సక్సెస్ ఫుల్ మ్యారేజ్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అంటే.... వారిలో 90శాతం మంది సెక్స్ లైఫ్ ని బాగా ఆస్వాదిస్తున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ లైఫ్ ని బాగా ప్రేమగా ఆస్వాదించేవారే.. జీవితంలో ఆనందంగా ఉంటారట. ఈ సెక్స్ కారణంగా.. దంపతుల మధ్య నమ్మకం బాగా పెరుగుతుందట.
శారీరకంగా ఓ జంట సన్నిహితంగా ఉంటే.. మానసికంగా కూడా దగ్గరయ్యే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయట. వైవాహిక బంధంలో అందుకే సెక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత నిపుణులు కూడా సూచిస్తుంటారు. అందుకే.. దానిని మరీ పక్కన పెట్టే విషయం కాదని చెబుతున్నారు.
అంతేకాదు.. కొన్ని రకాల అలవాట్లు ఉన్నవారు.. శృంగార జీవితంతోపాటు.. మ్యారేజ్ లైఫ్ ని కూడా ఎక్కువగా ఆస్వాదించగలరట. అవేంటో ఓసారి చూద్దాం..
తమ భాగస్వామి యొక్క అవసరాలను మానసికంగా తీర్చగలిగిన వ్యక్తులు వారి లైంగిక జీవితంలో ఎక్కువ సంతృప్తిని పొందారని నిపుణులు చెబుతున్నారు. ఎంత బాగా ఒకరి మనసును అర్థం చేసుకుంటారో.. వారే సెక్స్ లైఫ్ ని లీడ్ చేయగలుగుతారట.
ఇక చాలా మంది.. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు అంటూ కొట్టిపారేస్తారు కానీ.. భాగస్వామి మనకు చేసే సేవలకు థ్యాంక్స్ చెప్పాలట. అలా థ్యాంక్స్ చెప్పేఅలవాటు ఉన్నవారు.. వారి సెక్స్ లైఫ్ ని ఆనందించగలరట.
ఈ థ్యాంక్స్ అనే చిన్నమాట.. వైవాహిక జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందట. భాగస్వామి లైంగిక కోరికలను తీర్చడానికి.. ఈ ఒక్క చిన్న థ్యాంక్స్ అనే మాట ఎక్కువ ప్రేరణను కలిగిస్తుందట. దీనిపై నిపుణులు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
భాగస్వామి అవసరాలు, డిమాండ్స్ తీర్చే అలవాటు ఉంటే.. వారు సెక్స్ ని బాగా ఆస్వాదించే సత్తా ఉంటుందట. అవసరాలు తీర్చలేనివారితో పార్ట్ నర్ ఎక్కువగా ప్రేమగా ఉండలేరట. దీంతో.. ఎంత కోరికగా ఉన్నా.. వాటిని అణచివేసుకోవాలే తప్ప.. తీర్చుకునే అవకాశం ఉండదు.
అలా కాకుండా.. ముందుగానే భాగస్వామికి ఏమి కావాలో తెలుసుకోవడం.. లేదా.. వారు కోరింది కోరినట్లు తెచ్చిపెట్టాలట. అలా చేసిన వారితో.. భాగస్వామి చాలా ప్రేమగా ఉంటారట. తమకు నచ్చినట్లుగా ఉన్నారనే కృతజ్ఞత వారిలో బలంగా నాటుకుపోతుందట. దీంతో.. పడకగదిలో మీకు నచ్చినట్లుగా వ్యవహరిస్తారట.
అంతేకాదు... వేసుకున్న డ్రెస్ విషయంలో.. చేసిన వంట విషయంలో.. ఇలా ప్రతి విషయంలో ఓ చిన్న ప్రశంస అందించడం కూడా చాలా అవసరమట. అలా ప్రశంస అందించేవారు.. అందుకునేవారు.. ఇద్దరూ.. పడకగదిలో ఎక్కువగా కలయికను ఆస్వాదిస్తారట. వారి లైంగిక జీవితం ఆనందంగా సాగుతుందట.