కలలు.. కొన్ని ఎంత అద్భుతంగా ఉంటాయో.. మరికొన్ని అంత భయపెడతాయి. కలలు నిజమవుతాయా అనే దానికి రకరకాల వాదనలు ఉన్నాయి. చాలావరకు కలలు మన మానసికస్థితికి సంకేతాలుగా ఉంటాయి. భవిష్యత్తులో జరగబోయే వాటికి సూచనలుగా ఉంటాయి. ఇక ఇష్టపడ్డ మనిషి గురించి వచ్చే కలలు ఎంతో తీయగా ఉంటాయి.
కలలో ఊరించి, ఉక్కిరి బిక్కిరి చేసి.. చిలిపి జ్ఞాపకాలతో సంతోషపెడతాయి. అయితే ఇలాంటి కలలు అనుకున్నప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు రావు. ఇలాంటి కలలు అందంగా ఉంటాయి. మీరిష్టపడే వ్యక్తి గురించి పదే పదే మీకు కలలు వస్తున్నాయంటే దాంట్లో ఏదో విషయం ఉండి ఉంటుందని గుర్తించాలి.
అలాంటి కలల అర్థాలేమిటో ఒకసారి చూడండి..కలలో పాత క్రష్ కనబడితే..వదిలించుకున్న బంధం తిరిగి కలలో కనిపిస్తే నిజంగానే కాస్త కలవరపాటు పడతారు. అయితే దీనికి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. మీ గత జీవితాన్ని, మీ పాత అనుబంధానికి సంబంధించి ఇటీవల ఏదైనా సంఘటన జరిగి ఉంటుంది. అదే మీ కలలో ప్రతిఫలిస్తుంది. అది మీ గతాన్ని గుర్తు చేసి ఉంటుంది. అందుకే కల మీ పాత జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ మీ క్రష్ ను కలలో కనిపించేలా చేస్తుంది.

మీరిష్టపడే వ్యక్తి మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్లు..ఇది నిజంగా చాలా బాధపెట్టే కలా. రోజు మొత్తం ఈ కల మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే ఈ కల మీ పనికి సంబంధం కలిగి ఉంటుంది. మీ ఉద్యోగబాధ్యతల్లో మీరు ఏదో రిజెక్షన్ కు గురవుతారు. సో కంగారు పడకుండా దీనికి మీరు సిద్ధపడడం మంచిది
అభద్రతా భావంతో లోతుగా అలోచించే నెగటివ్ థింకింగ్ కూడా ఇలాంటి కలలకు కారణం కావచ్చు. దీన్నుండి బయటపడకపోతే ఈ కలలు రెగ్యులర్ గా వచ్చే అవకాశం ఉంది.
మీరు ఇష్టపడిన వ్యక్తి చనిపోతున్నట్టుగా..మీరు మీరిష్టపడిన వ్యక్తి నుండి ముందుకు వెళ్లిపోవాలని సూచించే కల.. నమ్మినా, నమ్మకపోయినా ఇదే నిజం. చనిపోయినట్లు కల రావడం అంటే ఏదో జీవితాన్ని మార్చే సంఘటనో, ఆ బంధానికి దీ ఎండ్ అనో సూచించడం అన్నమాట. మీరు కూడా ఇలాగే భావిస్తే.. మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మీకు సరైన వారు కారని అర్థం. సో దూరంగా వెళ్లడమే మంచిది.
తిరిగి మళ్లీ ప్రేమించినట్లు..మీరిష్టపడిన వ్యక్తులు మిమ్మల్ని మళ్లీ తిరిగి ప్రేమించినట్లు కల వస్తే అది మీలోని శృంగారాస్తుల్ని ప్రతిబింబిస్తుంది. మీ క్రష్ మీకు ప్రపోజ్ చేస్తారని, మిమ్మల్ని తిరిగి ఇష్టపడతారని కల కంటే.. అది మీ వ్యక్తిత్వ లక్షణాన్ని నమ్మకంగా సూచిస్తుంది. మీ ఇద్దరి మధ్య విషయాలు పని చేస్తాయని మీరు ఆశాజనకంగా ఉండవచ్చు. కాబట్టి, మీకు ఇలాంటి కల వస్తే మీ ప్రేమను చెప్పడానికి సిద్ధంగా ఉండండి.
సెలబ్రిటీతో ప్రేమ కల..బహుశా ఇలాంటి కలలు ప్రతిఒక్కరూ కంటారు. తామిష్టపడ్డ సెలబ్రిటీతో ప్రేమలో పడాలని కోరుకుంటారు! మీకు ఈ కల వస్తే, మీరు ఆయా వ్యక్తులను అనుకరిస్తున్నారని, వారి వ్యక్తిత్వలాగే ఉండాలని కోరుకుంటున్నారని అర్థం. వారు ఆయా అంశాల మీద స్పందించే తీరును కూడా మీరు ఫాలో అవుతుంటారని అర్థం.
అస్సలు ఇష్టంలేని వ్యక్తి గురించి కలలు...టెన్షన్ పడాల్సిందేం లేదు.. మీరు అస్సలు ఇష్టపడని లేదా ద్వేషించే వ్యక్తి గురించి కలలు రావడం సాధారణమే. దీనివల్ల వారిమీద మీకేవో ఫీలింగ్స్ ఉన్నాయని దీని అర్థం కాదు. కాకపోతే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు అతన్ని ఆరాధిస్తుండవచ్చు, అందువల్లే అదే మీ కలలో ప్రతిబింబిస్తుంది.