porn video
ఈ రోజుల్లో పోర్న్ చూసే అలవాటు చాలా మందికి ఉండే ఉంటుంది. అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం ఉండటంతో.... ఈ పోర్న్ స్ట్రీమింగ్ కూడా చాలా మందికి సులభమంగా చేరువౌతోంది. మన దేశంలో.. పోర్న్ బ్యాన్ చేసినప్పటికీ... ఇప్పటికీ... అది అందుబాటులోకి వస్తుండటం గమనార్హం. అయితే... ఈ పోర్న్ ని అధికంగా వీక్షించడం వల్ల లైంగిక ఆరోగ్యం దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పోర్న్ మీ సంబంధాలకు ఎలా హాని కలిగిస్తుంది?
తరచుగా అశ్లీల చిత్రాలను చూడటం వల్ల ఒక వ్యక్తి సంబంధాలు, లైంగిక సంతృప్తి , మానసిక ఆరోగ్యంపై కూడా హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని కొందరు సూచిస్తున్నారు. లైంగిక సంబంధాలు ఎలా ఉండాలనే దానిపై పోర్న్ తప్పుడు అంచనాలను సెట్ చేస్తుంది. ఇది తరచుగా నిరుత్సాహానికి, తక్కువ ఆత్మగౌరవానికి దారితీస్తుంది.
పోర్న్ చూడటం మీ లైంగిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
"భాగస్వామితో సెక్స్ సమయంలో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పురుషులలో అంగస్తంభన, ఆలస్యమైన స్ఖలనం, లైంగిక సంతృప్తి తగ్గడం, లిబిడో క్షీణించడం వంటి రేట్లు గణనీయంగా పెరిగాయి, ఒకప్పుడు ఈ ఇబ్బందులను వివరించిన సాంప్రదాయ కారకాలతో ఇప్పుడు తగినంత సహాయకులు కనిపించడం లేదు. స్త్రీలలో ఉద్రేకం తగ్గుముఖం పడుతోంది”
పోర్న్ చూడటం వల్ల కలిగే ఇతర నష్టాలు..
భాగస్వామి పట్ల లైంగిక ఆకర్షణ తగ్గడం, భాగస్వామితో సెక్స్ అంచనాలను అందుకోకపోవడం, లైంగిక అసమర్థత పెరుగుతుంది. కొన్ని అశ్లీల కంటెంట్‌లో చూపించినందంతా నిజమని భావించి.. రియాల్టీకి దూరమైపోతారు. తరచుగా హస్తప్రయోగం, భాగస్వామితో లైంగిక సంబంధంలో వాస్తవికత మిస్ అవుతుంది. హస్తప్రయోగం సమయంలో పోర్న్-సంబంధిత విషయాలను తలచుకోవడం లాంటివి చేస్తారు. వాటిలోనే మునిగిపోతారు. నిజ జీవితంలో ఇలా ఉండదు అనే విషయాన్ని అర్థం చేసకోలేరు.
తరచుగా హస్త ప్రయోగం చేయడం వల్ల కలిగే సమస్యలు..
బహుశా తరచుగా హస్తప్రయోగం.. భాగస్వామితో లైంగిక సంబంధానికి పూర్తిగా దూరమైపోతారు. ఆసక్తి తగ్గిపోతుంది. అప్పుడప్పుడు హస్త ప్రయోగం చేయడంలో తప్పులేదు కానీ.... ఎక్కువగా చేస్తే మాత్రం చాలా ఇబ్బందిపడతారు.