మద్యం తాగుతూ.. సెక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా..?

First Published | May 17, 2021, 3:30 PM IST

ఆల్కహాల్, సెక్స్.. ఈ రెండు చాలా భిన్నమైనవి. చాలా మంది అనుకుంటారు.. మందు తాగితే.. సెక్స్ చేయాలని అనిపిస్తుంది అని.. కానీ ఈ రెండు దేనికి అవి పూర్తి భిన్నమట.

బయట వాతావరణం చాలా చల్లగా ఉంది కదా..! పేరుకు ఎండాకాలం అయినా.. తుఫాను నేపథ్యంలో వాతావరణం చల్లగానే ఉంది. ఇలాంటి వాతావరణంలో చాలా మందికి తమ పార్ట్ నర్ ని గట్టిగా హత్తుకోవాలని అనిపిస్తుంది.. మరికొందరికి.. చల్లటి గాలిని ఆస్వాదిస్తూ.. వెచ్చగా హార్డ్ ఆల్కహాల్ తాగాలని మనసు లాగుతుంటుంది.
ఇంకొందరికి ఈ రెండు కలిపి చేయాలని అనిపిస్తుంది. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా..? అయితే.. ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అదేంటో చూద్దాం...

ఆల్కహాల్, సెక్స్.. ఈ రెండు చాలా భిన్నమైనవి. చాలా మంది అనుకుంటారు.. మందు తాగితే.. సెక్స్ చేయాలని అనిపిస్తుంది అని.. కానీ ఈ రెండు దేనికి అవి పూర్తి భిన్నమట.
మద్యం సేవించి.. సెక్స్ చేయడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మద్యం సేవించి సెక్స్ చేయడం చాలా ప్రమాదమని న్యూయార్క్ స్టేట్స్ లో ఇటీవల చేసిన పరిశోధనలో తేలింది.
దాదాపు 228 మంది యుతలను వారి పరిశోధన చేశారట. ముఖ్యంగా 18-20ఏళ్ల మధ్య వయసు అమ్మాయిలను పరిశోధించి.. మద్యం సేవించిన తర్వాత వారి సెక్స్ జీవితం గురించి ఆరా తీశారట. అయితే.. వారిలో ఎక్కువ మంది మద్యం తర్వాత సెక్స్ తమకు అస్సలు నచ్చలేదని చెప్పడం గమనార్హం.
మద్యం తాగితే కిక్ వస్తుంది కానీ.. మీ ఆరోగ్యం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అనే విషయం మరచిపోవద్దని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ ఆలోచచను మొదడులో నుంచి తీసేయాలట.
మద్యం సేవించడం వల్ల మహిళల్లో టెస్టో స్టెరాన్ లెవల్స్ పెరుగుతాయట. ఆ హార్మోన్ ఎక్కువగా పురుషుల్లో ఉంటుదట. దీంతో.. ఆ హార్మోన్ సెక్స్ లో కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల సెక్స్ ని ఎంజాయ్ చేయలేరట. మామూలుగా సెక్స్ ని ఎక్కువగా స్త్రీలే ఎంజాయ్ చేస్తారట. మద్యం సేవించడంలో హార్మోన్ లో తేడాలు వచ్చి.. ఇతర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట.
మద్యం తాగడం వల్ల సెక్స్ కోరికలు పెరుగుతాయి అనడంలో ఎలాంటి నిజం లేదట. దాని వల్ల ఎలాంటి కోరికలు పెరగవట. నిజానికి కొందరు మద్యం సేవించడం వల్ల అసలు సెక్స్ చేయలేరట. దానికి అంగాలు పూర్తిగా సహకరించవట.
మద్యం సేవించడం వల్ల పురుషుల్లో టెస్టో స్టెరాన్ లెవల్స్ తగ్గిపోతాయట. దాని వల్ల శృంగార కోరిక కూడా తగ్గిపోతుంది. కాబట్టి మద్యం సేవించడం తగ్గించడం మంచిది.
టెస్టోస్టెరాన్ తగ్గిపోతే.. వీర్య కణాల సంఖ్య కూడా తగ్గిపోతుందట. దీని వల్ల సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి.. మద్యం స్త్రీ, పురుషులకు ఇద్దరికీ నష్టం కలిగించే విషయమే.

Latest Videos

click me!