లైంగికత, శృంగారం అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన అంశాలు. ఇవి మనిషి సైకాలజీనీ, ఎమోషన్స్ ని ఎంతో ప్రభావం చూపిస్తాయి. కాగా.. కొందరికి ఈ అంశాలపై విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇది చాలా కామన్ విషయం. అయితే... కొందరికి మాత్రం.. అసలు ఆసక్తి ఉండదు. వాటి పేర్లు వింటనే భయపడిపోతుంటారు. కంగారుపడుతుంటారు.
undefined
పెళ్లికి ముందు ఇలాంటి భయాలు ఉండటం వేరు. కానీ.. పెళ్లి తర్వాత కూడా కొందరిలో మార్పు రాదు. దీంతో.. వారికి తెలీకుండానే శృంగారం పై విరక్తి తెచ్చుకుంటారు.
undefined
దీని వల్ల ఒకరకమైన మానసిక సమస్యలకు గురౌతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనినే శృంగార విరక్తి రుగ్మత( సెక్సువల్ ఎవర్షన్ డిజార్డర్) అని పిలుస్తారు. మరి ఈ సమస్య ఏంటి..? దానిని నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం..
undefined
ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం యొక్క లైంగిక సైకోఫిజియోలాజికల్ లాబొరేటరీ ప్రకారం, లైంగిక విరక్తి అనేది లైంగిక సంబంధానికి ఓ ఫోబియా గుర్తించారు. శృంగారమంటే భయపడటం కూడా ఒక రోగమేనని వారు చెబుతున్నారు.
undefined
డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ (DSM-IV-TR)ప్రకారం.. శృంగారం పట్ల ఆసక్తి చూపించకపోవడం.. ఈ విషయంలో తరచూ భాగస్వామిని దూరం పెట్టడం కూడా ఈ ఫోబియా కిందకు వస్తుందని వారు చెబుతున్నారు.
undefined
మైసూర్ లోని జెఎస్ఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, సైకియాట్రీ విభాగం దక్షిణ భారత గ్రామీణ జనాభాపై 2015 లో జరిపిన ఒక అధ్యయనంలో ఐదుగురు మగవారిలో ఒకరు మరియు ఏడుగురు ఆడవారిలో ఒకరు (లేదా అంతకంటే ఎక్కువ) లైంగిక రుగ్మతతో బాధపడుతున్నారని తేల్చారు.
undefined
ఈ రకం ఫోబియా పురుషులలో కంటే మహిళల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుందట. మహిళల్లో ఈ రకం ఫోబియా ఎక్కువగా అత్యాచారం, లైంగిక వేధింపులు, అశ్లీల వీడియోలు తదితర కారణాల వల్ల ఇలాంటి సమస్య మొదలౌతుందట. వారికి ఊహ తెలియని వయసులో ఇలాంటివి ఎదుర్కొనడం వల్ల వారికి తెలియకుండానే ఈ ఫోబియా బారినపడుతున్నారు.
undefined
గతంలో వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల కారణంగా కూడా వారు అలా మారే అవకాశం ఉంటుందట. లేదంటే.. గతంలో ఎవరినైనా ప్రేమించి ఉంటే.. వారు చేసిన గాయలా కారణంగా కూడా ఇలా తయారౌతారట. కనీసం.. తమ పార్ట్ నర్ చెయ్యి పట్టుకోవడానికి కూడా భయపడిపోతున్నారట.
undefined
ఈ ఫోబియా ప్రభావం ఎక్కువగా ఉన్నవారిలో.. సెక్స్ మాట వినపడగానే ఒళ్లంతా చెమటలు పట్టడం.. ఇక దానిని ఎదురుకోవాల్సి వచ్చినప్పుడు ఎక్కువగా టెన్షన్ పడుతుంటారు. కొందరికైతే కడుపులో తిప్పడం.. కళ్ల తిరగడం, హార్ట్ బీట్ ఎక్కువగా పెరిగిపోవడం లాంటివి జరుగుతాయట.
undefined
ఇలాంటి వాళ్లు తమకు ఆ సమస్య ఉంది అని భయటకు చెప్పడానికి కూడా సంకోచిస్తారు. దానికి బదులు ఇతర కారణాలు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. అలా కాకుండా.. సమస్యను ధైర్యంగా బయటకు చెప్పుకోగలిగితే.. కౌన్సిలింగ్ తోనే నయమయ్యే అవకాశం ఉంటుంది.
undefined