శృంగారంలో వయసు తృప్తి...!

First Published | Dec 28, 2020, 3:08 PM IST

తమకింకా వయసు మీద పడలేదని వృద్ధాప్యం రాలేదని అందరూ అనుకోవాలని అలా తక్కువగా చెబుతుంటారు. అయితే.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి భావన ఇప్పుడు శృంగారంపై తీవ్ర ప్రభావం చూపుతోందట.

శృంగారాన్ని ఆస్వాదించాలంటే.. వారు వయసు కుర్రాళ్లే కావాల్సిన పని లేదు. దానిపై ఆసక్తి ఉంటే.. ముసలివాళ్లం అయిపోయామే భావన లేకుంటే.. వాళ్లు హాయిగా ఆస్వాదించవచ్చు.
అసలు శృంగారానికి వయసుతో సంబంధం ఉందా.. అంటే.. ఉందని నిపుణులు చెబుతున్నారు. వయసు విషయంలో ఓ రకమైన తృప్తి ఫీలైనవాళ్లు దానిని మరింతగా ఆస్వాదిస్తారట. ఇంతకీ విషయం ఏమిటంటే..

చాలా మంది మీ వయసు ఎంత అని అడగగానే.. అసలు దానికన్నా.. ఒకటి రెండు సంవత్సరాలు తక్కువగా చెబుతుంటారు.
తమకింకా వయసు మీద పడలేదని వృద్ధాప్యం రాలేదని అందరూ అనుకోవాలని అలా తక్కువగా చెబుతుంటారు. అయితే.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి భావన ఇప్పుడు శృంగారంపై తీవ్ర ప్రభావం చూపుతోందట.
శృంగారంలో తృప్తి పొందామనే భావనకు ఈ మానకి వయసు కూడా కీలకంగా వ్యవహరిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
వాటర్ లూ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇటీవల 40-60 ఏళ్ల వయసువారిలో శృంగార ధోరణులపై ఓ అధ్యయనం చేసి మరీ దీన్ని గుర్తించారు.
అసలు వయసుతో పోలిస్తే.. మానసికంగా తక్కువ వయసులో ఉన్నామని భావించేవారు శృంగారాన్ని మరింత బాగా ఆస్వాదిస్తున్నట్లు తేల్చారు.
అంటే దీనర్థం ఇలాంటివాళ్లు ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటున్నారని కాదు.. శృంగారనుభూతి విషయంలో చాలా ఆనందాన్ని పొందుతున్నారని అర్థం.
వయసుతోపాటు వచ్చే దీర్ఘకాల సమస్యలను పరిగణలోకి తీసుకొని చూసినా కూడా తక్కువ వయసులో ఉన్నామని భావించేవారు శృంగారాన్ని చాలా బాగా ఆస్వాదించడం విశేషం.
వయసు తక్కువని భావించేవారు సహజంగానే చురుకుగా ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి కూడా వీరే ఎక్కువగా చేస్తారట.
ఇవన్నీ బలమైన లైంగిక వాంఛలు కలగటానికి, శృంగారాన్ని ఆనంద సాధనంగా భావించడానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos

click me!