శృంగార సమస్యల పరిష్కారం దిశగా శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొత్తకొత్త విషయాలు కనిపెడుతున్నారు. సమస్యలకు కారణాలను ఆరా తీసి, తర్వాత ఔషధాలు రూపొందిస్తున్నారు. అయినప్పటికీ పురుషులను కొన్ని సమస్యలు వేధిస్తున్నాయి.
పురుషుల్లో అంగస్తంభన సమస్యలు ప్రస్తుత కాలంలో ఎక్కువయ్యాయనే చెప్పవచ్చు. అయితే.. ఈ అంగ స్తంభనను అంత తేలికగా తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు. ఇది మున్ముందు రానున్న గుండె నొప్పికి తొలి సంకేతంగా భావించాలంటున్నారు.
మగవారిని వేధించే అంగ స్తంభన సమస్యలపై తాజాగా శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. ఈ పరిశోధనలో పలు విషయాలు వెలుగుచూశాయి.
మెయిన్ రోడ్లపై నివసించే పురుషుల్లో అంగస్తంభన సమస్యలు ఉన్నట్లు తాజాగా గుర్తించారు. శిలాజ ఇంధన కాలుష్యానికి.. పురుషాంగం స్తంభించడానికి మధ్య సంబంధంపై వారు అధ్యయనం చేశారు.
ప్రయోగంలో భాగంగా ఎలుకలపై ఐదునెలలపాటు కాలుష్యవాయువులు పంపారు. తర్వాత వాటి సెక్స్ సామర్థ్యాన్ని పరీక్షించగా అంగం తగినంతగా గట్టిపడకపోవడాన్ని గుర్తించారు.
వాయు, ఇతర కాలుష్యాల ప్రభావం వల్ల అంగంలోకి రక్తప్రసరణ సరిగ్గా జరక్కపోవడం వల్ల స్తంభన సమస్య తలెత్తినట్లు తేలింది. ప్రధాన రహదారుల్లో వాహనాలు వెదజల్లే కర్బన ఉద్గారాలు, ఇతర కాలుష్య కారకాల వల్ల ఈ సమస్య అక్కడున్న మగవారిలోనూ ప్రభావం చూపుతుండొచ్చని, అయితే దీనిపై మరిన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
కాలుష్యం వల్ల మగవారు సెక్స్‌లో త్వరగా అలసిపోతారని, ఊపరితిత్తులకు తగినంత గాలి అందకపోవడం దీనికి కారణమన్ని పేర్కొన్నారు. చైనాలో గాంగ్‌జౌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలు నిర్వహించారు. ఫలితాలను సెక్సువల్ మెడిసిన్ పత్రికలో ప్రచురించారు.
దాని తర్వాత మరో విషయం కూడా అంగస్తంభనకు కారణమౌతోంది. అదే స్మోకింగ్ అంటున్నారు పరిశోధకులు. స్మోకింగ్ మనిషిని చంపేస్తుంది. ఈ విషయం తెలిసినా కూడా ఆ అలవాటు ఉన్నవారు దానిని వదలుకోలేరు.
చాలా మంది భార్యలకు తమ భర్తలు స్మోక్ చేయడం నచ్చదు. ముఖ్యంగా పడక గదిలోకి వచ్చే సమయంలో... స్మోక్ చేసి ఉండటాన్ని స్త్రీలు అంగీకరించరు. ఆ వాసన దాదాపు ఎవరికీ నచ్చదు. ఈ ఇష్టాయిష్టాలు పక్కన పెడితే... ఈ స్మోకింగ్ అలవాటు భవిష్యత్తులో మీ సెక్స్ సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గించేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం... సెక్స్, సిగరెట్.. తూర్పు పడమర లాంటివి అంటున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక్కటి మాత్రమే దొరకుతుందనేది వారి అభిప్రాయం. ఈ రెండింటిని ఒకేసారి పొందడం కష్టమనేది వారి వాదన. ఎందుకంటే.. సిగరెట్ లైంగిక వ్యవస్థ పై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
సిగరెట్ లో ఉండే నికోటిన్ రక్త ప్రవాహ వ్యవస్థను దెబ్బతీస్తుంది. అంగ స్తంభన జరగాలంటే రక్తం అంగంవైపు ప్రవహించాలి. సిగరెట్ ఆ వేగానికి అడ్డుకట్ట వేస్తుంది. ఒక్కసారి అంగస్తంభన సమస్య మొదలైందంటే... గుండె సంబంధిత వ్యాధులు వస్తాయనడానికి సూచన.
