రోజుకు మూడుసార్లు శృంగారం ..కొంప ముంచిందిగా

First Published Jun 16, 2020, 3:05 PM IST

కలయిక లేనిదే సంతానం లేదు.. ఈ విషయం మనకి తెలుసు. కానీ అదే కలయిక కారణంగా పిల్లలు పుట్టకుండా సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఉన్నారు.
 

శృంగారం మానవ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సృష్టి ఆధారపడి ఉన్నది కూడా శృంగారం మీదే ఈ విషయం మనందరికీ తెలుసు. అయినా.. దీని గురించి చర్చించడానికి చాలా మంది జంకుతుంటారు.
undefined
తమలో సమస్యలు ఉన్నా ఎవరికీ చెప్పకుండా లోలోపలే దాచుకుంటారు. తద్వారా సమస్య మరింత ఎక్కువై.. అసలు పిల్లలు పుట్టే అవకాశం లేకుండాపోతున్నాయి.
undefined
భార్యాభర్తల మధ్య జరిగే రతిక్రీడ కూడా గర్భం దాల్చకుండా చేస్తాయంటే ఆశ్చర్యపోకుండా ఉండగలరా? మీరు చదివింది నిజమే. కలయిక లేనిదే సంతానం లేదు.. ఈ విషయం మనకి తెలుసు. కానీ అదే కలయిక కారణంగా పిల్లలు పుట్టకుండా సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఉన్నారు.
undefined
దీనిపై ఓ సంస్థ పలు మార్లు పరిశోధనలు చేయగా.. ఈ విషయం వెల్లడయ్యింది. ఆ పరిశోధన ప్రకారం తెలిసిన కొన్ని ఆసక్తికర విషయాలు..
undefined
సంతానోత్పత్తికి శృంగారం ఎంత ముఖ్యమో వేరుగా చెప్పనక్కర్లేదు. కానీ ఉద్యోగం, డబ్బు, ఫ్రెండ్స్‌, పార్టీలు అంటూ బిజీ అయిపోయి శృంగారజీవితాన్ని మర్చిపోతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు.
undefined
వారానికి రెండు వారాలకోసారి తూతూమంత్రంగా శృంగారంలో పాల్గొంటూ మమ అనిపిస్తున్నారు. అలాంటివారే ఎక్కువగా సంతాన సాఫల్య కేంద్రాల ముందు నిలబడుతున్నారు.
undefined
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారానికి కనీసం మూడు సార్లు శృంగారంలో పాల్గొంటున్నారంటే, వారి వైవాహిక జీవితం బాగానే ఉన్నట్లు లెక్క. ఈ లెక్క మించినా ఫరవాలేదు. కానీ స్త్రీల అండోత్పత్తికి అనుగుణంగా శృంగారాన్ని సరిచూసుకుంటే మంచిది.
undefined
కొందరు రోజుకు రెండుమూడు సార్లు శృంగారంలో పాల్గొంటుంటారు. దీనివల్ల మానసిక సంతృప్తి తప్పితే సంతానసాఫల్యానికి అంతగా ఉపయోగపడదని నిపుణులు చెబుతున్నారు.
undefined
ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే వీర్యకణాలు వృథా అవుతుంటాయని డాక్టర్‌ బిట్నెర్‌ వివరిస్తున్నారు. అండోత్పత్తి సమయంలో జరిగే శృంగారంలో తగినంత స్థాయిలో వీర్యకణాలు విడుదలవకపోతే మొదటికే మోసం వస్తుందంటున్నారాయన.
undefined
ఇక సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారిలోనూ పిల్లలు పుట్టడం ఆలస్యం కావడం లేదా.. అసలు పుట్టకుండా ఉండటం లాంటివి జరుగుతున్నాయి.
undefined
సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగే వాళ్లల్లో 13శాతం మంది సిగరెట్‌ తాగే అలవాటు ఉన్నవాళ్లేనని అమెరికన్ సొసైటీ ఆఫ్‌ రిప్రొడక్టివ్‌ మెడిసిన్ చేసిన పరిశోధనలో తేలింది.
undefined
మహిళల్లో అండోత్పత్తికి సిగరెట్‌ అలవాటు అడ్డుపడితే, పురుషుల్లో వీర్యకణాల వృద్ధిని నాశనం చేస్తుంది..
undefined
యువకులు, కొత్తగా పెళ్ళయిన వాళ్లయినా ఈ విషయం తెలుసుకుని సిగరెట్‌ మానితే సంసార బంధం చక్కగా సాగిపోతుంది.
undefined
click me!