ఓరల్ సెక్స్ మీద అపోహలు: స్పెర్మ్ మింగితే పిల్లలు పుడతారా..?

First Published | May 3, 2021, 2:50 PM IST

శృంగారంలో ఫోర్ ప్లే చేస్తున్న సమయంలో నా వీర్యం నా భార్య నోట్లోకి వెళ్లిపోయింది. కంగారులో తాను ఆ వీర్యాన్ని మింగేసింది. 

శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. దానిని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఎంత రోజూ ఆస్వాదిస్తున్నా కూడా.. ఈ విషయంలో కొందరికి సందేహాలు ఉంటాయి. కొత్తగా పెళ్లిన జంటలో మరిన్ని సందేహాలు ఉంటాయి. ఏది చేస్తే ఏం జరుగుతుంది..? ఎలా చేస్తే గర్భం వస్తుంది..? ఇలాంటి విషయాల్లో కంగారు పడుతుంటారు.
కాగా.. తాజాగా ఓ వ్యక్తి తనకు ఎదురైన ఓ వింత అనుభవాన్ని నిపుణులతో షేర్ చేసుకున్నాడు. తన సమస్యను వివరించి.. పరిష్కారం చెప్పాల్సిందిగా కోరాడు. ఇంతకీ అతని సమస్య ఏంటో చూద్దాం.

‘ నాకు ఆరు నెలల క్రితం పెళ్లైంది. నా వయసు 26, నా భార్య వయసు 22. మేమిద్దరం సెక్స్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. కాగా.. ఇటీవల ఓ రోజు శృంగారంలో ఫోర్ ప్లే చేస్తున్న సమయంలో నా వీర్యం నా భార్య నోట్లోకి వెళ్లిపోయింది. కంగారులో తాను ఆ వీర్యాన్ని మింగేసింది. దీని వల్ల తనకు ఏదైనా సమస్య వస్తుందా..? కడుపులోకి వెళ్లిన వీర్యం ద్వారా గర్భం దాల్చే అవకాశం ఉందా?’
దీనికి నిపుణులు ఏం సమాధానం చెప్పారో ఓసారి చూద్దాం.. ప్రతి ఒక్కరూ సెక్స్ గురించి అవగాహన పెంచుకోవాలి. వీర్యం మహిళ వర్జినా లో నుంచి లోపలికి వెళ్లి అండాశయానికి చేరినప్పుడు మాత్రమే.. గర్భం దాల్చగలుగుతారు. అంతేకాదు.. నోటి ద్వారా పొట్టలోకి వెళ్లిన వీర్యం.. గర్భం దాల్చడానికి కారణం కాదని చెప్పారు.
ఆహారం ఎలా అయితే.. కడుపులోకి వెళుతుందో.. ఈ వీర్యం కూడా అలానే వెళుతుంది. అంతేకానీ.. దాని వల్ల గర్భం రాదు. అంతేకాకుండా.. ఎలాంటి అనారోగ్యం కూడా దరిచేరదు అని నిపుణులు సూచించారు. చాలా మంది పురుషుల వీర్యంతో ఫేషియల్స్ కూడా చేయించుకుంటున్నారు. వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని కూడా నమ్మకం. కాబట్టి దీని వల్ల ఎలాంటి సమస్య ఉండదు.
మరో బాలుడు కూడా తన సమస్యను నిపుణులుకు వివరించాడు. ‘నా వయసు 17 సంవత్సరాలు. నాకు ఇప్పటి వరకు కనీసం మీసాలు కూడా మొలవలేదు. పైగా నా చెస్ట్ అచ్చం అమ్మాయిలకు మాదిరిగా ఉంటుంది. ఏదైనా సమస్య ఉందా..? నా స్నేహితులు నన్ను ఏడిపిస్తున్నారు. నేనేం చేయాలి.?’
ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ రకం సమస్యతో బాధపడుతున్నారు. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. హార్మోన్ల తేడా వల్ల కొందరిలో ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి.. ఈ సమస్యకు మందులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి.. సంబంధిత వైద్యులను కలిసి మందులు వాడితే సరిపోతుంది.
‘నా వయసు 26 సంవత్సరాలు. రెండు నెలల క్రితం వివాహమైంది. భార్య వయసు 23 సంవత్సరాలు. పెళ్లైన వారానికే నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్పటి నుంచి దూరంగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు మేము కరోనా నుంచి కోలుకున్నాం. టెస్టులో నెగిటివ్ అని తేలింది. ఇప్పుడు మేం శృంగారాన్ని ఎంజాయ్ చేయవచ్చా..? లేదంటే మరికొంత కాలం ఆగాలా..?’
కరోనా నుంచి కోలుకున్నారు కాబట్టి సెక్స్ లైఫ్ ని ఎంజాయ్ చేయవచ్చు.. కానీ.. కరోనా తాలుకూ నీరసం కనుక ఉంటే.. కొంత కాలం దూరంగా ఉండటమే మంచిది. ముందు సరైన ప్రోటీన్స్, న్యూటీషన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. వేడి నీరు తాగాలి. పూర్తిగా కోలుకున్న తర్వాత సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయడం బెటర్.

Latest Videos

click me!