అబ్బాయిలూ ఇలా చేస్తున్నారా..? అయితే పిల్లలు పుట్టడం కష్టమే..

First Published | Dec 27, 2019, 11:52 AM IST

కారణం ఏదైతేనేమి పిల్లలు పుట్టని దంపతులు, నేడు సంతానోత్పత్తి కేంద్రాల వద్దకు క్యూ కడుతున్నారు. డాక్టర్లు చెప్పిన సూచనలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అప్పటికీ కుదరకపోతే సరోగసీని ఆశ్రయించడమో లేక దత్తత తీసుకోవడమో చేస్తున్నారు.

ఒకప్పుడు... ఏ ఇంట్లో చూసినా గంపల కొద్దీ పిల్లలు కనిపించేవారు. దంపతలకు తక్కువలో తక్కువ ఐదారుగురు సంతానం ఉండేవారు. కానీ ఇప్పుడు... ఒకరిని కనడానికే నానా కష్టాలు పడాల్సి వస్తోంది.
మన తాతముత్తాతలల్లో సంతానోత్పత్తి శాతం 90శాతం ఉండేది. కానీ... ప్రస్తుత మన కాలానికి వచ్చే సరికి ఆ శాతం ఘోరంగా పడిపోయింది. స్త్రీ పురుషుల్లో సంతానోత్పత్తి శాతం 45 నుంచి 50 శాతానికి పడిపోయింది. నాటికీ నేటికీ మారిపోయిన ఆహారపు అలవాట్లు, ఉద్యోగ జీవితం, టెక్నాలజీ, వాతావరణ పరిస్థితులు అన్నీ భార్యాభర్తల ఆశలను ఆవిరి చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.

