సురక్షిత శృంగారానికి కండోమ్ చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు. కండోమ్ వాడటం వల్ల లైంగిక వ్యాధులు సంక్రమించకుండా ఉంటాయి. అంతేకాదు.. అవాంచిత గర్భం రాకుండా ఉండేందుకు కండోమ్ వాడకం తప్పనిసరి.
అయితే.. ఈ కండోమ్ వాడకంలో కొందరు అబ్బాయిలు చాలా తప్పులు చేస్తున్నారు. దానిలో చాలా మంది కామన్ గా చేస్తున్న ఓ తప్పు విస్మయానికి గురిచేస్తోంది.
అబ్బాయిలు వాడిన కండోమ్ ని కడిగి మళ్లీ అదే వాడుతున్నారట. తాజాగా ఓ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
దాదాపు 72శాతం అమెరికన్స్ తరచూ శృంగారంలో పాల్గొంటున్నారు. కాగా.. వారిలో ప్రతి నలుగురిలో ఒకరు వాడిన కండోమ్ నే మళ్లీ మళ్లీ వాడేస్తున్నారట.
నలుగురిలో ముగ్గురు వాడిన కండోమ్ ని మరోసారి వాడేందుకు జాగ్రత్తగా దాచుకుంటున్నారట. అంటే.. దీనిని బట్టి పురుషులు వాడిన కండోమ్ నే మళ్లీ మళ్లీ వాడేస్తున్నారని అర్థం.
కండోమ్ ప్యాకెట్ మీద ఉన్న Expiry date ను కచ్చితంగా చెక్ చేయాలి. దాని టైం అయిపోతే వాడకూడదు. కండోమ్ ను ఎల్లప్పుడూ చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి
కండోమ్స్ వేడి తగేలే ప్రాంతాల్లో ఉంచకూడదు. డ్యామేజ్ అయిన వాడటం వల్ల ఉపయోగం ఉండదు. ప్యాకెట్స్ లో పెడితే.. కండోమ్ త్వరగా పాడైపోతుంది.
కొంతమంది కండోమ్స్ ను బ్యాక్ ప్యాకెట్లలో.. పర్సులలోనూ పెడతారు. ఇలా ఉంచడం వల్ల అవి పాడైపోతాయి. వేడిగా ఉండే ప్రదేశాలలో కండోమ్స్ ను ఉంచకూడదు
కండోమ్ ను ఒక్కసారే వాడండి. అంతేగాక కొంతమంది ఒకేసారి రెండు మూడు కండోమ్స్ ను కూడా పురుషాంగానికి తొడుగుతారు. కానీ అలా చేయడం ప్రమాదకరమట. ఒకసారి ఒకే కండోమ్ ను తొడగాలట.