పడకగదిలో ఇలా ఉంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఎప్పటికీ తగ్గదు

వాస్తుశాస్త్రం ప్రకారం.. సంతోషకరమైన, మంచి వైవాహిక జీవితానికి పడకగది చాలా ముఖ్యమైంది. పడకగది సరిగ్గా ఉంటే వైవాహిక జీవితం బాగుంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే పడకగది సరిగ్గా లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. అంతేకాదు విడాకుల వరకు వెళ్లే అవకాశం ఉంది. మరి పడగది ఎలా ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శుక్రుడు పడకగదిపై ఆధిపత్యం చెలాయిస్తాడు. అందుకే భార్యాభర్తల మధ్య తక్కువ గొడవలు, పరస్పర సామరస్యం, ప్రేమ, నిబద్ధత ఉండేలా పడకగదిని నిర్మించుకోవాలంటారు. పడకగదిలో వాస్తు లోపం ఉంటే మీ వైవాహిక జీవితంపై చెడు ప్రభావం పడుతుందన్న విషయం తెలిసిందే. అయితే శని, రాహువు వంటి వేర్వేరు గ్రహాలు కూడా భార్యాభర్తలపై సంచరిస్తే విడాకులు తీసుకునే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
 

Sexual Relationship

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు పడకగది వాస్తు దోషాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. చైనీస్ వాస్తు శాస్త్రంలో ఫెంగ్ షుయ్.. క్షీణిస్తున్న సంబంధాలను పునర్నిర్మించడానికి ఉపయోగించే కొన్ని చిట్కాలను వివరిస్తుంది. పెళ్లై ఏండ్లు గడుస్తున్నా.. భార్యాభర్తల బంధంలో మాధుర్యాన్ని ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం పదండి.
 


ఫోటోలు

హింస లేదా యుద్ధాన్ని చిత్రీకరించే ఫోటోలు భార్యాభర్తల మధ్య గొడవలను పుట్టిస్తాయి. హింస చిత్రాలు మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. అందుకే పడకగదిలో దూకుడు, హింసాత్మక చిత్రాల కంటే ప్రేమ, శాంతి, కరుణ, దయను చూపే చిత్రాలనే ఉంచండి. అలాగే పడకగదిలో భార్యాభర్తలు చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో పెట్టడం వల్ల భార్యాభర్తల బంధం సంతోషంగా సాగుతుంది. 
 

రెండు బెడ్ లు

పడకగదిలో రెండు వేర్వేరు బెడ్ లకు బదులుగా ఒక ఒక డబుల్ బెడ్ నే పెట్టాలి. దీన్నే ఉపయోగించాలి. దీనివల్ల భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, మనస్పర్థలు తొలగిపోతాయి. రెండు పడకలు ఉండటం వల్ల సంబంధంలో చీలిక ఏర్పడుతుంది.

ప్రేమ పక్షులు

మీరు మీ భాగస్వామితో అన్యోన్యంగా లేకపోతే మీ పడకగదిలో ప్రేమ పక్షుల చిత్రాన్ని పెట్టండి. చైనీస్ వాస్తు శాస్త్రం ఫెంగ్ షుయ్ ప్రకారం.. ఇది భార్యాభర్తల మధ్య సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఒకరిపై ఒకరికి ప్రేమను పెంచుతుంది.

నిద్ర భంగిమ

మంచి జీవిత భాగస్వామి కావాలంటే అవివాహిత స్త్రీ, పురుషులు తమ నిద్ర భంగిమపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. పెళ్లికాని స్త్రీ పురుషులు పడకగది తలుపు ముందు తలలు, కాళ్లు పెట్టుకుని పడుకోకూడదు. ఇది మంచి శకునం కాదు. 

మొక్కలు

సాధారణంగా.. ఆకుపచ్చ మొక్కలు ఆక్సిజన్ స్థాయిలను పెంచుతాయి. అందుకే ఇంట్లో మొక్కలను ఉంచడం మంచిది. కానీ ఫెంగ్ షుయ్ ప్రకారం.. ఆకుపచ్చ చెట్లు, మొక్కలు, తాజా పువ్వులను అండర్ గ్రాడ్యుయేట్ బాలురు, బాలికల పడకగదిలో ఉంచకూడదు. ఎందుకంటే ఇది వైవాహిక జీవితానికి అడ్డంకి అని చెబుతారు.
 

Latest Videos

click me!