కారణం ఏదైతేనేమి పిల్లలు పుట్టని దంపతులు, నేడు సంతానోత్పత్తి కేంద్రాల వద్దకు క్యూ కడుతున్నారు. డాక్టర్లు చెప్పిన సూచనలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అప్పటికీ కుదరకపోతే సరోగసీని ఆశ్రయించడమో లేక దత్తత తీసుకోవడమో చేస్తున్నారు. భార్యాభర్తలకు అసలు సంతానం ఎందుకు కలగదు? శృంగార జీవితం బాగానే ఉన్నా, అనారోగ్య సమస్యలు అసలే లేకున్నా స్త్రీలు గర్భం ఎందుకు దాల్చరు? వంటి ప్రశ్నలు ఎన్నో ప్రతి ఒక్కరి మనసులోనూ మెదులుతాయి.
అయితే తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్లు.. మన అలవాట్లే... సంసార జీవితాన్ని పూర్తిగా నాశనం చేసి.. సంతాన సమస్యలకు ఆజ్యం పోస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
టీవీలు చూడటం.. మనకు నచ్చిన ఆహారం తినడం కూడా ఇందుకు కారణమని ఎవరూ ఊహించలేరు. అంతేకాదు..భార్యాభర్తల మధ్య జరిగే రతిక్రీడ కూడా గర్భం దాల్చకుండా చేస్తాయంటే ఆశ్చర్యపోక తప్పదు. అసలు.. వేటికి దూరంగా ఉంటే.. ఈ సమస్యను అధిగమించవచ్చో నిపుణులు చెబుతున్నారు. అవి ఇప్పుడు చూద్దాం...
వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది... ఫిట్ గా ఉండొచ్చు అని అందరూ చెబుతుంటారు. అది నిజమే... కానీ... అదే వ్యాయామం పిల్లలు కలగకుండా ఉండేందుకు కారణమౌతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది స్త్రీలు నాజుకుగా కనిపించాలనే తపతో సాధారణ బరువు ఉన్న కూడా జిమ్ లు, ఫిట్ నెస్ సెంటర్ ల చుట్టూ తిరుగుతున్నారు.
సాధారణ బరువు ఉన్న ఓ స్త్రీ.. వారానికి అయిదు గంటలకు మించి వ్యాయామం చేస్తే సంతానం కలగడం ఆలస్యమవుతుందట. శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నా సరే, పిల్లలు ఆలస్యంగా పుట్టే అవకాశం ఉందట. అదే పురుషుల విషయానికి వస్తే మాత్రం వ్యాయామం చేసే సమయం ఎక్కువగా ఉంటేనే మంచిదట. వారానికి కనీసం 15 గంటల పాటు జిమ్‌లో కష్టపడే వారిలో వీర్యకణాల వృద్ధి 73 శాతం ఎక్కువగా ఉంటుందట.
ఇక టీవీలు చూడని వారు ఎవరుంటారు. టీవీలు కాకపోతే ఫోన్లు చూస్తూనే ఉంటారు. అయితే... ఎక్కువ సమయం ఒకే చోట కూర్చొని టీవీలు చూసేవారిలో ఈ సమస్య తలెత్తుతోందట. వారానికి 20 గంటలకు మించి టీవీల ముందు కూర్చునే పురుషుల్లో వీర్యకణాల వృద్ధి తగ్గిపోతుందట.
ఏదో ఒక పని కల్పించుకుని ఇంట్లో భార్యకు సాయం చేయడమో, లేక సరదాగా బయటకు వెళ్లడమో చేస్తే టీవీ చూడాలన్న కోరికను కట్టిపెట్టొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
మాంసహారం ఎక్కువగా తినే పురుషుల్లోనూ సంతానసమస్య తలెత్తుతోందని ఓ సర్వేలో తేలింది. రోస్టెడ్ చికెన్, ఎగ్స్ తినేవారిలో ఎలాంటి సమస్య ఉండటం లేదట. ఇవి కాకుండా ఇతర మాంసాహారాలు తినేవారిలోనే వీర్యకణాల సంఖ్య తగ్గిపోతోందని హెచ్చరిస్తున్నారు. వాటికి బదులు కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
సంతానోత్పత్తికి శృంగారం ఎంత ముఖ్యమో వేరుగా చెప్పనక్కర్లేదు. కానీ ఉద్యోగం, డబ్బు, ఫ్రెండ్స్‌, పార్టీలు అంటూ బిజీ అయిపోయి శృంగారజీవితాన్ని మర్చిపోతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. వారానికి రెండు వారాలకోసారి తూతూమంత్రంగా శృంగారంలో పాల్గొంటూ మమ అనిపిస్తున్నారు. అలాంటివారే ఎక్కువగా సంతాన సాఫల్య కేంద్రాల ముందు నిలబడుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారానికి కనీసం మూడు సార్లు శృంగారంలో పాల్గొంటున్నారంటే, వారి వైవాహిక జీవితం బాగానే ఉన్నట్లు లెక్క. ఈ లెక్క మించినా ఫరవాలేదు. కానీ స్త్రీల అండోత్పత్తికి అనుగుణంగా శృంగారాన్ని సరిచూసుకుంటే మంచిది.
కొందరు రోజుకు రెండుమూడు సార్లు శృంగారంలో పాల్గొంటుంటారు. దీనివల్ల మానసిక సంతృప్తి తప్పితే సంతానసాఫల్యానికి అంతగా ఉపయోగపడదని నిపుణులు చెబుతున్నారు.
ఒకే రోజు ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల గర్భం రాకపోగా.... వీర్య కణాలు నశించిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. సంతానం కావాలని అనుకునేవాళ్లు... స్త్రీ అండోత్పత్తిని బట్టి కలయికలో పాల్గొంటే.. సరైన ఫలితాలు ఉంటాయి. అలా అని... ఎక్కువ గ్యాప్ తీసుకోవడం కూడా మంచిది కాదని చెబుతున్నారు.
ఇక ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్లు వాడే వాళ్లు.. పొగరాయుళ్లకు కూడా సంతాన సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మద్యం కన్నా కూడా... పొగ తాగేవారిపై సంతానోత్పత్తిపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ అలవాట్లు మార్చుకోకుంటే.. కృత్రిమ గర్భధారణ కోసం పరుగులు పెట్టక తప్పదని చెబుతున్నారు.

Latest Videos

click me!