రోజూ శృంగారం.. మహిళలకు ఎన్నో ప్రయోజనాలు..

First Published | Nov 4, 2020, 5:47 PM IST

రోజూ ఆరోగ్యకరమైన లైంగిక జీవితం స్త్రీల జీవితాల్లో ఎంతో మార్పును తీసుకువస్తుందని, స్త్రీలందరూ ఇలాంటి శృంగారాన్ని ఆస్వాదించడానికి అర్హులు అంటున్నారు వైద్యనిపుణులు.

రోజూ ఆరోగ్యకరమైన లైంగిక జీవితం స్త్రీల జీవితాల్లో ఎంతో మార్పును తీసుకువస్తుందని, స్త్రీలందరూ ఇలాంటి శృంగారాన్ని ఆస్వాదించడానికి అర్హులు అంటున్నారు వైద్యనిపుణులు.
అంతేకాదు ఎంత ఎక్కువగా ఆరోగ్యకరమైన శృంగారంలో పాల్గొంటే వారికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అంత ఎక్కువగా ఉంటాయని కూడా చెబుతున్నారు.

తరచుగా శృంగారంలో పాల్గొనే మహిళల్లో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందట. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంటుందట.
సెక్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తరుచూ సెక్స్ చేసే వారి మెదడు మాత్రమే కాదు, శరీరంలోని ఇతర అవయవాలు కూడా ప్రభావితమవుతాయట. తరుచూ సెక్స్ చేయడం వల్ల ఉత్పత్తయ్యే న్యూరోట్రాన్స్మీటర్లు మెదడు పనితీరును సరిచేస్తాయట.
కలయికలో స్త్రీలు పొందే తృప్తి వల్ల వారి ఆరోగ్యం కూడా మెరుగవుతుందని అధ్యయనాలు తేల్చాయి. వారి శారీరక, మానసిక వికాసానికి ఇది తోడ్పడుతుందట.
రెగ్యులర్ గా లైంగిక కోరికలు తీర్చుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు. ఎక్కువ సెక్స్.. తక్కువ గుండె జబ్బులు అంటున్నాయి అధ్యయనాలు.
క్రమం తప్పకుండా సెక్స్ చేసే వారి సంసార జీవితమూ హాయిగా సాగిపోతుందట. వారి మధ్య ఏ పొరపొచ్చాలూ ఉండవని మానసిక నిపుణులు చెబుతున్నారు. జీవిత భాగస్వామితో లైంగిక సాన్నిహిత్యం వల్ల ఇద్దరి మధ్య అనురాగం పెరిగి కాపురం చికాకులు లేకుండా ఉంటుందట.
శారీర, మానసిక ధృఢత్వానికి సెక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. రతి క్రీడ వల్ల ఒత్తిడి తగ్గడమే గాక.. నిద్రలేమి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
మరి భాగస్వాములు లేని మహిళల పరిస్థతేంటి అనే ప్రశ్నకు నిపుణులు సలహా ఇచ్చారు. హస్తప్రయోగం ద్వారా వారు ఆ ఫీల్ ను పొందగలిగినా.. ఒంటరిగా సెక్స్ చేసుకోవడం ద్వారా మానసిక స్థితి మెరుగుపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని అంటున్నారు.
భాగస్వామి లేని మహిళల్లో నిద్ర, రక్తపోటు సమస్య, ఇతర ఆరోగ్య సమస్యలను గుర్తించినట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
మహిళలు ఎంత తరచుగా శృంగారాన్ని ఆస్వాదిస్తే వారి ఆరోగ్యం అంత బాగుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలా కాకుండా ఎక్కువకాలం శృంగారంలో పాల్గొనని మహిళల్లో.. శారీరక, మానసిక సమస్యలు తలెత్తినట్టు వారు తేల్చారు.

Latest Videos

click me!