శృంగారం పట్ల ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. తాను వలచిన వ్యక్తితో గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఆనందంగా ఆస్వాదిస్తేనే అది రొమాన్స్ అవుతుంది.
అలా కాకుండా.. అవతల వ్యక్తికి ఇష్టం లేకుండా బలవంతంగా ఒక్కరు మాత్రమే కామ క్రీడ తీర్చుకుంటే.. అది రేప్ అవుతుంది.
అయితే.. ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఏమిటంటే.. మహిళలకు ఇష్టం లేకుండా ఎవరైనా వ్యక్తి బలవంతం చేస్తే.. దానిని మనం అత్యాచారం అంటాం.
మరి అదే పని.. ఓ మహిళ చేస్తే..? దానినేమంటారు. దానిని కూడా రేప్ అనే అంటారా? ఇప్పటి వరకు అలాంటి కేసులు ఏమైనా నమోదయ్యాయా? అసలు అది నేరం కిందకు వస్తుందా?
మరి అదే పని.. ఓ మహిళ చేస్తే..? దానినేమంటారు. దానిని కూడా రేప్ అనే అంటారా? ఇప్పటి వరకు అలాంటి కేసులు ఏమైనా నమోదయ్యాయా? అసలు అది నేరం కిందకు వస్తుందా?
అది అత్యాచారం కిందకు రాదని ఇంగ్లండ్, వేల్స్‌లోని చట్టాలు చెబుతున్నాయి. అయితే, చాలా మంది మహిళల కారణంగా.. పురుషులు కూడా బలత్కారానికి గురయ్యారని ఇటీవల ఓ సర్వేలో తేలడం గమనార్హం.
తమ ఇష్టానికి వ్యతిరేకంగా.. తమపై బలత్కారానికి పాల్పడ్డారని కొందరు పురుషులు సర్వేలో పేర్కొనడం గమనార్హం.
దీనిపై ఓ రచయిత్రి ఆందోళనలు కూడా చేస్తుండటం గమనార్హం. ఇలాంటి పని ఎవరు చేసిన శిక్ష కిందకే రావాలని ఇలాంటి ఘటనలపై అధ్యయనం చేసిన ఒక రచయిత్రి వాదిస్తున్నారు.
లాంకాస్టర్ యూనివర్సిటీ లా స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ సియోభన్ వేర్ 2016-17లో యూకేలో జరిగిన అత్యాచార కేసులను అధ్యయనం చేశారు. ఆన్‌లైన్ సర్వేలో 200 మంది పురుషుల నుంచి వివరాలు సేకరించారు.
మే 2018 నుంచి జూలై 2019 మధ్య 30 మంది పురుషులతో చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా ఆమె చేసిన ఒక అధ్యయనం ఇటీవల ప్రచురితమైంది..
ఆఫీసుకు వెళ్లి వచ్చిన భర్త.. ఇంటికి వచ్చీ రాగానే.. సెక్స్ కావాలంటూ వేధిస్తుంటే సదరు మహిళకు ఎలా ఉంటుందో.. అలాంటి ఘటనలు మేము కూడా ఎదుర్కొన్నామంటూ కొందరు పురుషులు చెప్పడం గమనార్హం.
తమ భార్యలు చాలా సార్లు తమపై ఘాతుకానికి పాల్పడ్డారని.. అంగీకరించకపోతే.. కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఓ భర్త చెప్పడం శోచనీయం. మరి దీనిపై కూడా ప్రభుత్వాలు ఆలోచించి చట్టాలు తీసుకువస్తారేమో..
మరో విచిత్రం ఏమింటే.. మేము ఇలాంటి బాధలు అనుభవించామంటే.. ఎవరూ నమ్మరని సదరు బాధిత భర్త చెప్పడం విశేషం. ఎందుకంటే.., తాము పురుషులం కాబట్టి.. తమపై అత్యాచారం జరిగిందంటే ఎవరూ నమ్మరని అతను పేర్కొన్నాడు.
నా భార్య ఏకంగా నా చేతులు కట్టేసి మరీ.. బలవంతంగా రాత్రంతా తనతో సెక్స్ చేసేదని..ఆమె గర్బందాల్చిన కొదంత కాలం మాత్రమే తాను ప్రశాంతంగా ఉన్నానని.. తర్వాత మళ్లీ కష్టాలు మొలయ్యాయని అతను చెప్పడం విశేషం.