దేహ భాష.. మీ అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది..

First Published | Mar 1, 2021, 4:10 PM IST

భాగస్వాముల మధ్య ఉన్న అనుబంధాన్ని బట్టే ఆ బంధం గాఢత పెరుగుతూ ఉంటుంది. దీనికి పడకగదిలో ఉండే సాన్నిహిత్యం ఒక్కటే సరిపోదు. శారీరకంగా, మానసికంగా దగ్గరితనమే ఆ బంధాన్ని.. అనుబంధంగా మార్చి.. జీవితకాలపు ఆత్మీయబంధంగా రూపుదిద్దుకునేలా చేస్తుంది. అప్పుడై వైవాహిక జీవితం మూడు పువ్వులు, ఆరుకాయలుగా ఉంటుంది. 

అయితే ఇది భార్యభర్తల అంతర్గతవ్యవహారం కాబట్టి మూడో వ్యక్తికి తెలియదు. కాకపోతే నలుగురిలో ఉన్నప్పుడు భార్యభర్తల బాడీ లాంగ్వేజ్ వారిద్దరి మధ్య ఎంత అన్యోన్యత ఉందో తెలుపుతుంది.

అదే నలుగురిలో మీరు ఆదర్శజంటగా, మీ కాపురం అద్భుతమైనదిగా పట్టి చూపించగలుగుతుంది. అయితే ఇది నటించడం వల్లో, కావాలని చేయడం వల్లో రాదు. మీ ఇద్దరి మధ్య ఉండే అన్యోన్యత సందర్బాన్ని బట్టి మీ బాడీ లాంగ్వేజ్ లో బయటపడుతుంది. అలాంటి సింప్టమ్స్ కొన్ని...
మీరు మీ భాగస్వామితో మాట్లాడేటప్పు మీ కంటి భాష మీ ఇద్దరి మధ్య అన్యోన్యతను తెలుపుకుతుంది. కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడే మీ ఇద్దరినీ చూస్తే.. మీ మనసులో ఒకరి మీద ఒకరి పట్ల గూడుకట్టుకున్న అనురాగం మూడో వ్యక్తికి ఇట్టే అర్థమై పోతుంది.
ఇంకొంతమంది ఒకవైపు మాట్లాడుతుంటే, మరోవైపు చూస్తుంటారు. కళ్లలోకి సూటిగా కళ్లు పెట్టి చూడలేరు. సరేలే అన్నట్టుగా వ్యవహరిస్తారు. లేదా సంభాషణ మొదట్లో కళ్లలోకి చూసి మొదలుపెట్టినా.. వెంటనే చూపు వేరే దాని మీదికి మారిపోతుంది.
చిన్న చిన్న టచ్ లు మీ మధ్య అన్యోన్యతను ఎంతగానో పట్టిస్తుంది. చేతులమీద, వీపుమీద, మొహం మీద మాటల సందర్భంలో తాకడం.. వీపుమీద తడుతూ... సరదాగా మాట్లాడడం.. మీ ఇద్దరి మధ్య ఆత్మీయతను పెంచుతుంది. ఇద్దరి మధ్యనున్న ఆప్యాయత, ఆరాధన, అభిరుచులను పెంచుతుంది.
ఆర్నెళ్లు సావాసం చేస్తే వారు వీరవుతారన్నట్టుగా.. రోజులు గడిచేకొద్ది జంటల్లో ఒకరి అలవాట్లు మరొకరు అనుకరిస్తారు. ఒకరికి మరొకరు ప్రతిబింబంగా మారిపోతారు. అంటే కావాలని చేయడం కాదు.. అటోమెటిక్ గా మీ మనులోని ప్రేమ మిమ్మల్నలా మార్చేస్తుంది.
అందుకే నలుగురిలో ఉన్నప్పుడు ఒకరు చేసినట్లు మరొకరు చేస్తుంటారు. ఒకరి దారిలో మరొకరు నడుస్తుంటారు. ఆ పని చేసింది అతనా, ఆమెనా అర్థం కాదు. అదే మీ అన్యోన్యతను నలుగురికీ పట్టించేస్తుంది.
అందుకే నలుగురిలో ఉన్నప్పుడు ఒకరు చేసినట్లు మరొకరు చేస్తుంటారు. ఒకరి దారిలో మరొకరు నడుస్తుంటారు. ఆ పని చేసింది అతనా, ఆమెనా అర్థం కాదు. అదే మీ అన్యోన్యతను నలుగురికీ పట్టించేస్తుంది.
మీ భాగస్వామి మాట్లాడేది శ్రద్ధగా వింటారు. ఇంకా చెప్పాలంటే తను మాట్లాడుతుంటే వినడానికి ఉత్సాహం చూపిస్తూ తనమీద ఒరిగిపోయి మరీ తన్మయత్వంగా వింటుంటారు. తను భావోద్వేగంగామాట్లాడడాన్ని మీరు మరింతంగా ఆస్వాదిస్తారు.
మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ అరచేతులు తెరిచి ఉంచండి. వీలైతే మీ చేతితో తన చేతిని పట్టుకోండి. ఇది మీ మధ్య ఉన్న అనుబంధాన్ని మీ మనసు తెరిచే ఉందన్న విషయాన్ని తెలుపుతుంది. మీ భాగస్వామితో మీరెంత కంఫర్టబుల్ గా ఉన్నారో సూచిస్తుంది.

Latest Videos

click me!