హస్త ప్రయోగం మంచిదా? చెడ్డదా?

First Published | Dec 28, 2023, 3:37 PM IST

హస్త ప్రయోగం పురుషులకే కాదు ఆడవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అవును హస్త ప్రయోగం చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?

సెక్స్ గురించి అవగాహన అవసరం. కానీ చాలా మంది ఇది బహిరంగంగా మాట్లాడాల్సిన విషయం కాదని భావిస్తారు. ఆఖరికి భాగస్వాములు కూడా దీని గురించి మాట్లాడుకునేవారు కాదు. కానీ రానురాను ఈ విషయం గురించి జనాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. కానీ హస్త ప్రయోగం గురించి మాట్లాడటం మాత్రం అసౌకర్యంగా భావిస్తారు. బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ వంటి చాలా సినిమాలు హస్త ప్రయోగం గురించి చెప్పాయి. అసలు ఈ హస్త ప్రయోగం ఆరోగ్యానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది

హస్త ప్రయోగం ద్వారా మీరు పొందే ఆనందం మీ మానసిక స్థితిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. హస్త ప్రయోగం వల్ల డోపామైన్, ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. డోపామైన్ మీ మానసిక స్థితిని మెరుగ్గా ఉంచుతుంది. అందుకే మీలో డోపామైన్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే ఈ ట్రిక్కును ఉపయోగించొచ్చు. 
 


ఇది కూడా ధ్యానమే

అవును హస్త ప్రయోగం కూడా ధాన్యం వంటిదేనని నిపుణులు అంటున్నారు. ఎలా అంటే ధ్యానం ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే హస్త ప్రయోగం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మీ దృష్టి పూర్తిగా కేంద్రీకృతమై ఉంటుంది. ఇది మీ మనస్సును శాంతపరుస్తుంది.
 

యోని పొడి నుంచి ఉపశమనం

రెగ్యులర్ గా సెక్స్ చేయడం వల్ల యోని పొడిబారడం తగ్గుతుందని, దురద, బర్నింగ్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని మీరు వినే ఉంటారు. హస్తప్రయోగంలో కూడా ఇలాంటిదే జరుగుతుంది. హస్త ప్రయోగం చేసేటప్పుడు మీ యోని నుంచి వచ్చే ద్రవం మీ యోని పొడిబారకుండా ఉంచుతుంది. 

సంక్రమణ భయం ఉండదు 

హస్త ప్రయోగం యోని డిటాక్స్ వంటిదని మీకు తెలుసా? యోని ద్రవంతో పాటుగా అంటువ్యాధులు కూడా యోని నుంచి బయటకు వస్తాయి. అంతేకాదు మీరు భావప్రాప్తిని భాగస్వామి లేకున్నా పొందొచ్చు. అలాగే లైంగిక సంక్రమణ వ్యాధులు లేదా గర్భం దాల్చే ప్రమాదం  కూడా ఉండదు. 

నిద్రలేమికి చికిత్స

క్లీవ్ల్యాండ్ క్లినిక్ రీసెర్చ్ పరిశోధన ప్రకారం.. సెక్స్, హస్త ప్రయోగం మంచి నిద్రకు సహాయపడతాయి. సెక్స్ లేదా హస్త ప్రయోగం సమయంలో మీ హృదయ స్పందన పెరుగుతుంది. అలాగే మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా శ్వాస తీసుకుంటారు. అలాగే అలసిపోతారు. ఈ కారణంగా మీకు గాఢ నిద్ర వస్తుంది.
 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

దీనికి కారణం తెల్ల రక్త కణాల సంఖ్య పెరగడమే. కానీ హస్త ప్రయోగంతో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి సంబంధం ఏంటంటే? న్యూరో ఇమ్యునోమోడ్యులేషన్ తో చేసిన ప్రయోగంలో.. సెక్స్ లేదా హస్త ప్రయోగం తర్వాత ఐదు నిమిషాల వరకు తెల్ల రక్త కణాలు వేగంగా ఉత్పత్తి అవుతాయని కనుగొన్నారు. వాటి సంఖ్య పెరగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Latest Videos

click me!