేదా ద్రవం. ఇది సెక్స్ సమయంలో నొప్పి, అసౌకర్యం లేకుండా చేస్తుంది. ఘర్షణను నివారిస్తుంది. యోని పొడిబారే వారికి ల్యూబ్ ను ఖచ్చితంగా ఉపయోగించాలి. ల్యూబ్ మిమ్మల్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. కాబట్టి సెక్స్ ను మరింత ఆహ్లాదకరంగా మార్చుకోవాలనుకుంటే దీన్ని తప్పకుండా ప్రయత్నించండి. 

Latest Videos

click me!