పొగతాగడం వల్ల... పరోక్షంగా భార్య కూడా తాగినట్టే. ధూమపాన పర్యవసానాల్ని ఆమె కూడా అనుభవించాల్సిందే. దీంతో తన లైంగిక ఆరోగ్యమూ ప్రమాదంలో పడుతుంది. రక్తప్రవాహ వేగం మందగించడంతో భావప్రాప్తి సమస్యలు వస్తాయి. యోనిలో లూబ్రికేషన్ తగ్గిపోతోంది. సెక్స్ బాధాకరం అవుతుంది. ఆ దుర్వాసన సెక్స్ పట్ల విరక్తి కలిగినా ఆశ్చర్యపడనక్కర్లేదు.
గుండె నుంచి రక్త ప్రసరణ జరిగా జరగకపోతేనే అంగ స్తంభన సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇవాల్టి రోజున అంగ స్తంభన లోపాన్ని.. మున్ముందు రాబోయే గుండె, రక్తనాళాల వ్యాధులకు ఒక ముందస్తు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మన దేశంలో అధిక సంఖ్యలో గుండె జబ్బు బాధితులున్నారు. దీన్ని బట్టి స్తంభన లోపం ఎంత ఎక్కువగా ఉందో మనం గ్రహించవచ్చు.
చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య మన దేశంలోనే ఎక్కువ. ఇది ఒక్క రోజులోనో అప్పటికప్పుడో పుట్టుకొచ్చేది కాదు. దీనికి చాలాకాలం ముందు నుంచే గుండె జబ్బు మొదలై ఉంటుంది. వారిలో అంగస్తంభన లోపం కూడా అంతకు ముందే ఆరంభమై ఉండొచ్చు. కాబట్టి- కనీసం దాన్ని గుర్తించి పరీక్షలు చేయించుకున్నా.. గుండె జబ్బుల ముప్పు నుంచి ముందుగానే బయటపడటానికి వీలుండేదని చెప్పుకోవచ్చు.
అంగం సూక్ష్మమైన రక్తనాళాలతో నిండిన సున్నితమైన అవయవం. దీని మధ్యలో రెండు గొట్టాల వంటి సున్నిత స్పాంజి వంటి కండర నిర్మాణాలు (కార్పోరా కావర్నోజా) ఉంటాయి. ఇవి ఎప్పుడూ సంకోచించి ఉంటాయి. శృంగార భావనలు కలిగినప్పుడు.. అంగంలోని ఈ సున్నితమైన కండరాలు విశ్రాంతిగా.. వదులుగా తయారవుతాయి. దీంతో వీటిలోకి రక్త ప్రవాహం పెరిగిపోయి అంగం స్తంభిస్తుంది.
శృంగార భావనలను ముందుగా మెదడు ప్రేరేపిస్తుంది. అవి అక్కడి నుంచి వెన్నుపాములోని నాడుల ద్వారా అంగానికి చేరుకుంటాయి. వెంటనే అక్కడి సున్నిత కండరాలు విశ్రాంతి భావనలోకి రావటం.. రక్తం లోపలికి వచ్చి చేరిపోవటం జరుగుతుంది. ఇక ఆ రక్తం తిరిగి బయటకు వెళ్లిపోకుండా సిరలకు ఉండే కవాటాలు మూసుకుంటాయి.
దీంతో రక్తం లోపలే ఉండి... స్తంభన నిలబడుతుంది. ఒకసారి శృంగార వాంఛ పూర్తయినా, స్ఖలనమైనా.. ఆ ప్రేరేపణలు తగ్గి.. ఆ కవాటాలు తెరుచుకుని.. రక్తం వెనక్కి వెళ్లిపోతుంది. స్తంభన తగ్గి.. అంగం సాధారణ స్థితికి వస్తుంది. అందుకే అంగస్తంభనలో నాడులు, రక్తనాళాలదే కీలక పాత్ర.కాబట్టి స్తంభన సమస్యలు మొదలైతే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.