అబ్బాయికి పెళ్లి కాదనే భయంతో పెళ్లికి ముందు నుంచి అబ్బాయికి ఉన్న మానసిక ఆరోగ్య సమస్యల (Mental health problems) గురించి అమ్మాయికి చెప్పకుండా వివాహం చేస్తారు. కానీ అబ్బాయి మానసిక ఆరోగ్య సమస్యలకు ఉపయోగించే మందుల ప్రభావంతో లైంగిక కోరికలు, స్తంభనాలు తగ్గుతాయి. అబ్బాయి అమ్మాయితో కలయికలో పాల్గొనడానికి కోరికలు, స్తంభనాలు జరగవు. అబ్బాయి ఎందుకు దూరంగా ఉంటున్నాడో అమ్మాయికి తెలియక వారి మధ్య మనస్పర్థలు (Mental disorders) ఎదురవుతాయి.
ఈ మనస్పర్ధలు వారి మధ్య బంధం విడిపోవడానికి దారితీస్తుంది. అబ్బాయి ప్రవర్తన (Behavior) మంచిదైన తనతో కలయికలో ఎందుకు పాల్గొనడంలేదని నిరాశ చెందుతుంది. భార్యాభర్తల బంధంలో దూరం ఏర్పడుతుంది. చివరికి ఆమె అబ్బాయితో విడాకులు (Diverse) తీసుకోవడానికి సిద్ధపడుతుంది. కనుక భార్యాభర్తల బంధం బలపడడానికి పెద్దలు అబ్బాయిలో ఉన్న మానసిక ఆరోగ్య సమస్యల గురించి అమ్మాయికి తెలియజేయడం మంచిది.
అమ్మాయికి నిజం చెప్పినప్పుడు ఆమె మొదట బాధపడుతుంది. మీరు ఎందుకు నిజాలను దాచిపెట్టి పెళ్లి చేశారో ఆమెకు అర్థమయ్యేలా వివరించాలి. ఇలా అమ్మాయికి నిజం చెప్పి
అబ్బాయిలో కోరికలు (Desires), స్తంభనాలు జరిగేందుకు డాక్టర్ ను సంప్రదించాలి. అమ్మాయి కూడా భర్త ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ (Attention) తీసుకోవాలి. అమ్మాయి కూడా భర్తతో కలిసి మానసిక వైద్యుని సంప్రదించి భర్త మానసిక మందుల మోతాదును తగ్గించి, లైంగిక కోరికలు పెరిగే మందులను రాయించుకోవాలి.
పెళ్లి కాదనే భయంతో ఇప్పటివరకూ విషయం దాచిపెట్టినట్టు అమ్మాయికి తెలియపరచాలి. ఇతరత్రా ఎలాంటి చెడు అలవాట్లు (Bad habits), ఎలాంటి ఇబ్బందులూ (Trouble) లేని మంచి వ్యక్తి నుంచి, ఈ ఒక్క కారణంతో విడిపోవాలని ఎవరూ కోరుకోరు. కాబట్టి జరిగిపోయిన దాని గురించి చింతించకుండా, భర్త ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాలి. డాక్టర్లు ఇచ్చిన మందులను భర్తకు అందిస్తూ భర్త ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి తమవంతు సహాయం చేయాలి.
భర్తకు అన్ని విధాలుగా మీ సహాయ సహకారాలను (Supportive contributions) అందజేయాలి. భర్త ఆరోగ్యం మెరుగుపడటంతో మీ వివాహ బంధం ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా కొనసాగుతుంది. మీ దాంపత్య జీవితం కూడా మెరుగుపడుతుంది. మీరు పూర్తిగా శృంగార జీవితాన్ని (Sex life) ఆస్వాదించవచ్చు. భర్తలోని లోపాల కారణంగా విడాకులు తీసుకోవాలని మొదట ఆలోచించరాదు. వారిలోని లోపాలను తొలగించే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఏ భార్య భర్తల జీవితమైనా ఆనందంగా కొనసాగుతుంది.