ఆడవాళ్లు సెక్స్ వద్దు అనడానికి కారణాలు ఇవే..

First Published | Dec 29, 2023, 2:48 PM IST

నిపుణుల ప్రకారం.. సెక్స్ పట్ల ఆసక్తిని కోల్పోవడం ఎన్నో ఆరోగ్య సమస్యలకు సంకేతం. అసలు ఆడవాళ్లు దేనికి సంభోగాన్ని వద్దనుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Hygiene in Sex

చాలా మంది ఆడవాళ్లు అకస్మాత్తుగా సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ ను కోల్పోతుంటారు. కానీ భార్యభర్తల మధ్య సెక్స్ లైఫ్ మెరుగ్గా ఉన్నప్పుడే మిగతా లైఫ్ బాగుంటుంది. శృంగారానికి సంబంధించి రిలేషన్ షిప్ లో ఒడిదుడుకులు ఉంటే అది మీ రిలేషన్ షిప్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒకవేళ మీకు సెక్స్ పట్ల ఆసక్తి లేకపోతే దానిని లైట్ తీసుకోకండి. ఎందుకంటే ఇది మీ వ్యక్తిగత సంబంధానికే కాదు మీ ఆరోగ్యానికి కూడా సంబంధించింది. ఎందుకంటే సెక్స్ పట్ల ఆసక్తిని కోల్పోవడం ఆరోగ్య సమస్యలకు సంకేతం. అసలు ఆడవాళ్లకు కలయిక పట్ల ఎందుకు ఆసక్తి తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Less Interest in Sex

మహిళల్లో లైంగిక ఆసక్తి తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు 

భావప్రాప్తిని చేరుకోవడంలో ఇబ్బంది
యోని పొడిబారడం
సంభోగం సమయంలో నొప్పి, అసౌకర్యంగా అనిపించడం
ఫోర్ ప్లే వంటి కార్యకలాపాలలో పాల్గొన్న తర్వాత కూడా సెక్స్ చేయాలనే కోరిక కలగకపోవడం

Latest Videos


Food helps for sex

1. శారీరక సమస్యలు

శస్త్రచికిత్స: రొమ్ము, జననేంద్రియాలకు సంబంధించిన ఏ రకమైన శస్త్రచికిత్స అయినా లైంగిక పనితీరును ప్రభావితం అవుతుంది. వీటివల్ల ఆడవారికి లైంగిక కోరికలు కలగవు. అలాగే వీటి నుంచికోలుకున్న తర్వాత కూడా వీరికి సెక్స్ పట్ల ఆసక్తి ఉండదు. 

మందులు: యాంటీ డిప్రెసెంట్స్,  థైరాయిడ్ మందులు వంటి కొన్ని రకాల మందులు లైంగిక కోరికలు తగ్గడానికి కారణమవుతాయి. వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మహిళలు లైంగిక కార్యకలాపాల పట్ల ఆసక్తి చూపలేకపోతారు. 
 

హృదయ సంబంధ వ్యాధులు: అధిక రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు కూడా లైంగిక పనితీరును ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యల వల్ల సన్నిహిత ప్రాంతానికి తగినంత రక్త ప్రవాహం అందదు. దీంతో వీరికి లైంగిక కోరికలు కలగవు. అలాగే ఇది యోని పొడిబారడానికి కూడా కారణమవుతుంది. దీనివల్ల ఆడవారికి సెక్స్ పట్ల ఆసక్తి ఉండదు. 

రక్తంలో చక్కెర స్థాయిలు: డయాబెటిస్ రక్త నాళాలను, నరాలను దెబ్బతీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఆడవారు భావప్రాప్తికి చేరుకోవడంలో ఇబ్బంది పడతారు. అలాగే దీనివల్ల యోని కూడా పొడిబారుతుంది. 

2. హార్మోన్ల మార్పులు

మెనోపాజ్: రుతువిరతి సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు వేగంగా పడిపోతాయి. దీనివల్ల ఆడవారు సెక్స్ పట్ల ఆసక్తిని కోల్పోతారు. అలాగే ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల యోని కణజాలం పొడిబారుతుంది. ఇలాంటి సమయంలో సెక్స్ చాలా బాధాకరంగా, అసౌకర్యంగా ఉంటుంది. మహిళలు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనకూడదనుకోవడానికి ఇది కూడా ఒక కారణం.

గర్భధారణ, తల్లి పాలివ్వడం: ప్రెగ్నెన్సీ, తల్లి పాలివ్వడం వల్ల ఆడవారి శరీరంలో ఎన్నో హార్మోన్ల మార్పులు వస్తాయి. దీని వల్ల ఆడవారు లైంగికంగా చురుకుగా ఉండలేరు. చాలా మంది మహిళలు ఈ  దీనిని నిర్వహిస్తారు. కానీ కొంతమంది మహిళలు సెక్స్ పట్ల ఆసక్తిని కోల్పోతారు. ఇది మీ సంబంధంపై ప్రభావం చూపుతుంటే హాస్పటల్ కు వెళ్లడం మంచిది.

3. మానసిక కారణాలు

మానసిక పరిస్థితులు లైంగిక కోరికను ప్రభావితం చేసినప్పటికీ.. మహిళల్లో లిబిడో లోపాన్ని కలిగించే అనేక మానసిక కారకాలు ఉన్నాయి. ఇది వారి సంబంధాలు, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. అవేంటంటే: 

ఆందోళన, నిరాశ వంటి మానసిక పరిస్థితులు
చిత్తవైకల్యం, జ్ఞాపకశక్తి కోల్పోవడం
అతిగా ఆలోచించే రుగ్మత

4. సంబంధాల సమస్యలు

లైంగిక సాన్నిహిత్యం లేకపోవడానికి రిలేషన్ షిప్ సమస్యలు తరచుగా అతిపెద్ద కారణాలలో ఒకటి. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం సరిగ్గా లేనప్పుడు మహిళలు లేదా పురుషులకు లైంగిక కోరికలు కలగవు. అలాగే భాగస్వామి దుర్వినియోగ ప్రవర్తన, భావోద్వేగపరంగా అందుబాటులో లేని భాగస్వామి, సంబంధంలో రోజువారీ గొడవలు లేదా లైంగిక అవసరాలు, ప్రాధాన్యతలు, నమ్మక సమస్యల గురించి భాగస్వామితో కమ్యూనికేషన్ గ్యాప్ కూడా లైంగిక కోరికలు తగ్గడానికి కారణమవుతాయి. ఇలాంటప్పుడు మీరు మీ భాగస్వామితో ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి.

click me!