ఆ పొజిషన్ లో సెక్స్ గర్భం రాదా..? కండోమ్ కి బదులు ఆ ప్లాస్టిక్ కవర్..?

First Published | May 10, 2021, 3:18 PM IST

సెక్స్ కి దూరమైతే పురుషుల వృషణాలు దెబ్బతింటాయి అనే భ్రమ కూడా చాలా మందిలో ఉంటుంది. దీనిలో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు.

శృంగారం గురించి పూర్తిగా తెలిసినవారు ఎవరూ ఉండరేమో. అందుకే.. ఈ ప్రపంచంలో ఏ విషయంలోనూ లేని సందేహాలు దీని గురించే వస్తుంటాయి. సెక్స్ విషయంలో చాలా మందికి అపోహలు ఉంటాయి. కొన్ని అవాస్తవాలను కూడా నిజమని కొందరు నమ్మేస్తుంటారు. కామన్ గా అందరూ నిజమని నమ్మే కొన్ని అవాస్తవాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
undefined
1. పీరియడ్స్ లో సెక్స్ చేస్తే గర్భం రాదు.. ఇది చాలా మంది నమ్ముతుంటారు. కానీ ఇది నిజం కాదట. పీరియడ్స్ సమయంలోనూ సెక్స్ చేస్తే గర్భం వచ్చే అవకాశం ఉంటుందట. ఎందుకంటే.. యోనిలోకి వెళ్లిన వీర్యం దాదాపు ఏడు రోజుల పాటు అక్కడే ఉంటుందట. దీంతో.. పీరియడ్స్ తర్వాత కొత్తగా అండం విడుదలయ్యే సమయంలో.. ఈ వీర్యం వెళ్లి కలిస్తే.. గర్భం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గర్భం రాకూడదంటే.. ఆ సమయంలోనూ జాగ్రత్తలు తీసుకోకతప్పదు.
undefined

Latest Videos


2.ఓరల్ సెక్స్ తో కూడా గర్భం వస్తుంది.. ఇది కూడా అబద్ధమేనట. ఓరల్ సెక్స్ తో గర్భం రానేరాదట. వీర్యం మింగినా కూడా గర్భం రాదట.
undefined
3.ఓరల్ సెక్స్ ద్వారా లైంగిక సంబంధింత వ్యాధులు రావు.. ఇలా అనుకోవడం కూడా పొరపాటే. ఎందుకంటే.. జాగ్రత్తలు తీసుకోకుండా చేసే ఓరల్ సెక్స్ ద్వారా కూడా లైంగిక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.
undefined
4.సెక్స్ సమయంలో.. వీర్యం లోపల వదలకుండా.. బయటకు తీస్తే గర్భం రాదు.. ఇది నిజమే కావచ్చు కానీ.. ఇలా కూడా కొందరికి గర్భం వస్తుందట. వీర్యం లోపల వదలకపోయినా.. వారి పురుషాంగం నుంచి కొన్ని స్రావాలు తెలియకుండానే లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా గర్భం వచ్చే అవకాశం ఉందట.
undefined
5.తొలిసారి కలయికలో పాల్గొంటే గర్భం రాదు.. అని చాలా మంది భావిస్తుంటారు. అయితే.. ఇందులో నిజం లేదట. అండం విడుదలై ఉంటే.. తొలిసారి అయినా గర్భం దాల్చే అవకాశం ఉంటుంది.
undefined
6. కొన్ని రకాల సెక్స్ పొజిషన్స్ వల్ల గర్భం రాదు.. ఇది కూడా చాలా అబద్ధం. వీర్యం లోపలికి వెళ్లి అండాన్ని కలిస్తే.. అది ఏ సెక్స్ పొజిషన్ అయినా గర్భం రాకుండా ఆగదు.
undefined
7.సెక్స్ కి దూరమైతే పురుషుల వృషణాలు దెబ్బతింటాయి అనే భ్రమ కూడా చాలా మందిలో ఉంటుంది. దీనిలో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు.
undefined
8.కండోమ్ ఉతికి మళ్లీ వాడుకోవచ్చు.. చాలా మంది అబ్బాయిలు ఇలా చేస్తున్నారట. అలా చేయకూడదని.. లేనిపోని రోగాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
9.కండోమ్ కి బదులు ప్లాస్టిక్ బ్యాగ్స్..? ఇలాంటి పొరపాట్లు చేసేవాళ్లు కూడా ఉన్నారు. అలా చేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం కండోమ్ మాత్రమే ప్రెగ్నెన్సీ రాకుండా.. లైంగిక వ్యాధులు రాకుండా రక్షిస్తుందని తెలుసుకోవాలి.
undefined
10.ఓ మహిళకు లైంగిక సంబంధిత వ్యాధులు.. మరో మహిళ నుంచి సంక్రమిస్తాయా..? ఇందులో ఎలాంటి నిజం లేదు.
undefined
click me!